రోజు: మే 10, 2016
-
పొద్దు పొడుపు… లాంగ్ ఫెలో, అమెరికను కవి
సముద్రం మీంచి గాలి ఉవ్వెత్తుగా పైకి లేచి, అడిగింది “ఓ మంచు తెరలారా! నాకు దారి ఇవ్వండి!” ఓడవంక చూసి ఇలా అరిచింది, “ఓ నావికలారా! చీకటి తొలగిపోయింది. ఇక కొనసాగించండి మీ ప్రయాణం!” దూరాన ఉన్న నేలకి ఉరుకులతో పరుగులెత్తి మేలుకొలిపింది, “ఒహోయ్! లేవండి పొద్దుపొడుస్తోంది” అడవితో ఊసులాడుతూ, “నీ కలరవాలేవి? నీ ఆకులతోరణాల్ని వేలాడదియ్యి!”అంది. ముడుచుకున్న పక్షిరెక్కను గోముగా నిమురుతూ, ఓ పికమా! లే! లే! లేచి కమ్మగా ఒక పాట పాడు!” కళ్ళాలవెంట…