రోజు: మే 21, 2016
-
ఇంట్లో పిల్లలు లేరు… క్లారా డోలివర్, అమెరికను కవయిత్రి
నా కర్థమయింది, ఇంట్లో పిల్లల్లేరని ఇల్లు మరీ శుభ్రంగా, పొందికగా ఉంది. నేల మీద చేతుల్తో ఇష్టమొచ్చినట్టు విసిరేసిన ఆట బొమ్మలు కనిపించడం లేదు. కిటికీల మీద వేలిముద్రలు లేవు, కుర్చీల మీద గీతలు లేవు; కర్ర బొమ్మలు వరుసలో నిలబెట్టి లేవు, లేదా జంటలుగా తరలించిందీ లేదు; కాలివేళ్ళదగ్గర బాగా మురికిపట్టి చిరుగులు పడ్డ మేజోళ్ళు లేవు పోగువెయ్యడానికి; చిన్న చిన్న మరమ్మత్తు చెయ్యడానికి అన్నీ పిల్లలబట్టలతో కూడిన మేటలు లేవు ఆర్చడానికి ఏ చిన్న…