వార్తాపత్రికల్లోనూ, ప్రకటన ఫలకాలమీదా
పోగొట్టుకున్న వస్తువులగురించి వెదుకుతుంటాను.
ఈ విధంగా మనుషులు ఏమి పోగొట్టుకున్నారో
వాళ్ళకి ఏవంటే ఇష్టమో నాకు తెలుస్తుంది.
ఒకసారి అలసిన నా తల
దట్టంగా జుట్టున్న నాగుండెపై వాలిపోయింది.
అక్కడ మా నాన్న శరీర వాసన ముక్కుకి తాకింది
అదీ, చాలా సంవత్సరాల తర్వాత.
నా జ్ఞాపకాలు ఎలాంటివంటే
తిరిగి చెకోస్లొవేకియా పోలేని వాడూ
చిలీకి తిరిగిపోవాలంటే భయపడేలాంటి వాడివి.
ఒక్కోసారి నాకు కనిపిస్తుంది
పాలిపోయిన నేలమాళిగవంటి గదీ…
అక్కడ మేజామీద
ఒక టెలిగ్రామూ…
.
యెహుదా అమిఖాయ్
3 May 1924 – 22 September 2000
ఇజ్రేలీ కవి.
.
Photo Courtesy: poets.org
స్పందించండి