రెస్టారెంటులోని సంగీతం… కాన్రాడ్ ఐకెన్, అమెరికను కవి

సిగరెట్టు పొగ పల్టీలు కొడుతూ మనమీదనుండి జారుకుంటుంది  

వెయిటర్ కదలికలకి అనుగుణంగా క్రిందకి జారి సుళ్ళుతిరుగుతూ.

నువ్వొక అగ్గిపుల్ల వెలిగించి మంటవైపు తదేకంగా చూస్తావు.

ఆ చిన్ని వెలుగు నీ కళ్ళలో ఒక క్షణంసేపు కదలాడి 

ఎంత నిశ్శబ్దంగా వచ్చిందో అంత నిశ్శబ్దంగానూ ఆరిపోతుంది.   

ఈ స్వరమాధురి వెనుక కొన్ని గొంతులున్నాయని నువ్వంటావు…

వాళ్ళు జలకన్యల్లా ఏ నదిలోంచో అవతరించి, పాడుతూ,

వాళ్ళ వెన్నెల వదనాల్ని ఎత్తి చూపి, చీకటిలోకి మునిగిపోతారు.

నువ్వెక్కడికి వెళితే అక్కడికి ఈ నదిని నీతో మోసుకుపోతావు:

ఒక ఆకు రాలుతుంది; కొట్టుకుపోతుంది, మనసు ఎక్కడో కలుక్కుమంటుంది.

అని అంటుంది ఈ రాగం నీతో… మరి నా మాట ఏమిటి?

అతను అలా కాఫీ పోస్తుంటే ఈ వెయిటర్ తో ఏమంటుంది?

వాయులీనం మీద కమాను మనోజ్ఞంగా నడిపే వాద్యకారుడితో?

కాగితాలు మడతపెట్టే వ్యక్తి, దానిని యాదృచ్చికంగా వింటాడు.

కొన్ని వేల కలలు రేగి, ఎగసిపడి ప్రవహిస్తాయి… 

అక్కడ ఎవరో ఒక కన్నియ పాలరాతి మెట్లదారిని

గులాబులు ముంచెత్తిన సమాధివైపు వెళ్ళడం చూస్తారు:

చివరినిముషంలో ఆమె తన జ్ఞాపకాలు నిండిన కనులు పైకెత్తుతుంది.

సుడిగాలికి పచ్చని ఆకులు చెల్లాచెదరౌతాయి, ఆ ప్రదేశమంతా

నీడలు ముసురుకుంటాయి, ఆకసంలో చాలసేపు ఉరుములు ఉరుముతాయి;

మోడులై నగ్నంగా నిలిచిన ఓక్ చెట్లు, మెరుపులకు పొగలుకక్కుతాయి;

ఉన్నతమైన పర్వత సానువుల్లో మేఘాలు పీలికలైపోతాయి,

మహాసముద్రం ఒకసారి తన కెరటాల గోడలు విదిలిస్తుంది,

ఒక్కసారి నిశ్శబ్దం కమ్ముకుంటుంది…. చాల నిశ్శబ్ద విరామం పిదప

ఈ సంగీతం మరొకసారి అందుకుంటుంది:

తుదలులేని ఆ మెట్లపరంపరపై మునపటిలా ఆమె మరొకసారి సాగిపోతుంది.    

అని చెబుతుంది అతనికి ఈ స్వరవిన్యాసం… మరి నా సంగతేమిటి?

నాకు సాక్షాత్కరించే  ప్రపంచాలేమిటి?

ఏ అద్భుత దృశ్యాలు, ఏ భయానక స్వప్నాలు కనుగొంటాను? 

నేను ఎవరికంటా పడకుండా, గుప్తమార్గాల్లో పయనించాలి.

నాకు ఆదేశించిన కార్యం కనిపించినంత సుళువు కాదు.  

.

కాన్రాడ్ ఐకెన్

August 5, 1889 – August 17, 1973 

అమెరికను కవి

(Note:  ఈ కవితలో ‘మెట్లు ‘అన్నపదం జాగ్రత్తగా గమనించండి)

.

Melody In A Restaurant

.

The cigarette smoke loops and slides above us,

Dipping and swirling as the waiter passes.

You strike a match and stare upon the flame.

The tiny firelight leaps in your eyes a moment

And dies away as silently as it came.

This melody, you say, has certain voices—

They rise like nereids from a river, singing,

Lift white faces, and dive to darkness again.

Wherever you go you bear this river with you:

A leaf falls, and it flows, and you have pain.

So says the tune to you—but what to me?

What to the waiter, as he pours your coffee?

The violinist who suavely draws his bow?

The man, who folds his paper, overhears it.

A thousand dreams revolve and fall and flow.

Someone there is who sees a virgin stepping

Down marble stairs to a deep tomb of roses:

At the last moment she lifts remembering eyes.

Green leaves blown down; the place is checked with shadows;

A long-drawn murmur of rain goes down the skies.

And oaks are stripped and bare, and smoke with lightning;

And clouds are blown and torn upon high forests;

And the great sea shakes its walls,

And then falls silence…And through a long silence falls

This melody once more:

Down endless stairs she goes, as once before.

So says the tune to him- but what to me?

What are the worlds I see?

What shapes fantastic, terrible dreams?

I go my secret way, down secret alleys.

My errand is not so simple as it seems.

.

Conrad Aiken. 

August 5, 1889 – August 17, 1973

American Poet

Poem Courtesy:

Poetry August 1919

http://www.poetryfoundation.org/poetrymagazine/browse?volume=14&issue=5&page=3

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: