రోజు: మే 11, 2016
-
మధురక్షణం … మేరీ ఫ్రాన్సిస్ బట్స్, బ్రిటిషు రచయిత్రి
తీరుబాటులేని పనితో గడిచిన రోజు ముగిసింది ఇంటిపనులు చక్కబెట్టుకోడం అయింది పగలల్లా చికాకు పరిచిన బాధ్యతలు సూర్యుడితోపాటే శలవుతీసుకున్నాయి చీకటి చిక్కబడుతున్న సంధ్యవేళ హాయిగా విశ్రాంతి తీసుకుంటూ కూచున్నాను గులాబి పువ్వులాంటి నా చిన్నారి నా గుండెమీద నిద్రపోతోంది. తెల్లని కనురెప్పలు పట్టు పోగు అంచుతో పల్చబదుతున్న వెలుగుని నిరోధిస్తున్నాయి ఒక చిన్ని పిడికిలి గట్టిగా బిగిసి అమ్మ చేతివేళ్ళని ఆసరాగా పట్టుకుంది మెత్తని దుప్పటి ముడతల్లో ఇంతసేపూ చురుకుగా ఉన్న పాదాలు చివరికి ఎలాగైతేనేం విశ్రాంతి…