వేన్ లో కాసేపు ప్రయాణం చేసిన పిదప, మా ఎనమండుగురమూ
అక్కడ ఎండలో— తెల్లని చొక్కాలు ఒంటికి అంటుకుపోతుంటే,
ఆమె చేతులనుండి తీసిన గ్లోవ్జ్ తో ముఖం విసురుకుంటూ.
పనివాళ్ళు ఒక పెద్ద నీలం గుడారం నిలబెట్టారు
సమాధితవ్వుతున్న మాకు ఎండనుండి రక్షణకి
ఈ మధ్యాహ్నం అంతా ఎండ మహాతీవ్రంగా కాసింది
పక్కన నిటారుగా నిల్చున్న ఎల్మ్ చెట్లమీంచి
అడుగులో అడుగేసుకుంటూ మా నెత్తిమీంచే నడిచేడు సూర్యుడు.
ఒక సుదీర్ఘ ప్రవాహంలా చుట్టుపక్కలవాళ్ళూ, స్నేహితులూ,
ఊరిలోని పెద్దలూ, ఆమె నడిపే మెయికప్పు దుకాణం వినియోగదారులూ,
ఆమె క్లబ్బులోని ప్రముఖులూ… ప్రార్థనలతో నిండిన
ప్రపంచమంతా’తర్వాత’వచ్చింది… అన్నాడతను.
తలపైకెత్తి చూస్తే— చెట్ల చేతులు, అవే వాటి ఆకులు,
ఆత్మనిగ్రహంతో ముడుచుకున్నట్టు, లేదా తమలో తాము బాధపడుతున్నట్టు
ఇపుడు తెరుచుకుని, సన్నటి ఈనెలు కనిపిస్తూ వెడల్పైన చేతులని
ఎండవేడిమికో లేక దుఃఖం వల్లనో గాని, ఊపుతున్నాయి (వీడ్కోలుగా).
.
డెవిడ్ బేకర్
(Born Dec 27, 1954)
అమెరికను కవి
Note: ఈ కవితలో గమనించ వలసిన రెండు మాటలున్నాయి. చాలా సాదాసీదాగా రాసినట్టు ఉన్నా, కవితలోని భావాన్ని చక్కగా పట్టిస్తాయి. మొదటిది మూడో పద్యం ఆఖరి లైనులో వాడిన “తర్వాత” అన్నమాట. అంటే, ఆమె బ్రతికుండగా ప్రపంచం పట్టించుకో లేదన్న మాట. ఆమె చనిపోయిన తర్వాత మాత్రం తన లేని దుఃఖాన్ని ప్రకటించడానికీ భక్తిని ప్రకటించడానికీ తయారు. దానికి అనుగుణంగా, ఈ భావాన్ని బలపరుస్తూ, ఆఖరి పాదంలో చెప్పిన “ఏమడవేడిమికో దుఃఖానికో తెలియదు గాని” అన్న మాట. ఇక్కడ మరొక చిన్న విశేషం ఉంది. మొదటి పద్యంలో “ఆమె చేతినుండి తీసిన గ్లోవ్జ్” తో సమాధులు తవ్వేవాళ్ళు గాలి విసురుకుంటున్నాటు. మనకి చెందని వాళ్ల మృతిపట్ల ప్రపంచానికుండే నిర్లిప్తతకి ఒక చక్కని ఉదాహరణ.
Dabid Baker
Click here for bio of the poet
.
Afterwards
.
A short ride in the van, then the eight of us
there in the heat—white shirtsleeves sticking,
the women’s gloves off—fanning our faces.
The workers had set up a big blue tent
to help us at graveside tolerate the sun,
which was brutal all afternoon as if
stationed above us, though it moved limb
to limb through two huge, covering elms.
The long processional of neighbors, friends,
the town’s elderly, her beauty-shop patrons,
her club’s notables. . . The world is full of
prayers arrived at from afterwards, he said.
Look up through the trees—the hands, the leaves
curled as in self-control or quietly hurting,
or now open, flat-palmed, many-fine-veined,
and whether from heat or sadness, waving.
.
David Baker
(Born Dec 27, 1954)
American Poet
Poem Courtesy: http://www.poetryfoundation.org/poems-and-poets/poems/detail/49863
స్పందించండి