నా కర్థమయింది, ఇంట్లో పిల్లల్లేరని
ఇల్లు మరీ శుభ్రంగా, పొందికగా ఉంది.
నేల మీద చేతుల్తో ఇష్టమొచ్చినట్టు
విసిరేసిన ఆట బొమ్మలు కనిపించడం లేదు.
కిటికీల మీద వేలిముద్రలు లేవు,
కుర్చీల మీద గీతలు లేవు;
కర్ర బొమ్మలు వరుసలో నిలబెట్టి లేవు,
లేదా జంటలుగా తరలించిందీ లేదు;
కాలివేళ్ళదగ్గర బాగా మురికిపట్టి
చిరుగులు పడ్డ మేజోళ్ళు లేవు పోగువెయ్యడానికి;
చిన్న చిన్న మరమ్మత్తు చెయ్యడానికి
అన్నీ పిల్లలబట్టలతో కూడిన మేటలు లేవు
ఆర్చడానికి ఏ చిన్న చిన్న బాధలూ లేవు
ముడవడానికి చిన్ని చేతులు లేవు;
కడగడానికి జిడ్దు పట్టిన వేళ్ళు లేవు
చెప్పడానికి కథలు లేవు;
ఇవ్వడానికి లేత ముద్దులు లేవు
చిట్టీ, చంటీ అన్న ముద్దుపేర్లు లేవు;
సాయంత్రం టీ తాగేక సరదా గంతులు లేవు…
అంటే, ఇంట్లో చిన్న పిల్లలు లేరు.
.
క్లారా డోలివర్
1874-1891
అమెరికను కవయిత్రి
.
No Baby in the House
.
No baby in the house, I know,
’T is far too nice and clean.
No toys, by careless fingers strewn,
Upon the floors are seen.
No finger-marks are on the panes,
No scratches on the chairs;
No wooden men set up in rows,
Or marshalled off in pairs;
No little stockings to be darned,
All ragged at the toes;
No pile of mending to be done,
Made up of baby-clothes;
No little troubles to be soothed;
No little hands to fold;
No grimy fingers to be washed;
No stories to be told;
No tender kisses to be given;
No nicknames, “Dove” and “Mouse;”
No merry frolics after tea,—
No baby in the house!
.
Clara G. Dolliver
1874-1891
American
Poem Courtesy:
The World’s Best Poetry.
Eds. Bliss Carman, et al.
Volume I. Of Home: of Friendship. 1904.
Poems of Home: II. For Children
http://www.bartleby.com/360/1/70.html
స్పందించండి