ఒక అందమైన ముఖం నా ప్రేమని ఉదాత్తం చేస్తుంది
అది నా మనసుని తుఛ్ఛమైన కోరికలనుండి మరల్చింది;
ఇపుడిక మరణాన్నీ లక్ష్య పెట్టను, పాపపు కోరికల్నీ;
నీ ముఖము పైలోకాలలోని సుఖాలకి మచ్చుతునక
సత్పురుషులంగీకరించే బ్రహ్మానందాన్ని బోధిస్తుంది.
ఆహా! స్వర్లోకపు కపోతానికి ప్రతిరూపంగా
నీ అంత గొప్ప వస్తువు సృష్టించిన ఆ భగవంతుడు
ఎంద సుందరుడూ, దయాళువూ అయిఉంటాడో గదా
భూలోక స్వర్గాలైన ఆ సుందరమైన కనులనుండి
నా దృష్టిని మరల్చుకోలేని నా అపరాధాన్ని మన్నించు
అవే మార్గదర్శనచేసే తారకలు, చాలా దయతో
నా అడుగులను ఊర్ధ్వలోకాలవైపు మళ్ళిస్తాయి;
ఒక వేళ నేను ఆ చూపుల అమిత కరుణలో మసలగలిగితే
ఆ దేవుని వింత వెలుగును ప్రేమించి, అక్కడ వసించినట్టే.
.
మైకేలేంజెలో
(March 1475 – 18 February 1564)
ఇటాలియన్ కవి, శిల్పకారుడు .
.
“The might of one fair face”
From the Italian by John Edward Taylor
The might of one fair face sublimes my love,
For it hath weaned my heart from low desires;
Nor death I heed, nor purgatorial fires.
Thy beauty, antepast of joys above,
Instructs me in the bliss that saints approve;
For O, how good, how beautiful, must be
The God that made so good a thing as thee,
So fair an image of the heavenly Dove!
Forgive me if I cannot turn away
From those sweet eyes that are my earthly heaven,
For they are guiding stars, benignly given
To tempt my footsteps to the upward way;
And if I dwell too fondly in thy sight,
I live and love in God’s peculiar light.
.
Michaelangelo
(March 1475 – 18 February 1564)
Italian Poet, Sculptor
The World’s Best Poetry.
Eds Bliss Carman, et al.
Volume II. Love. 1904.
VII. Love’s Power
http://www.bartleby.com/360/2/233.html
స్పందించండి