నానావర్ణ సౌందర్య జగతి… గెరార్డ్ మేన్లీ హాప్కిన్స్, ఇంగ్లీషు కవి
ఇంత చిత్రవిచిత్రమైన జగతిని ప్రసాదించిన దేవునికి నమస్సులు!
కపిలధేనువులాంటి రంగు రంగుల ఆకాసామూ,
రంగు వేసినట్టు నీటిలో ఈదే చేపపిల్లలూ,
రాక్షసిబొగ్గు మంటలాంటి రాలిపడ్ద చెస్ట్ నట్ పళ్ళూ,
భిన్న వర్ణాల చారల రెక్కలున్న పిట్టలూ,
పశులమందలతో, పంటలతో, దుక్కిదున్నీ, బీడుపడీ నేలా,
జాలరీ, దర్జీ, మొదలైన ఎన్నో వృత్తిపనుల వారి పనిముట్లూ,
ప్రకృతి సిద్ధమూ, మానవ నిర్మితమూ, అరుదైనవీ, చిత్రమైన వస్తువులూ,
ఊసరవెల్లిలా స్థిరంలేని రంగులుగల జీవులూ (ఎలా మారుస్తాయో ఎవరికెరుక?)
కొన్ని వేగవంతమూ, కొన్ని నెమ్మది; కొన్ని తీయన, కొన్ని పుల్లన;
కొన్ని మిరుమిట్లు గొలుపుతూ, కొన్ని కాంతి విహీనంగా
ఇన్నిటినీ సృష్టించగల ఆ దేముని సౌందర్యం … మార్పుకి అతీతం
అతన్ని కీర్తించండి!
.
గెరార్డ్ మేన్లీ హాప్కిన్స్
28 July 1844 – 8 June 1889
ఇంగ్లీషు కవి
.
.
Pied Beauty
.
Glory be to God for dappled things,
For skies of couple-color as a brinded cow,
For rose-moles all in stipple upon trout that swim;
Fresh-fire coal chestnut-falls, finches’ wings;
Landscape plotted and pieced, fold, fallow and plough,
And all trades, their gear and tackle and trim.
All things counter, original, spare, strange,
Whatever is fickle, freckled (who knows how?)
With swift, slow; sweet, sour; adazzle, dim.
He fathers-forth whose beauty is past change;
Praise him.
.
Gerard Manley Hopkins
28 July 1844 – 8 June 1889
English Poet
Poem Courtesy:
http://wonderingminstrels.blogspot.in/1999/06/pied-beauty-gerard-manley-hopkins.html
నేను అందంగా,యవ్వనంలో ఉన్నపుడు… ఎలిజబెత్ మహారాణి 1
నేను అందంగా,యవ్వనంలో దేముని అనుగ్రహానికి పాత్రమైనపుడు
చాలామంది నా చేయి అర్థిస్తూ ప్రాధేయపడ్డారు.
నేను వాళ్ళందరినీ తిరస్కరించాను. సమాధానంగా,
“ఫో! ఫో! ఇంకెక్కడైనా వెతుక్కో,
బ్రతిమాలుతూ మరి నన్ను విసిగించొద్దు” అన్నాను
ఎన్ని కళ్ళు దుఃఖంతో విచారిస్తూ ఏడవడం చూశాను
ఎన్ని హృదయాలు నిట్టుర్చేయో నేను చూపించగల శక్తి నాకు లేదు.
అయినా రోజూ గర్వంతో మిడిసిపడుతూ వాళ్ళతో అన్నాను:
“ఫో! ఫో! ఇంకెక్కడైనా వెతుక్కో,
బ్రతిమాలుతూ మరి నన్ను విసిగించొద్దు” అని.
ఒకరోజు సౌందర్యాధిదేవత వీనస్ కుమారుడైన క్యూపిడ్
“సుందరీ! నువ్వు అంత సిగ్గుపడుతున్నావు కనుక,
నీ అందాలు నేను త్రుంచెస్తున్నాను; నిన్నాశించేవారిని ఇకపై
“ఫో! ఫో! ఇంకెక్కడైనా వెతుక్కో,
బ్రతిమాలుతూ మరి నన్ను విసిగించొద్దు” అని అనక్కరలేదు.
అతనామాట అన్నతర్వాత, నా గుండెలో ఎంత బాధకలిగిందంటే
ఆ క్షణం నుండీ పగలూ రాత్రీ నాకు మనశ్శాంతి దొరకలేదు.
అదిగో, అప్పటినుండి విచారిస్తూనే ఉన్నాను:
“ఫో! ఫో! ఇంకెక్కడైనా వెతుక్కో,
బ్రతిమాలుతూ మరి నన్ను విసిగించొద్దు” అని అన్నందుకు.
.
ఎలిజబెత్ మహా రాణి-1
ఇంగ్లీషు
When I was fair and young, and favour graced me
.
When I was fair and young, and favour graced me,
Of many I was sought their mistress for to be.
But I did scorn them all, and answered them therefore,
‘Go, go, seek some otherwhere
Importune me no more.’
How many weeping eyes I made to pine with woe;
How many sighing hearts I have no skill to show.
Yet I the prouder grew, and answered them therefore,
‘Go, go, seek some otherwhere
Importune me no more.’
Then spake fair Venus’ son, that proud victorious boy,
And said, “Fine dame, since that you be so coy
I will so pluck your plumes that you shall say no more
‘Go, go, seek some otherwhere
Importune me no more.'”
When he had spake these words, such charge grew in my breast
That neither night nor day since that, I could take any rest.
Then lo, I did repent that I had said before,
‘Go, go, seek some otherwhere
Importune me no more.’
.
Queen Elizabeth I
నాకు తెలుసు… సర్ జాన్ డేవీస్, ఇంగ్లీషు కవి
నా శరీరం ఎంత దుర్బలమో నాకు తెలుసు
బయటి శక్తులూ, లోపలి బలహీనతలూ దాన్ని చంపగలవు;
నా మనసు దివ్యస్వభావమూ తెలుసు
కానీ, దాని తెలివీ, ఇఛ్ఛ కలుషితమైపోయాయి.
నా ఆత్మకి అన్నీ తెలుసుకోగల శక్తి ఉందని తెలుసు
కానీ అది గుడ్డిగా, మూర్ఖంగా ప్రవర్తిస్తుంది;
నేను ప్రకృతి గారాబు పట్టిలలో ఒకడినని తెలుసు
కానీ చాలా అల్పవిషయాలకీ, బలహీనతలకీ దాసుణ్ణి.
నాకు జీవితం బాధామయమనీ, క్షణికమనీ తెలుసు
నా ఇంద్రియాలు ప్రతిదానిచే కవ్వింపబడతాయనీ తెలుసు,
చివరగా, నాకు నేను మనిషినని తెలుసు, అందుకు
ఒక పక్క గర్వమూ, మరొకవంక దైన్యమూ ఉన్నాయి.
.
సర్ జాన్ డేవీస్,
16 April 1569 – 8 December 1626
ఇంగ్లీషు కవి
.
Of Human Knowledge
.
I know my body’s of so frail a kind,
As force without, fevers within can kill;
I know the heavenly nature of my mind,
But ’tis corrupted both in wit and will.
I know my Soul hath power to know all things,
Yet is she blind and ignorant in all;
I know I am one of Nature’s little kings,
Yet to the least and vilest things am thrall.
I know my life’s a pain and but a span,
I know my Sense is mock’d with every thing:
And to conclude, I know myself a MAN,
Which is a proud, and yet a wretched thing.
.
Sir John Davies
16 April 1569 (baptised) – 8 December 1626
English poet
కవన కళ … ఆర్చిబాల్డ్ మెక్లీష్, అమెరికను కవి
అరచేతిలోని గుండ్రని పండులా
కవిత మౌనంగా ఉండాలి.
బొటనవేలికి వేలాడుతున్న పతకాల్లా కనిపించాలి,
మాటాడకూడదు.
నాచు పట్టి, అరిగిపోయిన కిటికీగట్టు
నాపరాయి పలకలా నిశ్శబ్దంగా ఉండాలి.
ఎగురుతున్న పక్షులగుంపులా
కవిత మాటలకందకుండా ఉండాలి
*
చందమామ ఆకాశానికి ఎగబాకుతున్నట్టు
కవిత కాలాతీతంగా ఉండాలి.
విడిచిపెడుతున్నపుడు, రాతిరిలో చిక్కుబడ్ద చెట్ల
కొమ్మల్ని చంద్రుడు ఒకటొకటిగా వీడినట్టు వీడాలి
పూర్తయిన తర్వాత, హేమంతపు చంద్రుడు
విడిచిపెట్టే ఒక్కొక్క జ్ఞాపకంలా వదలాలి.
చందమామ ఆకాశానికి ఎగబాకుతున్నట్టు
కవిత కాలాతీతంగా ఉండాలి.
*
కవిత సత్యానికి దగ్గరగా ఉండాలి
సత్యం కాకూడదు.
బాధాతప్తమైన దాని చరిత్రకి…
అది ఒక వాకిలి, ఒక చల్లని వీవన కావాలి.
ప్రేమకి సంకేతమైనపుడు
వాలిన పరకల్లా, సంద్రం మీది వెలుగుల్లా ఉండాలి
కవిత ఏ సందేశమూ ఇవ్వనక్కరలేదు,
దానికదిగా ఉండాలి.
.
ఆర్చిబాల్డ్ మెక్లీష్
(May 7, 1892 – April 20, 1982)
అమెరికను కవి
Ars Poetica
A poem should be palpable and mute
As a globed fruit
Dumb
As old medallions to the thumb
Silent as the sleeve-worn stone
Of casement ledges where the moss has grown –
A poem should be wordless
As the flight of birds
*
A poem should be motionless in time
As the moon climbs
Leaving, as the moon releases
Twig by twig the night-entangled trees,
Leaving, as the moon behind the winter leaves,
Memory by memory the mind –
A poem should be motionless in time
As the moon climbs
*
A poem should be equal to:
Not true
For all the history of grief
An empty doorway and a maple leaf
For love
The leaning grasses and two lights above the sea –
A poem should not mean
But be
.
Archibald MacLeish
May 7, 1892 – April 20, 1982)
American Poet
Poem Courtesy:
http://wonderingminstrels.blogspot.in/1999/08/ars-poetica-archibald-macleish.html
దేముడు లేడు… ఆర్థర్ హ్యూ క్లఫ్, ఇంగ్లీషు కవి
“దేముడు లేడు” అంటాడు దుర్మార్గుడు,
“అది నిజంగా ఎంత అదృష్టమో,
లేకపోతే, నన్నేమి చేసేవాడో
అది ఊహ కందని విషయం.”
“దేముడు లేడు,”అనుకుంటాడు యువకుడు,
“నిజంగా ఉండడం అంటూ తటస్థిస్తే,
మనిషి ఎప్పుడూ పసివాడుగా
ఉండాలని కోరుకుంటాడనుకోను.”
“దేముడు లేడు, ఉండి ఉంటేనా,”
ఒక వ్యాపారి అనుకుంటాడు,”ఊహకి చిత్రంగా ఉంటుంది
అతను నేను ఏదో నాలుగు డబ్బులు చేసుకుంటే
దాన్ని తప్పుగా తీసుకోవడం.”
“దేముడు ఉన్నా లేకున్నా,” అనుకుంటాడో ధనికుడు
“పెద్ద తేడా ఏమీ పడదు. ఎందుకంటే
నేనూ, నా వాళ్ళూ కృతజ్ఞతలు చెప్పుకుంటాం
భుక్తికి ఏ లోటూ లేనందుకు.”
చాలా మంది తమలో తాము
ఏ మాత్రం శంకించని వాళ్ళు కూడా
అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు,దేముడు
లేడనుకుని, ఆ విషయం ఆలోచించరు.
కానీ చర్చి నీడన బ్రతికే
గ్రామీణ ప్రజలూ
మతాధికారీ, అతని భార్యా
ఎక్కువమంది పెళ్ళయిన వాళ్ళూ
యవ్వనం అంకురించి తొలిప్రేమ తీయదనం
ఆస్వాదిస్తూ ఆ భ్రమలో బ్రతికే వాళ్ళూ;
లోకం అపరాధమనేదానిలో చిక్కుకున్నవాళ్ళూ
మొదటిసారిగా గందరగోళంలొ పడినవాళ్ళూ
ఒకరేమిటి, ముదిమి మీదపడ్డవాళ్ళూ
రోగాలూ, బాధలు ఒక్కసారి చుట్టుముట్టిన వాళ్ళందరూ
దైవమో, దానికి సమానమైన శక్తో ఒకటి
ఉన్నదని నమ్మడానికి సిద్ధంగా ఉంటారు.
.
ఆర్థర్ హ్యూ క్లఫ్
ఇంగ్లీషు కవి
There is No God
.
There is no God,’ the wicked saith,
‘And truly it’s a blessing,
For what he might have done with us
It’s better only guessing.’
‘There is no God,’ a youngster thinks,
‘Or really, if there may be,
He surely did not mean a man
Always to be a baby.’
‘There is no God, or if there is,’
The tradesman thinks, ‘’twere funny
If he should take it ill in me
To make a little money.’
‘Whether there be,’ the rich man says,
‘It matters very little,
For I and mine, thank somebody,
Are not in want of victual.’
Some others, also, to themselves,
Who scarce so much as doubt it,
Think there is none, when they are well,
And do not think about it.
But country folks who live beneath
The shadow of the steeple;
The parson and the parson’s wife,
And mostly married people;
Youths green and happy in first love,
So thankful for illusion;
And men caught out in what the world
Calls guilt, in first confusion;
And almost everyone when age,
Disease, or sorrows strike him,
Inclines to think there is a God,
Or something very like Him.
.
Arthur Hugh Clough
1 January 1819 – 13 November 1861
English Poet and Educationist and a devoted Assistant to Florence Nightingale.
Poem Courtesy: http://www.poetrybyheart.org.uk/poems/there-is-no-god/
.
భ్రమ … మ్యూరియల్ రుకేసర్, అమెరికను కవయిత్రి
( గ్రీకు ఇతిహాసంలోని ఒక చిన్న సంఘటనని ఆధారంగా తీసుకుని ఒక పదునైన స్త్రీవాదకవిత అల్లింది కవయిత్రి, ఏ ఆర్భాటాలూ, ప్రవచనాలూ లేకుండా. కవిత ముగింపు ఎంత సునిశితంగా చేసిందో గమనించగలరు.)
.
చాలా కాలం గడిచేక
ఈడిపస్, వయసు ఉడిగి, గుడ్డివాడై రోడ్డుమీద నడుస్తున్నాడు.
అతనికి బాగా పరిచయమున్న వాసన ముక్కుపుటాలను తాకింది.
అది సింహిక (sphinx)ది.
ఈడిపస్ అన్నాడు:”నిన్నొక ప్రశ్న అడగాలని ఉంది.
నేను నా తల్లిని ఎందుకు గుర్తించలేకపోయాను?”
“నువ్వు తప్పు సమాధానం చెప్పేవు,” అంది సింహిక.
“కానీ అదొక్కటే గదా మూడింటికీ సరియైన సమాధానము?”
అన్నాడు ఈడిపస్.
“కాదు,” అంది సింహిక,
“నేను ఏది నాలుగుకాళ్ళతో ఉదయం, రెండుకాళ్ళతో మధ్యాహ్నం,
మూడు కాళ్ళతో సాయంత్రం నడుస్తుంది? అని అడిగినపుడు
నువ్వు మనిషి అన్నావు. నువ్వు స్త్రీ గురించి
మాటాడలేదు.”
“నేను మనిషి అన్నప్పుడు పురుషుడే కాదు
అందులో స్త్రీ అన్న అర్థం కూడా
కలిసే ఉంది, ఆ విషయం అందరికీ తెలిసిందే “అన్నాడు ఈడిపస్.
“అని నువ్వు అనుకుంటున్నావు,” అంది సింహిక.
.
మ్యూరియల్ రుకేసర్
(December 15, 1913 – February 12, 1980)
అమెరికను కవయిత్రి.
.
Myth
.
Long afterward,
Oedipus, old and blinded, walked the roads.
He smelled a familiar smell.
It was the Sphinx.
Oedipus said, “I want to ask one question.
Why didn’t I recognize my mother?”
“You gave the wrong answer,” said the Sphinx.
“But that was what made everything possible,” said Oedipus.
“No,” she said.
“When I asked,
What walks on four legs in the morning,
Two at noon, and three in the evening,
You answered, Man.
You didn’t say anything about woman.”
“When you say Man,” said Oedipus,
“You include women too.
Everyone knows that.”
She said, “That’s what you think.”
.
Muriel Rukeyser
(December 15, 1913 – February 12, 1980)
American Poet and Activist
Poem Courtesy:
http://wonderingminstrels.blogspot.in/2000/12/myth-muriel-rukeyser.html
కిటికీ ప్రక్క బాలుడు… రిచర్డ్ విల్బర్, అమెరికను కవి
మంచుమనిషి (స్నోమాన్*) అలా ఒక్కడూ చీకటిపడ్డాక
చలిలో నిలబడటం చూసి తట్టుకోవడం అతనివశం కాలేదు.
ఈదురుగాలి ఇక రాత్రల్లా పళ్ళుకొట్టుకునేలా గడగడ వణికించడానికి
సిద్ధం అవడం చూసి ఆ చిన్ని కుర్రాడికి ఏడుపొచ్చింది.
బహిష్కృతుడైన ఏడం స్వర్గం వీడుతూ చూసిన చూపువంటి
దైవోపహతుడైన చూపు చూస్తున్న
పాలిన ముఖం, తారు కళ్ళుకలిగిన ఆ బొమ్మని
కన్నీరు నిండిన కళ్ళలోంచి అతని చూపులు చేరకున్నాయి.
అంత పరిస్థితిలోనూ, మంచుమనిషి సంతృప్తిగానే ఉన్నాడు,
అతనికి ఇంటిలోనికి పోయి చనిపోవాలని లేదు.
కానీ, ఆ పసివాడు ఏడవడం చూసిన అతనికి మనసు ద్రవించింది.
గడ్డకట్టిన నీరు అతని స్వభావం అయినప్పటికీ
అతని కరుణార్ద్రమైన కన్నులలోనుండి ఒక అశ్రుకణం
వానచినుకంత స్వచ్చమైనది కరిగి జారింది…
ఆ ఉజ్జ్వలమైన కిటికీప్రక్క కూచున్న కుర్రాడిని ఆవరించిన
అంత వెచ్చదనం, అంత వెలుగూ, అంతప్రేమా, అంత భయం చూసి.
.
రిచర్డ్ విల్బర్
జననం March 1, 1921
అమెరికను కవి
*స్నోమాన్: మంచుకురిసే ప్రాంతాల్లో చాపచుట్టినట్టు కురిసిన మంచును చుట్టి, దాన్ని గోళాకారంగా తయారు చేసి, ఇలాంటి 3 మంచుగోళాలను ఒక దాని మీద ఒకటి పేర్చి, దానికి ఎండుకొమ్మలు చేతులుగా, కేరట్ ముక్కుగా, తారు ఉండలను కళ్ళుగా అమర్చి, మఫ్లరు చుట్టి మనిషిలా తయారు చెయ్యడం పిల్లలకూ, పెద్దలకూ ఒక క్రీడ.
.
Boy at the Window
Seeing the snowman standing all alone
In dusk and cold is more than he can bear.
The small boy weeps to hear the wind prepare
A night of gnashings and enormous moan.
His tearful sight can hardly reach to where
The pale-faced figure with bitumen eyes
Returns him such a god-forsaken stare
As outcast Adam gave to Paradise.
The man of snow is, nonetheless, content,
Having no wish to go inside and die.
Still, he is moved to see the youngster cry.
Though frozen water is his element,
He melts enough to drop from one soft eye
A trickle of the purest rain, a tear
For the child at the bright pane surrounded by
Such warmth, such light, such love, and so much fear.
.
Richard Wilbur
born March 1, 1921
American Poet and Translator Pulitzer Prize in 1957 & 1989
Poem Courtesy:
http://wonderingminstrels.blogspot.in/2006/07/boy-at-window-richard-wilbur.html
కన్నులు… చెస్లా మీవోష్, పోలిష్ కవి
ఘనమైన నా కనులారా, మీరు అంత కుశలంగా ఉన్నట్టు లేదు,
మీదగ్గరనుండి నాకు వస్తున్న ఆకారాలు అంత నిశితంగా ఉండడంలేదు,
రంగుబొమ్మలయితే, మరీను , మసకగా అలికినట్లుంటున్నాయి.
ఒకప్పుడు మీరు రాజుగారు వేటకి తీసుకెళ్ళే వేటకుక్కల్లా ఉండేవారు,
మీతో నేను ప్రతిరోజూ ఉదయాన్నే షికారుకి వేళ్ళేవాడిని.
అద్భుతమైన చురుకుదనం కల నా కనులారా! మీరు చాలా విషయాలు చూసేరు,
నగరాలూ, ప్రదేశాలూ, దీవులూ, మహాసముద్రాలు.
అప్పుడే కరుగుతున్న మంచు జాడల్లో
స్వచ్చమైన చిరుగాలి మనని పరుగులుతీయిస్తుంటే
జతగా మనం ఎన్నో బ్రహ్మాండమైన సూర్యోదయాలను స్వాగతించాం
మీరు చూసినవన్నీ ఇపుడు నా మదిలో భద్రంగా ఉన్నాయి
జ్ఞాపకాలుగానో, కలలుగానో మిగిలిపోయి.
నేను ఈ సుందరమైన ప్రకృతినుండి దూరంగా నిష్క్రమిస్తున్నాను
పిచ్చి పిచ్చి దుస్తులన్నా, అరుపులూ, చప్పుళ్ళన్నా
ఈ మధ్య నాకు చికాకు రావడం గమనిస్తున్నాను.
ఎంత ప్రశాంతంగా ఉందో, మనుషుల మధ్య
మౌలికమైన పోలికలూ, వెంట్రుకవాసి తేడాలూ
గమనిస్తూ వాటిగురించి ఆలోచిస్తుంటే.
కళ్ళుమూసుకుంటే, నా దృష్టి ఒక కాంతిబిందువుపై నిలిచి,
అది వ్యాకోచిస్తూ వ్యాకోచిస్తూ నన్ను తనలోకి లాక్కుంటోంది.
.
చెస్లా మీవోష్
30 June 1911 – 14 August 2004
పోలిష్ కవి 1980 Nobel Prize
.
.
Eyes
My most honorable eyes, you are not in the best of shape.
I receive from you an image less than sharp,
And if a color, then it’s dimmed.
And you were a pack of royal greyhounds once,
With whom I would set out in the early mornings.
My wondrously quick eyes, you saw many things,
Lands and cities, islands and oceans.
Together we greeted immense sunrises
When the fresh air set us running on the trails
Where the dew had just begun to dry.
Now what you have seen is hidden inside me
And changed into memories or dreams.
I am slowly moving away from the fairgrounds of the world
And I notice in myself a distaste
For the monkeyish dress, the screams and drumbeats.
What a relief. To be alone with my meditation
On the basic similarity in humans
And their tiny grain of dissimilarity.
Without eyes, my gaze is fixed on one bright point,
That grows large and takes me in.
.
Czeslaw Milosz
30 June 1911 – 14 August 2004
Polish Poet, Translator and Diplomat
Poem Courtesy:
http://wonderingminstrels.blogspot.in/2005/09/eyes-czeslaw-milosz.html
లుసీల్… ఓవెన్ మెరెడిత్, ఇంగ్లీషు
మనం కవిత్వం, సంగీతం, లలితకళలు లేకుండా బ్రతకొచ్చు;
మనం మనసూ, హృదయం లేకుండా బ్రతకొచ్చు;
మనం స్నేహితులూ, పుస్తకాలూ లేకుండా బ్రతకొచ్చు;
కానీ నాగరిక మానవుడు వంటవాళ్ళు లేకుండా బ్రతకలేడు.
పుస్తకాలు లేకుండా బ్రతకొచ్చు… వేదన తప్ప జ్ఞానం ఏమి మిగులుస్తుంది?
ఆశలేకుండా బ్రతకొచ్చు… ఆశ అంటే మోసం తప్ప మరేమిటి?
ప్రేమ లేకుండా బ్రతకొచ్చు… చింతించడానికి తప్ప ఆవేశం దేనికి పనికొస్తుంది?
కానీ అన్నం తినకుండా బ్రతకగలిగిన మనిషెక్కడున్నాడో చూపించండి?
.
ఓవెన్ మెరెడిత్
9 August 1876 – 25 October 1947
ఇంగ్లీషు
.
Lucile: Part 1, Canto 2
We may live without poetry, music and art;
We may live without conscience and live without heart;
We may live without friends; we may live without books;
But civilized man cannot live without cooks.
He may live without books, — what is knowledge but grieving?
He may live without hope, — what is hope but deceiving?
He may live without love, — what is passion but pining?
But where is the man that can live without dining?
.
Owen Meredith (Pen name of Victor Alexander George Robert Bulwer-Lytton, 2nd Earl of Lytton KG GCSI GCIE PC DL)
9 August 1876 – 25 October 1947
English
Poem Courtesy: http://wonderingminstrels.blogspot.in/search/label/Poet%3A%20Owen%20Meredith
మత్తులో పడండి… చార్లెస్ బోద్ లేర్, ఫ్రెంచి కవి
నిత్యం మత్తులో జోగండి
అంతే!
అది చాలా అవసరం!
భయంకరమైన కాలం బరువు
మీ భుజాలను పుండు చేసి
భూమికి కృంగదీసే
అనుభూతి పొందకుండా ఉండాలంటే
పూటుగా తాగి ఆ మత్తులో అలాగే ఉండండి!
ఏమిటి తాగాలి?
మదిరో, కవిత్వమో, శీలమో, ఏదో ఒకటి.
కానీ, తాగడం మాత్రం మరవొద్దు.
ఒక్కోసారి మీకు
ఏ రాజప్రాసాదాల్లోనో,
గోతిలోని పచ్చగడ్దిమీదో,
అంధకారమయమైన మీ ఒంటరి గదిలోనో
మీ మత్తు దిగిపోయో, ఎగిరిపోయో
పొరపాటున స్పృహ వస్తే
గాలినో
కెరటాన్నో
నక్షత్రాన్నో
పిట్టనో
గడియారాన్నో
ఏది నిత్యం పరిగెడుతూ ఉంటుందో
ఏది ఎప్పుడూ నిట్టూరుస్తుంటుందో
పొర్లుతూంటుందో
పాడుతూ ఉంటుందో
మాటాడుతూ ఉంటుందో దాన్ని అడగండి:
“సమయం ఎంతయింది?” అని
అప్పుడు ఆ గాలి
ఆ కెరటం
ఆ నక్షత్రం
ఆ పిట్ట
ఆ గడియారం
సమాధానమిస్తాయి:
“తాగే సమయం ఆసన్నమయింది,
కాలానికి బానిసగా జీవితం ధారపోయకు,
హాయిగా తాగు!
తాగి ఆ మత్తులోనే ఉండు
మదిరో, శీలమో, కవిత్వమో, ఏదో ఒకటి.” అని.
.
చార్లెస్ బోద్ లేర్
April 9, 1821 – August 31, 1867
ఫ్రెంచి కవి .
.
Get Drunk!
.
Always be drunk.
That’s it!
The great imperative!
In order not to feel
Time’s horrid fardel
bruise your shoulders,
grinding you into the earth,
Get drunk and stay that way.
On what?
On wine, poetry, virtue, whatever.
But get drunk.
And if you sometimes happen to wake up
on the porches of a palace,
in the green grass of a ditch,
in the dismal loneliness of your own room,
your drunkenness gone or disappearing,
ask the wind,
the wave,
the star,
the bird,
the clock,
ask everything that flees,
everything that groans
or rolls
or sings,
everything that speaks,
ask what time it is;
and the wind,
the wave,
the star,
the bird,
the clock
will answer you:
“Time to get drunk!
Don’t be martyred slaves of Time,
Get drunk!
Stay drunk!
On wine, virtue, poetry, whatever!”
.
Charles Baudelaire
April 9, 1821 – August 31, 1867
French Poet
Poem Courtesy:
http://wonderingminstrels.blogspot.in/2000/10/get-drunk-charles-baudelaire.html