రోజు: మే 13, 2016
-
మూడు రోజులు… జేమ్స్ రాబర్ట్స్ గిల్మోర్, అమెరికను
చెయ్యవలసిన దనంతం; చేసిందతి స్వల్పం! ఓహ్, నిన్నరాత్రి చూశాను సూర్యుణ్ణి కాంతి విహీనంగా చీకటి సముద్రంలోకి గుంకుతూ ‘నిన్న ‘ ఒక భయంకరమైన ప్రేతాత్మ. చెయ్యవలసిన దనంతం; చేసిందతి స్వల్పం! ప్రతి పొద్దూ సరి కొత్త సమస్యలతో పొడుస్తుంది అయినా, ఉత్సాహంగా, ధైర్యంగా, రంగంలోకి దిగుతాను, ‘ఈ రోజు ‘… నా పోరాటం కొనసాగిస్తాను చెయ్యవలసిన దనంతం; చేసిందతి స్వల్పం! కానీ అంతా ముగిసిపోయేక, విజయం సాధించేక, ఆహా! మనసా! ఏమి చెప్పను? నా బాధలూ, అశాంతీ…