హామ్లెట్ స్వగతం… షేక్స్పియర్

జీవించడమా, మరణించడమా,- అదీ అసలు ప్రశ్న:-

అదృష్టము ఇష్టమొచ్చిన రీతిలో సంధించే బాధలూ కష్టాలను

మనసులోనే భరించి సహించి ఊరుకోవడం ఉదాత్తమా,

లేక సముద్రకెరటాల్లా వచ్చే ఆపదలపై కత్తి దూయడమా,

అలా ఎదిరించడం వల్ల వాటికి ముగింపు పలకడమా? లేక మృత్యువు… దీర్ఘనిద్ర

నశించడం; అలా మరణించడం వల్ల, మనం గుండె దొలిచే బాధలనుండి

ఈ శరీరానికి ప్రకృతిసిద్ధంగావచ్చే, వారసత్త్వంగా సంక్రమించే

వేల కొద్దీ కష్టాలనుండి గట్టెక్కగలమా?

అటువంటి పరిపూర్ణమైన విముక్తి మనసారా కోరుకోవలసిందే

నశ్వరమైన శరీరం… అనశ్వరమైన నిద్ర.

ఆ దీర్ఘనిద్రలో… ఒకవేళ కలలొస్తే… అక్కడే ఉంది కిటుకు;

ఆ మృత్యునిద్రలో ఎటువంటి కలలు వస్తాయో?

మనమీ మృత్తిక శరీరాన్ని విడిచిపెట్టేక

మనకి కొంత ఊరట లభించాలి: అప్పుడే దానికి విలువ

అంతసుదీర్ఘమైన బాధామయ జీవితం గడిపినందుకు

లేకపోతే, ఎవడు భరించగలడు కాలం చేసే అత్యాచారాలని,

నిరంకుసులు పెట్టే హింసలని, గర్విష్టి చేసే అవమానాల్ని

తిరస్కృత ప్రేమ కలిగించే గుండెకోతని, జాప్యమైన న్యాయాన్ని,

అధికార పీఠపు గర్వాన్ని, ఎంత యోగ్యత ఉన్నా

సహనంతో భరించగల అయోగ్యుల తిరస్కృతుల్ని…

తన జీవితానికి తానే ఒక చుర కత్తితో

విముక్తి ప్రసాదించుకుంటే? ఒక నిస్సారమైన జీవితపు

శ్రమనీ, నిట్టూర్పుల్నీ ఎవడు భరించగలడు

మరణానంతరం ఏమవుతుందో నన్న భయానికి తప్ప.

అదెవరూ ఎరుగని ప్రదేశము… దాని తీరాలనుండి

వెళ్ళినవాడెవరూ తిరిగి రాలేదు, అదే మనసుని కలవరపెడుతుంది,

మనం పడే కష్టాలని సహించడమే మేలనిపిస్తుంది

మనకి తెలియని చోటుకి పరిగెత్తి పారిపోయేకంటే.

మనసు ఆ విధంగా మనల్ని పిరికివాళ్ళను చేస్తుంది.

భయానకమైన ఆ ఊహ నేపథ్యంలో

వర్ణమాలవంటి ఏ నిర్ణయమైనా వెలవెల బోతుంది.

ఎంత చేవగల సమయోచితమైన గొప్ప ప్రయత్నమైనా

ఈ విషయంలో దాని మార్గాన్ని కోల్పోయి

అది ప్రయత్నమని పిలిచే యోగ్యత కోల్పోతుంది.

.

షేక్స్పియర్

 William Shakespeare

.

To be, or not to be,—that is the question:—

Whether’t is nobler in the mind to suffer

The slings and arrows of outrageous fortune,

Or to take arms against a sea of troubles,

And, by opposing, end them?—To die, to sleep;—

No more; and, by a sleep, to say we end

The heart-ache, and the thousand natural shocks

That flesh is heir to,— ‘t is a consummation

Devoutly to be wished. To die,—to sleep;—

To sleep! Perchance to dream:—ay, there’s the rub;

For in that sleep of death what dreams may come,

When we have shuffled off this mortal coil,

Must give us pause: there’s the respect

That makes calamity of so long life;

For who would bear the whips and scorns of time,

The oppressor’s wrong, the proud man’s contumely,

The pains of despised love, the law’s delay,

The insolence of office, and the spurns

That patient merit of the unworthy takes,

When he himself might his quietus make

With a bare bodkin? Who would fardels bear,

To grunt and sweat under a weary life,

But that the dread of something after death,—

The undiscovered country, from whose bourn

No traveller returns,—puzzles the will,

And makes us rather bear those ills we have,

Than fly to others that we know not of?

Thus conscience does make cowards of us all;

And thus the native hue of resolution

Is sicklied o’er with the pale cast of thought;

And enterprises of great pith and moment,

With this regard, their currents turn awry,

And lose the name of action.

.

Shakespeare

 (From HAMLET. Act III. Sc. 1)

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: