పొద్దు పొడుపు… లాంగ్ ఫెలో, అమెరికను కవి

సముద్రం మీంచి గాలి ఉవ్వెత్తుగా పైకి లేచి,
అడిగింది “ఓ మంచు తెరలారా! నాకు దారి ఇవ్వండి!”

ఓడవంక చూసి ఇలా అరిచింది, “ఓ నావికలారా!
చీకటి తొలగిపోయింది. ఇక కొనసాగించండి మీ ప్రయాణం!”

దూరాన ఉన్న నేలకి ఉరుకులతో పరుగులెత్తి
మేలుకొలిపింది, “ఒహోయ్! లేవండి పొద్దుపొడుస్తోంది”

అడవితో ఊసులాడుతూ, “నీ కలరవాలేవి?
నీ ఆకులతోరణాల్ని వేలాడదియ్యి!”అంది.

ముడుచుకున్న పక్షిరెక్కను గోముగా నిమురుతూ,
ఓ పికమా! లే! లే! లేచి కమ్మగా ఒక పాట పాడు!”

కళ్ళాలవెంట పరుగులిడుతూ “ఓ కుక్కుటోత్తమా!
అదిగో ప్రభాతం. నీ మేలుకొలుపులు అందుకో!”

పంటచేలమీద్ద మెల్లగా సాగుతూ గుసగుసలాడింది
తలవంచుకొండి! వేకువకి నమస్కరించండి”

దేవాలయపు గోపురపు గంటలో దూరి
లే లే! లేచే వేళయిందని ఘంటాపథంగా చెప్పు”

చర్చి ఆవరణని దాటుతూ నిట్టూర్చింది:
“ఇంకా సమయం రాలేదు. ప్రశాంతంగా పడుకోండి.”
.
హెన్రీ వాడ్స్ వర్త్ లాంగ్ ఫెలో

(February 27, 1807 – March 24, 1882)
అమెరికను కవి

Image Courtesy: http://t2.gstatic.com
Image Courtesy: http://t2.gstatic.com

Daybreak

.

A wind came up out of the sea,

And said, “O mists, make room for me!”

It hailed the ships, and cried, “Sail on,

Ye mariners, the night is gone!”

And hurried landward far away,

Crying, “Awake! it is the day!”

It said unto the forest, “Shout!

Hang all your leafy banners out!”

It touched the wood-bird’s folded wing,

And said, “O bird, awake and sing!”

And o’er the farms, “O chanticleer,

Your clarion blow; the day is near!”

It whispered to the fields of corn,

“Bow down, and hail the coming morn!”

It shouted through the belfry-tower,

“Awake, O bell! proclaim the hour.”

It crossed the churchyard with a sigh,

And said, “Not yet! in quiet lie.”

.

Henry Wadsworth Longfellow

(February 27, 1807 – March 24, 1882)

American

Poem Courtesy:

The World’s Best Poetry.

Eds.  Bliss Carman, et al.

Volume V. Nature.  1904.

  1. Light: Day: Night

http://www.bartleby.com/360/5/23.html

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: