వేసవి వాన… హార్ట్లీ కోలరిడ్జ్, ఇంగ్లీషు కవి

దుమ్ము దట్టంగా పేరుకుంది; తెల్లగా చిరాకుగా ఉంది,
అరబ్బు ఏడారి ఇసుకని కొట్టొచ్చినట్టు అనుకరిస్తూ.
అడవులూ, పర్వతాలూ ఎండవేడికి కునుకుతీస్తునాయి;
బయళ్ళు ఎండకి మాడిపోయి దాహంకోసం తపిస్తున్నట్టున్నాయి;
చిన్న సెలయేళ్ళు వాటి కాలువలని బోడిగా విడిచిపెట్టాయి
అవి ఏమిటో పోల్చుకుందికి ఒక్క చలమైనా లేకుండా;
సన్నబడిపోయిన నది ఆకలితో అలమటిస్తున్న
రాక్షసుడి ఎముకల్లాంటి రాళ్ళ మధ్య మెరుస్తోంది.

ఒక్క సారిగా కొండలు నల్లబడ్డాయి, క్రిందని పొయ్యిలోంచి
వచ్చినట్టు గాలి వేడిగా; అక్కడ ఉండడం మహాకష్టం.
జూనో అసూయతో తొంగిచూసినందుకు కోపగించిన
జోవ్ లా అక్కడక్కడ గుర్రు గుర్రులు వినిపిస్తున్నాయి.
ఒక మెరుపు- ఒక పిడుగు- ఆకాశం బద్దలైంది,
చుక్కలు చుక్కలుగా వర్షం రాలడం ప్రారంబించింది…అందులో
అతిచిన్న బిందువు పూలోనే భ్రమరాన్ని సమాధిచెయ్య గలదు
ఏరు ఆనందంతో గంతులేసింది, పొలాలు హాయిగా నవ్వాయి.
.
హార్ట్లీ కోలరిడ్జ్

(19 September 1796 – 6 January 1849)

ఇంగ్లీషు కవి

 

.

Summer Rain

Thick lay the dust, uncomfortably white,  

In glaring mimicry of Arab sand.     

The woods and mountains slept in hazy light;    

The meadows looked athirst and tawny tanned; 

The little rills had left their channels bare, 

With scarce a pool to witness what they were;   

And the shrunk river gleamed ’mid oozy stones,

That stared like any famished giant’s bones.      

Sudden the hills grew black, and hot as stove     

The air beneath; it was a toil to be.          

There was a growling as of angry Jove,     

Provoked by Juno’s prying jealousy—     

A flash—a crash—the firmament was split,       

And down it came in drops—the smallest fit      

To drown a bee in fox-glove bell concealed;                

Joy filled the brook, and comfort cheered the field.      

.

Hartley Coleridge

(19 September 1796 – 6 January 1849)

English Poet

Poem Courtesy:

The World’s Best Poetry.

Eds.  Bliss Carman, et al.

Volume V. Nature.  1904.

  1. Light: Day: Night

http://www.bartleby.com/360/5/29.html

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: