వ్రాసినది: NS Murty | జూన్ 7, 2016

క్షయము … మేరీ లూయీ రిట్టర్, అమెరికను కవయిత్రి

కొండ శిఖరం నుండి పాదాల వరకూ
కెరటాలు కెరటాలుగా పచ్చదనం ప్రవహిస్తునట్టు ఊగుతోంది
ఆ గుసగుసలాడే సముద్రం వంటి పచ్చనాకుల సంపదలోంచి
అగోచరమైన గాలి చిత్రంగా గొణుగుతూ పోతోంది.

చుట్టూ ఆవరించిన చిన్ని చెట్ల గుబురుమధ్య
ఒక బ్రహ్మాండమైన ఓక్ చెట్టు, ఏకాంత గభీరతతో నిలబడి
దాని సువిశాలమైన చేతులు సడదిశలకు జాచి
బాధాతప్త హృదయంతో దైవాన్ని దీనంగా అర్థిస్తోంది.

వేసవి ఆకాశపు విద్యుల్లతాఘాతానికో
లేక తన మనసులోని దిగులుతో నెమ్మదిగా కృశిస్తూనో
కారణమేదైతేనేం, నిర్దాక్షిణ్యమైన విధి
దానిని అంతక్రూరంగానూ అంతం చేస్తోంది కదా.

ఓహ్! శరీరంలో భద్రంగా ఉన్న నిలకడలేని మనసా!
నీ జీవితపు తీరని కోరిక తలెత్తడం లేదూ
నేటి నీ సుఖాలని పలుచనచేస్తూ, గట్టిగా అరవడం లేదూ:
“నా వంక చూడండి! నేనెలా నశిస్తున్నానో!” అంటూ.
.

మేరీ లూయీ రిట్టర్
అమెరికను కవయిత్రి
19వ శతాబ్దం

.

Perished

(Catskill Mountain House)

Wave after wave of greenness rolling down        

From mountain top to base, a whispering sea    

Of affluent leaves through which the viewless breeze   

          Murmurs mysteriously.

And towering up amid the lesser throng,   

A giant oak, so desolately grand,     

Stretches its gray imploring arms to heaven       

          In agonized demand.     

Smitten by lightning from a summer sky,  

Or bearing in its heart a slow decay,

What matter, since inexorable fate   

          Is pitiless to slay.

Ah, wayward soul, hedged in and clothed about,

Doth not thy life’s lost hope lift up its head,      

And, dwarfing present joys, proclaim aloud,—  

          “Look on me, I am dead!”

.

Mary Louise Ritter

Poem Courtesy:

The World’s Best Poetry.

Eds.  Bliss Carman, et al.

Volume III. Sorrow and Consolation.  1904.

III. Adversity

http://www.bartleby.com/360/3/101.html 


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: