నేను మనకు తెలియని ఎంతోమంది యువకులు
తమని తాము దహించుకున్నవారూ,
అవయవాలు కోల్పోయినవారూ
కుంటి వారూ
రెండు కాళ్ళూ పోయినవారూ
రెండు కళ్ళూ పోయిన వారూ
ఆవేశంగా మాటాడే యువకులగురించి తలుచుకుంటాను.
రాత్రిపూట వాళ్ళ ఆత్మలు నాతో మాటాడేది వింటాను
నా చెవులో అరుస్తాయి
నన్ను నా బద్ధకం వదిలేలా కుదుపుతాయి
నాకు ఆదేశాలిస్తుంటాయి.
నేను వాళ్ల చితికిపోయిన జీవితాలగురించీ
నా చేతులను అందుకోడానికి ప్రయత్నించే
వాళ్ళ ఉడుకుతున్నట్టుండే చేతులగురించీ ఆలోచిస్తాను.
వాళ్ళు నన్ను బ్రతిమాలడం లేదు
వాళ్ళు నిలదీసి ప్రశ్నిస్తున్నారు.
వాళ్ళకి మనని ప్రశ్నించడానికీ
మన మత్తు వదిలేలా
నిద్ర లేపడానికీ
ఈ నిర్లిప్తతని శాశ్వతంగా
తుదముట్టించడానికి హక్కు ఉంది
.
క్లారా ఇసాబెల్ ఎలగ్రియా
జననం 1924
నికరాగువా కవయిత్రి
.

Nicaraguan Poetess
స్పందించండి