చెయ్యవలసిన దనంతం; చేసిందతి స్వల్పం!
ఓహ్, నిన్నరాత్రి చూశాను సూర్యుణ్ణి
కాంతి విహీనంగా చీకటి సముద్రంలోకి గుంకుతూ
‘నిన్న ‘ ఒక భయంకరమైన ప్రేతాత్మ.
చెయ్యవలసిన దనంతం; చేసిందతి స్వల్పం!
ప్రతి పొద్దూ సరి కొత్త సమస్యలతో పొడుస్తుంది
అయినా, ఉత్సాహంగా, ధైర్యంగా, రంగంలోకి దిగుతాను,
‘ఈ రోజు ‘… నా పోరాటం కొనసాగిస్తాను
చెయ్యవలసిన దనంతం; చేసిందతి స్వల్పం!
కానీ అంతా ముగిసిపోయేక, విజయం సాధించేక,
ఆహా! మనసా! ఏమి చెప్పను? నా బాధలూ, అశాంతీ
అన్ని అద్భుతమైన “రేపు” లో సమసిపోతాయి.
.
జేమ్స్ రాబర్ట్స్ గిల్మోర్
(Sep 10, 1822– Nov 16, 1903)
అమెరికను
Three Days
So much to do: so little done!
Ah! Yesternight I saw the sun
Sink beamless down the vaulted gray,—
The ghastly ghost of YESTERDAY.
So little done: so much to do!
Each morning breaks on conflicts new;
But eager, brave, I’ll join the fray,
And fight the battle of TO-DAY.
So much to do: so little done!
But when it’s o’er,—the victory won,—
Oh! then, my soul, this strife and sorrow
Will end in that great, glad TO-MORROW.
.
James Roberts Gilmore
(Sep 10, 1822– Nov 16, 1903)
American
Poem Courtesy:
The World’s Best Poetry.
Eds.: Bliss Carman, et al.
Volume VI. Fancy. 1904.
Poems of Sentiment: I. Time
http://www.bartleby.com/360/6/59.html
స్పందించండి