మనం పుడతాము, నవ్వుతాము, ఏడుస్తాము, మనం ప్రేమిస్తాము, కుంగిపోతాం, నశిస్తాం! ఆహ్! ఇక ఎందుకూ మనం నవ్వడం ఏడవడం? మనం ఎందుకు పుడతాం ఎందుకు గిడతాం? నిగూఢమైన ఈ రహస్యానికి సమాధానం ఎవరికి తెలుసు? అరే! నాకయితే మాత్రం తెలీదు!
మనిషి కంటికి కనబడకుండా పువ్వులెందుకు వికసిస్తాయి? ఆహ్లాదకరమైన ఋతువులెందుకు ఇట్టే సమసిపోయే చక్కని ఊహలెందుకు రేపుతాయి? మరణిస్తాయని తెలిసినా, ఆ వస్తువులకే మన మనసులెందుకు ఆరాటపడతాయి?
మనం అపరాథాలతో, బాధతో శ్రమిస్తూ, పోరాడుతాం, దూరంగా పారిపోతాం; మనం ప్రేమిస్తాం; పోగొట్టుకుంటాం; తర్వాత కొద్దిరోజులకే, మనమూ మరణిస్తాం; జీవితమా! ఇదేనా నీ పల్లవి: సహించు- సమసిపో? .