మంచు బిందువులు … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
అతను నావాడని కలగంటాను
ఆతను నిజాయితీపరుడని కలగంటాను
అతని మాటలు భద్రంగా దాచుకుంటాను
గులాబి రేకులు మంచుబిందువులు దాచినట్టు.
ఓ దాహార్తివైన గులాబీ,
ఓ చిన్నారి నా మనసా జాగ్రత్త!
లేకుంటే మీకు వంద గులాబుల
బరువు భరించాల్సి వస్తుంది.
.
సారా టీజ్డేల్
August 8, 1884 – January 29, 1933
అమెరికను కవయిత్రి
.
Dew
I dream that he is mine,
I dream that he is true,
And all his words I keep
As rose-leaves hold the dew.
O little thirsty rose,
O little heart beware,
Lest you should hope to hold
A hundred roses’ share.
.
Sara Teasdale
August 8, 1884 – January 29, 1933
American Poetess
Poem Courtesy: http://www.mckinley.k12.hi.us/ebooks/pdf/helen10.pdf
రాత్రి పరామర్శలు … క్లారిబెల్ ఎలగ్రియా, నికరాగువా కవయిత్రి
నేను మనకు తెలియని ఎంతోమంది యువకులు
తమని తాము దహించుకున్నవారూ,
అవయవాలు కోల్పోయినవారూ
కుంటి వారూ
రెండు కాళ్ళూ పోయినవారూ
రెండు కళ్ళూ పోయిన వారూ
ఆవేశంగా మాటాడే యువకులగురించి తలుచుకుంటాను.
రాత్రిపూట వాళ్ళ ఆత్మలు నాతో మాటాడేది వింటాను
నా చెవులో అరుస్తాయి
నన్ను నా బద్ధకం వదిలేలా కుదుపుతాయి
నాకు ఆదేశాలిస్తుంటాయి.
నేను వాళ్ల చితికిపోయిన జీవితాలగురించీ
నా చేతులను అందుకోడానికి ప్రయత్నించే
వాళ్ళ ఉడుకుతున్నట్టుండే చేతులగురించీ ఆలోచిస్తాను.
వాళ్ళు నన్ను బ్రతిమాలడం లేదు
వాళ్ళు నిలదీసి ప్రశ్నిస్తున్నారు.
వాళ్ళకి మనని ప్రశ్నించడానికీ
మన మత్తు వదిలేలా
నిద్ర లేపడానికీ
ఈ నిర్లిప్తతని శాశ్వతంగా
తుదముట్టించడానికి హక్కు ఉంది
.
క్లారా ఇసాబెల్ ఎలగ్రియా
జననం 1924
నికరాగువా కవయిత్రి
.

Nicaraguan Poetess
.
Nocturnal Visits
.
I think of our anonymous boys
of our burnt-out heroes
the amputated
the cripples
those who lost both legs
both eyes
the stammering teen-agers.
At night I listen to their phantoms
shouting in my ear
shaking me out of lethargy
issuing me commands
I think of their tattered lives
of their feverish hands
reaching out to seize ours.
It’s not that they’re begging
they’re demanding
they’ve earned the right to order us
to break up our sleep
to come awake
to shake off once and for all
this lassitude.
.
(Translated by D. J. Flakoll)
.
Claribel Alegria
Nicaraguan Poetess
(born 1924)
Poem Courtesy:
http://hedgeguard.blogspot.in/2006_03_01_archive.html
రెస్టారెంటులోని సంగీతం… కాన్రాడ్ ఐకెన్, అమెరికను కవి
సిగరెట్టు పొగ పల్టీలు కొడుతూ మనమీదనుండి జారుకుంటుంది
వెయిటర్ కదలికలకి అనుగుణంగా క్రిందకి జారి సుళ్ళుతిరుగుతూ.
నువ్వొక అగ్గిపుల్ల వెలిగించి మంటవైపు తదేకంగా చూస్తావు.
ఆ చిన్ని వెలుగు నీ కళ్ళలో ఒక క్షణంసేపు కదలాడి
ఎంత నిశ్శబ్దంగా వచ్చిందో అంత నిశ్శబ్దంగానూ ఆరిపోతుంది.
ఈ స్వరమాధురి వెనుక కొన్ని గొంతులున్నాయని నువ్వంటావు…
వాళ్ళు జలకన్యల్లా ఏ నదిలోంచో అవతరించి, పాడుతూ,
వాళ్ళ వెన్నెల వదనాల్ని ఎత్తి చూపి, చీకటిలోకి మునిగిపోతారు.
నువ్వెక్కడికి వెళితే అక్కడికి ఈ నదిని నీతో మోసుకుపోతావు:
ఒక ఆకు రాలుతుంది; కొట్టుకుపోతుంది, మనసు ఎక్కడో కలుక్కుమంటుంది.
అని అంటుంది ఈ రాగం నీతో… మరి నా మాట ఏమిటి?
అతను అలా కాఫీ పోస్తుంటే ఈ వెయిటర్ తో ఏమంటుంది?
వాయులీనం మీద కమాను మనోజ్ఞంగా నడిపే వాద్యకారుడితో?
కాగితాలు మడతపెట్టే వ్యక్తి, దానిని యాదృచ్చికంగా వింటాడు.
కొన్ని వేల కలలు రేగి, ఎగసిపడి ప్రవహిస్తాయి…
అక్కడ ఎవరో ఒక కన్నియ పాలరాతి మెట్లదారిని
గులాబులు ముంచెత్తిన సమాధివైపు వెళ్ళడం చూస్తారు:
చివరినిముషంలో ఆమె తన జ్ఞాపకాలు నిండిన కనులు పైకెత్తుతుంది.
సుడిగాలికి పచ్చని ఆకులు చెల్లాచెదరౌతాయి, ఆ ప్రదేశమంతా
నీడలు ముసురుకుంటాయి, ఆకసంలో చాలసేపు ఉరుములు ఉరుముతాయి;
మోడులై నగ్నంగా నిలిచిన ఓక్ చెట్లు, మెరుపులకు పొగలుకక్కుతాయి;
ఉన్నతమైన పర్వత సానువుల్లో మేఘాలు పీలికలైపోతాయి,
మహాసముద్రం ఒకసారి తన కెరటాల గోడలు విదిలిస్తుంది,
ఒక్కసారి నిశ్శబ్దం కమ్ముకుంటుంది…. చాల నిశ్శబ్ద విరామం పిదప
ఈ సంగీతం మరొకసారి అందుకుంటుంది:
తుదలులేని ఆ మెట్లపరంపరపై మునపటిలా ఆమె మరొకసారి సాగిపోతుంది.
అని చెబుతుంది అతనికి ఈ స్వరవిన్యాసం… మరి నా సంగతేమిటి?
నాకు సాక్షాత్కరించే ప్రపంచాలేమిటి?
ఏ అద్భుత దృశ్యాలు, ఏ భయానక స్వప్నాలు కనుగొంటాను?
నేను ఎవరికంటా పడకుండా, గుప్తమార్గాల్లో పయనించాలి.
నాకు ఆదేశించిన కార్యం కనిపించినంత సుళువు కాదు.
.
కాన్రాడ్ ఐకెన్
August 5, 1889 – August 17, 1973
అమెరికను కవి
(Note: ఈ కవితలో ‘మెట్లు ‘అన్నపదం జాగ్రత్తగా గమనించండి)
.
Melody In A Restaurant
.
The cigarette smoke loops and slides above us,
Dipping and swirling as the waiter passes.
You strike a match and stare upon the flame.
The tiny firelight leaps in your eyes a moment
And dies away as silently as it came.
This melody, you say, has certain voices—
They rise like nereids from a river, singing,
Lift white faces, and dive to darkness again.
Wherever you go you bear this river with you:
A leaf falls, and it flows, and you have pain.
So says the tune to you—but what to me?
What to the waiter, as he pours your coffee?
The violinist who suavely draws his bow?
The man, who folds his paper, overhears it.
A thousand dreams revolve and fall and flow.
Someone there is who sees a virgin stepping
Down marble stairs to a deep tomb of roses:
At the last moment she lifts remembering eyes.
Green leaves blown down; the place is checked with shadows;
A long-drawn murmur of rain goes down the skies.
And oaks are stripped and bare, and smoke with lightning;
And clouds are blown and torn upon high forests;
And the great sea shakes its walls,
And then falls silence…And through a long silence falls
This melody once more:
Down endless stairs she goes, as once before.
So says the tune to him- but what to me?
What are the worlds I see?
What shapes fantastic, terrible dreams?
I go my secret way, down secret alleys.
My errand is not so simple as it seems.
.
Conrad Aiken.
August 5, 1889 – August 17, 1973
American Poet
Poem Courtesy:
Poetry August 1919
http://www.poetryfoundation.org/poetrymagazine/browse?volume=14&issue=5&page=3
తుఫానుమీద సవారీ … యాహియా లబబీదీ, ఈజిప్షియన్-అమెరికను కవి
ఈ తనువు నిగూఢమైన చిక్కుముడి విప్పలేకపొయాను
ఆకలేసినపుడు నిద్రపుచ్చుతున్నాను
కలలు గనవలసివచ్చినపుడు తెగమేపుతున్నాను.
ఆదర్శాలకీ- యదార్థానికీ మధ్య మొదటిది తిరస్కరిస్తూ,
రెండవదానిచే తిరస్కరించబడుతూ రెండు నాల్కలధోరణి ప్రదర్శించే
నా ఆత్మతత్త్వానికి ఉక్కిరిబిక్కిరై ఊపిరిసలపనంత పని అయింది.
నాకు ఇప్పటికీ తుఫానుపై సవారీ చేసే కళ అబ్బలేదు
వాటి ప్రచండగాలుల ఊళలు వినడానికి చెవులూ
ఉప్పెనలా వచ్చే కెరటాలు చూడడానికి కనులూ లేకుండా
వాతావరణం ఎప్పుడూ నా అంచనాకి దొరక్క ఆశ్చర్యపరుస్తుంది
ఈ పటాలూ, దిక్సూచిలూ, నక్షత్రాలూ,
వాటి సంకేతాలూ, హెచ్చరికలూ చెప్పే పరికరాలన్నిటితో
కొట్టుకుపోతున్న చెక్కే ఆధారంగా, కళ్ళు గట్టిగా మూసుకుని
గడియపెట్టని ఈ కాళరాత్రి గడిచిపోతుందని వణుకుతూ ఆశిస్తూ
ఒకప్పుడు నాలోని జ్వాలలని ఎలా కాపాడుకున్నానో గుర్తుచేసుకుంటూ… .
.
యాహియా లబబీదీ
ఈజిప్షియన్- అమెరికను కవి

Photo Courtesy: Poet
The Art of Storm-riding
I could not decipher the living riddle of my body
put it to sleep when it hungered, and overfed it
when time came to dream
I nearly choked on the forked tongue of my spirit
between the real and the ideal, rejecting the one
and rejected by the other
I still have not mastered that art of storm-riding
without ears to apprehend howling winds
or eyes for rolling waves
Always the weather catches me unawares, baffled
by maps, compass, stars and the entire apparatus
of bearings or warning signals
Clutching at driftwood, eyes screwed shut, I tremble
hoping the unhinged night will pass and I remember
how once I shielded my flame.
Yahia Lababidi
Egyptian-American writer ,thinker, essayist
For more info about the Poet Visit:
http://2paragraphs.com/2016/04/poet-yahia-lababidi-finds-balance-in-the-mundane/
http://www.amazon.in/gp/aw/review/1941209378/R3D4AB0AL02QCB/ref=cm_cr_dp_mb_rvw_1?ie=UTF8&cursor=1
మేని రంగులు… రిచ్ మండ్ లాటిమోర్ , అమెరికను కవి
మనం ఎందులో ఇరుక్కు పోయామో చూడు.
బాధలకీ, జ్వరాలకీ, జడత్వానికీ, కేన్సర్లకీ నిలయం
నమ్మలేనంతగా సహిస్తుంది
లోపల ఎంతగా మండుతున్నా.
ఇది దయ్యానికి ఆటపట్టు
యమభటులు హింసించడానికి సాటిలేని వస్తువు.
ఊపిరి లేకుంటే (అదే ప్రాణం)
ప్రాణం లేకుంటే (అదే ఊపిరి)
ఎందుకూ పనికిరాదు
లేదా, బల్లమీద దాని అంగాలతో పాటు
పడుకోబెట్టిన ఒక సంచి.
మళ్ళీ ప్రాణం పోసుకుంటుందా? ప్రకృతిలో కలిసిపోతుందా?
భయమేస్తుంది ఆలోచిస్తే. భయపడుతుంది.
కానీ, దాని వంపులకై, రంగులకై, రుచులకై, ఆకృతికై ఉబలాటపడుతుంది.
… చూడు చూడు!… అద్భుతం!
.
రిచ్ మండ్ లాటిమోర్
May 6, 1906 – February 26, 1984
అమెరికను కవి
.
Flesh Tones
.
What we got stuck with.
Housing for pains fevers phlegms cancers.
Endures incredibly
Solid as statues, inwardly seething.
Devil’s stronghold.
Matchless material for the torturer to work with.
Without breath (which is spirit)
Or Spirit (which is breath)
Offal
Or slab on the counter packaged in plastic
With by-products.
Resurrected? To be recycled?
Scary. Scared.
But speeds curves colors tastes and textures
—look!— wonderful!
.
Richmond Lattimore
May 6, 1906 – February 26, 1984
American Poet
Poem Courtesy: http://www.poetryfoundation.org/poetrymagazine/browse?volume=138&issue=3&page=29
బ్రిడ్జ్ నుండి … క్లారిబెల్ ఎలెగ్రియా, నికరాగువా కవయిత్రి
నేను కోరుకుంటున్న వ్యవస్థ
నాకెక్కడా కనిపించలేదు.
బదులుగా,
అధికారం ఉన్న వాళ్ళ చేతిలో
దుష్ట సంప్రదాయాలూ
ప్రణాళికా బద్ధమైన అవ్యవస్థ
దినదినాభివృద్ధిచెందుతూ,
కాస్త దయగల ప్రపంచం కోసం
ఆకలి లేని ప్రపంచం కోసం
ఆశతో జీవించే అవకాశం కోసం
ఎవరైతే ఆందోళనలు చేస్తున్నారో
వారందరూ జైళ్ళలో
హింసలపాలై
మరణిస్తున్నారు.
వద్దు వద్దు.
నన్ను సమీపించవద్దు.
కుళ్ళిన మాంసపు కంపు
నా చుట్టూ వ్యాపించి ఉంది!
.
క్లారిబెల్ ఎలెగ్రియా
(May 12, 1924- )
నికరాగువా కవయిత్రి
From the Bridge
.
I never found the order
I searched for
but always a sinister
and well-planned disorder
that increases in the hands
of those who hold power
while the others
who clamor for
a more kindly world
a world with less hunger
and more hopefulness
die of torture
in the prisons.
Don’t come any closer
there’s a stench of carrion
surrounding me.
.
(Note: Please click the link to know about the Bridge)
Claribel Alegría
(born May 12, 1924)
Nicaraguan Poetess
Claribel Alegría was born to Nicaraguan and Salvadoran parents in Estelí, Nicaragua, on May 12, 1924. She moved to the United States in 1943, graduating from George Washington University in 1948. In 1985 she moved back to Nicaragua. Her work was featured in Bill Moyers’ PBS series, “The Language of Life.” Her forty books of poems, fiction, non-fiction, and children’s stories have been translated into more than ten languages.
Poem and write up courtesy:
http://www.journeywithjesus.net/PoemsAndPrayers/Claribel_Alegria_From_the_Bridge.shtml
శ్లాఘించబడని అందం… రిచర్డ్ ఆల్డింగ్టన్, ఇంగ్లీషు కవి
ఉన్నది నువ్వొకతెవే
ఇతరులు మోసగత్తెలూ,శుచిలేని, పరాన్నభుక్కులూ.
నీ వొకతెవే నిరాడంబరంగా, స్థిరంగా, స్పష్టంగా ఉంటావు.
కాంతి నీ చుట్టూ వక్రగతులుపోతుంది
బంగారు తీవెల పొదరింటిలా.
నీ మాటలు శీతల చంద్రకాంత ఫలకాలూ
వాసనలేని పూవులూనా?
నవ్వు!నవ్వు!
వాళ్ళు తప్పిదాలు చేస్తే చెయ్యనీ.
సముద్ర మెప్పటికీ సముద్రమే.
దాన్ని ఎవరూ మార్చలేరు.
దాన్ని ఎవరూ స్వంతం చేసుకోలేరు.
.
రిచర్ద్ ఆల్డింగ్టన్
8 July 1892 – 27 July 1962
ఇంగ్లీషు కవి
.
.
Beauty Unpraised
.
There is only you.
The rest are palterers, slovens, parasites.
You only are strong, clear-cut, austere;
Only about you the light curls
Like a gold laurel bough.
Your words are cold flaked stone,
Scentless white violets?
Laugh!
Let them blunder.
The sea is ever the sea
None can change it,
None can possess it.
.
Richard Aldington (aka Edward Godfree Aldington)
8 July 1892 – 27 July 1962
English Poet
Poem Courtesy: Poetry Magazine
Vol XIV, No IV page 3
http://www.poetryfoundation.org/poetrymagazine/browse?volume=14&issue=4&page=3
సంకటస్థితి… రిచర్డ్ ఆల్డింగ్టన్, ఇంగ్లీషు కవి
సరికొత్త అందాల్నీ, కొత్త ప్రదేశాల్నీ, కొత్తముఖాల్నీ,
కొత్త సూర్య చంద్రుల్నీ, మహా పట్టణాలనీ,
నువ్వెన్నడూ చూడని మహా సాగరాల్నీ, అడవుల్నీ,
వెతుక్కుంటూ పోక తప్పదా అని నువ్వు అడిగేవు.
నువ్వు అచేతనంగా మౌనంగా కూచుని
ఇంతవరకు సాధించినది గుర్తుచేసుకుంటూ
ఆలోచనలు నెమరు వేసుకుంటూ, విజయగాథలు లెక్కిస్తూ,
ఏ ప్రభావం చూపించకుండా ప్రతిరోజూ గడపడమేనా?
ఏ మార్పూలేక… మరో రోజు, గంటలు వెళ్ళబుచ్చడం
ఒక బాధని గాని, హృదయస్పందనగానీ గుర్తించకుండా…
నేను మాటల్లో ఎలా చెప్పను?
అదిగాక, నాకు మాటాడాలంటే చికాకు.
అందుకని కిటికీ తలుపు తెరిచాను
పడమట వాసంతపు సూర్యాస్తమయానికి తెరతీస్తూ.
సూర్య్డు ముదురు నారింజపండు రంగులో మెరిసిపోతున్నాడు
నెలబాలుడి చేతిలో ఒక తారక మెరుస్తోంది;
చివరి పిచ్చుక జంటలు చూరుమీద కిచకిచలాడుతున్నాయి,
వాకిలికి అడ్డంగా ఒక గబ్బిలం చప్పుడులేకుండా సాగిపోయింది
ఎక్కడో అడుగుల చప్పుడూ, మనుషుల మాటల సవ్వడీ వినిపిస్తోంది
ఈ రోజుకి పని ముగించుకుని వస్తున్న వారికలయికలలో.
ఒక రైతు తోలుతున్న ఎడ్లబండి పక్కనుండి పోయింది
ఒక బాలిక కాగితం అడ్దుపెట్టి వెలుగుతున్న కొవ్వొత్తి పట్టుకుంది
ఎవరో మేండలీన్ వాయిస్తున్నారు.
నీకు సమాధానం దొరికిందా? ఏమో, నాకు తెలీదు.
చాలా సేపటి మౌనం తర్వాత నువ్వు ఇతరవిషయాలు ఎత్తుకున్నావు.
మౌనం నీకు అర్థమయేలా మరోలా చెప్పడం నాకు తెలీదు.
.
రిచర్డ్ ఆల్డింగ్టన్
8 July 1892 – 27 July 1962
ఇంగ్లీషు కవి
.
.
Dilemma
You asked me if you should still go adventuring
For more beauty, new lands, strange faces,
For other moons and suns over other cities
And seas and forests you never beheld;
Or whether you should sit down quietly
And con over all you have gathered,
Fingering your memories, counting your spoils,
Letting each day pass without comment
Indistinguishably— a day only, a passage of hours,
Without one blood-beat of discovery or pain.
How could I answer in words?
In any case I am sick of words and talk.
So I drew silently to the window
Opening upon the spring twilight.
There was a deep orange overglow from the sun,
And a young moon with a star in her hand;
The last swifts dashed screaming over the roofs,
While the first bats swerved noiselessly across the square;
There was a murmur of talk and of moving feet
As people strolled and met after work;
A peasant’s cart went by with a man driving
And a girl holding a candle in a paper shade,
And someone played a mandolin.
Were you answered? I do not know.
For after a long silence you spoke of other things.
But I do not know any other silence to give you.
.
Richard Aldington
8 July 1892 – 27 July 1962
English Poet
Courtesy: Poetry Magazine, January 1934
http://www.poetryfoundation.org/poetrymagazine/browse?volume=43&issue=4&page=13
నిన్ను నువ్వు మోసం చేసుకోకు… థామస్ బీటీ, ఇంగ్లీషు కవి
నీ మనసు చెప్పినట్టు నడవడం నేర్చుకో
పరులు అవరోధాలు కల్పిస్తే, పట్టించుకోకు,
వాళ్ళు ద్వేషిస్తున్నారా? లక్ష్యపెట్టకు,
నీ కూనిరాగం నువ్వుతీసుకుంటూ నీపనిచేసుకో!
నీ ఆశలు అల్లుకో, ప్రార్థనలు పాడుకో,
ఒకరు నీకివ్వలేని కీర్తికిరీటాలు ఆశించకు
నీ విజయాలకు వాళ్ళ అరుపుల్నీ గణించకు.
మనసారా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడు
నీ మనసుకి నువ్వు నిజాయితీగా ఉండు
నీ మనసు బోధిస్తున్నదేదో తెలుసుకోడం నేర్చుకో
నీకు నిర్ణయించిన పాత్రని చక్కగా నెరవేర్చు
నువ్వు ఏ విత్తు నాటితే ఆ పంటే కోసుకుంటావు
నీ ఎదుగుగల నెవరూ పెంచేదీ లేదు, త్రుంచేదీ లేదు
నీ పూర్తి స్థాయికి నువ్వు తప్పక ఎదుగుతావు.
నీ కళ్ళ ముందు నీ సుదూర లక్ష్యం కదలాడనీ
ఏ ప్రలోభాలకీ నీ అడుగులు పక్కతోవ పట్టనీయకు
చివరకు నువ్వు గమ్యాన్ని చేరుకునేదాకా,
నీ సుదీర్ఘమైన జీవన ప్రయాణం ముగిసిందని
చేరుకున్నచోటునుండి సింహావలోకనం చేసుకునేదాకా
పరుగులో ఎక్కడా అలసత్వం చూపించకు
దారిలో ఎక్కడా ఆగి ఆలస్యం చెయ్యకు.
.
థామస్ బీటీ
ఇంగ్లీషు కవి
.
To Thine Own Self Be True
.
By thine own soul’s law learn to live,
And if men thwart thee take no heed,
And if men hate thee have no care;
Sing thou thy song and do thy deed.
Hope thou thy hope and pray thy prayer,
And claim no crown they will not give,
Nor bays they grudge thee for thy hair.
Keep thou thy soul-worn steadfast oath,
And to thy heart be true thy heart;
What thy soul teaches learn to know,
And play out thine appointed part,
And thou shalt reap as thou shalt sow,
Nor helped nor hindered in thy growth,
To thy full stature thou shalt grow.
Fix on the future’s goal thy face,
And let thy feet be lured to stray
Nowhither, but be swift to run,
And nowhere tarry by the way,
Until at last the end is won
And thou mayst look back from thy place
And see thy long day’s journey done.
.
Pakenham Thomas Beatty
English Poet
.
Poem Courtesy:
http://allpoetry.com/To-Thine-Own-Self-Be-True
అప్పుడే చనిపోవు… పాబ్లో నెరూడా చిలీ కవి
నువ్వు మెల్ల మెల్లగా మరణించడం మొదలెడతావు;
నువ్వు దేశాలు తిరగనప్పుడు,
పుస్తకాలు చదవనప్పుడు,
జీవన నిక్వాణాలని వినిపించుకోనపుడు,
నిన్ను నువ్వు అర్థం చేసుకోలేనపుడు
నువ్వు మెల్ల మెల్లగా మరణించడం మొదలెడతావు.
నీ ఆత్మగౌరవాన్ని చంపుకున్నప్పుడు,
ఇతరులు నీకు సహాయంచెయ్యడానికి ఇష్టపడనపుడు
నువ్వు మెల్ల మెల్లగా మరణించడం మొదలెడతావు.
నువ్వు నీ అలవాట్లకు బానిసవైపోయినపుడు,
ఎప్పుడూ నడచినతోవల్లోనే నడుస్తూ ఉన్నప్పుడు…
నీ దినచర్యమార్చుకోనపుడు,
నువ్వు వేర్వేరు రంగులు ధరించలేనపుడు,
లేక, అపరిచితులతో మాటాడడానికి ఇష్టపడనపుడు.
నువ్వు మెల్ల మెల్లగా మరణించడం మొదలెడతావు:
నీ నేత్రాలను చెమరింపజేసి
నీ హృదయం త్వరగా కొట్టుకునేలా చేసే
అన్ని రసానుభూతుల్నీ
వాటి ఆవేశాల తీవ్రతలనీ విడనాడినపుడు;
నువ్వు మెల్ల మెల్లగా మరణించడం మొదలెడతావు:
అనిశ్చయమైన వాటికోసం నీ సురక్షితస్థిని ఒడ్డలేనపుడు,
నీ కలలను వెంటాడుతూ పోలేనపుడు,
జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా
పారిపోడానికి
నిన్ను నువ్వు విడిచిపెట్టలేనపుడు
నువ్వు మెల్ల మెల్లగా మరణించడం తథ్యం!!!
.
పాబ్లో నెరూడా
July 12, 1904 – September 23, 1973
చిలీ కవి

Courtesy: Wikipedia