ఎండుటాకులు తప్ప మరేం లేదు; ఆత్మ ఘోషిస్తుంది
జీవితం వృధా చేసినందుకు;
వివేకాన్ని నిద్రపుచ్చి, పాపం చేసినందుకు,
వాగ్దానాలు చేసి ఎన్నడూ నిలబెట్టుకోనందుకు,
ద్వేషం, పోరాటాలూ, ఘర్షణల
ఎండుటాకులు తప్ప మరేం లేదు.
ఎండుటాకులు తప్ప మరేం లేదు; న్యాయబద్ధమైన
జీవితం నుండి ఏరుకున్న కంకులు లేవు; పండు గింజలు లేవు
మాటలు, శుష్కమైన మాటలు; చిత్తశుద్ధితో చేసే పనికి బదులు;
మనం గింజలు జల్లుతాం, ఓహ్ అవి పొల్లూ, కలుపుమొక్కలే.
మనం శ్రమపడి, బాధలు ఓర్చుకుని పంటకోస్తే దొరికేది
కేవలం ఎండుటాకులు తప్ప మరేం లేదు.
ఎండుటాకులు తప్ప మరేం లేదు; గతాన్ని కప్పిపుచ్చడానికి
జ్ఞాపకం ఏ యవనికలూ అల్లలేదు;
మనం అలసి వెళ్ళినత్రోవనే వెనక్కి
అపసవ్యంగా గడిపిన రోజులు లెక్కిస్తూ మరలుతుంటే,
మన దౌర్భాగ్యం కొద్దీ మనకి చివరకి మిగిలేవి
ఎండుటాకులు తప్ప మరేం లేదు.
మనం ఇలాగే మన ప్రభువుని కలుస్తామా,
ఈ ఎండుటాకులు పట్టుకుని?
ప్రభువు ఒక మంచి పండుకోసం వేచి చూస్తుంటాడు,
అతని సమీపంలో దీనంగా, సిగ్గుపడి మౌనంగా నిల్చుంటాం;
అతను అడగబోయే ప్రశ్నకి ఎదురుచూస్తూ:
“ఎండుటాకులేనా? మరేం లేదా?”
..
ల్యూసీ ఏవలీనా ఆకర్మన్,
అమెరికను
“Nothing but leaves”
Nothing but leaves; the spirit grieves
Over a wasted life;
Sin committed while conscience slept,
Promises made, but never kept,
Hatred, battle, and strife;
Nothing but leaves!
Nothing but leaves; no garnered sheaves
Of life’s fair, ripened grain;
Words, idle words, for earnest deeds;
We sow our seeds,—lo! tares and weeds:
We reap, with toil and pain,
Nothing but leaves!
Nothing but leaves; memory weaves
No veil to screen the past:
As we retrace our weary way,
Counting each lost and misspent day,
We find, sadly, at last,
Nothing but leaves!
And shall we meet the Master so,
Bearing our withered leaves?
The Saviour looks for perfect fruit,
We stand before him, humbled, mute;
Waiting the words he breathes,—
“Nothing but leaves?”
.
Lucy Evelina Akerman
February 21, 1816 – February 21, 1874
American
The World’s Best Poetry.
Bliss Carman, et al., eds.
Volume IV. The Higher Life. 1904.
-
Human Experience
http://www.bartleby.com/360/4/167.html
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి