ప్రేమించొద్దు… కెరొలీన్ ఎలిజబెత్ సారా నార్టన్,

ప్రేమించొద్దు, ప్రేమించొద్దు, చాతకాని మట్టి మనుషులారా!

అందమైన ఆశల మాలికలన్నీ మట్టిపూలతో చేసినవే

అవి వికసించి కొద్ది గంటలైనా గడవక ముందే,

ఆ వస్తువులు వాడి రాలిపోడానికి ఉద్దేశించినవే

ప్రేమించొద్దు!

ప్రేమించొద్దు, ప్రేమించొద్దు. మీరు ప్రేమించినది మారిపోవచ్చు.

దొండపండు వంటి పెదవి మిముజూసి నవ్వకపోవచ్చు

కరుణ చిప్పిలే నయనాలు మిమ్ము వింతగా చూసి పట్టించుకో పోవచ్చు

గుండె వెచ్చగా కొట్టుకో వచ్చు, కానీ అది విధేయం కాకపోవచ్చు,

ప్రేమించొద్దు!

ప్రేమించొద్దు! మీరు ప్రేమించినది మరణించవచ్చు…

ఆహ్లాదమూ ఆనందకరమైన ఈ భూమిపై నశించిపోవచ్చు.

మౌనంగా ఉండే తారలూ, నవ్వులు చిందించే నీలి గగనమూ,

దాని పుట్టుకనాడు నవ్వినట్టే, దాని సమాధిపై కూడా నవ్వొచ్చు,

ప్రేమించొద్దు.

ప్రేమించొద్దు! ఒక హెచ్చరిక నిరుపయోగంగా చెబుతూనే ఉంది

యుగాలబట్టి చెప్పినట్టే ఇప్పుడుకూడా చెబుతోంది.

ప్రేమ మనకు ఇష్టమైన వారి తలచుట్టూ గుడికడుతుంది

వాళ్ళు మారేదాకా, మరణించేదాకా, అది శాశ్వతం, అకుంఠితం

ప్రేమించొద్దు!

.

కెరొలీన్ ఎలిజబెత్ సారా నార్టన్

22 March 1808 – 15 June 1877

ఇంగ్లీషు కవయిత్రి

.

.

 “Love not”

Love not, love not, ye hapless sons of clay!        

Hope’s gayest wreaths are made of earthly flowers,— 

Things that are made to fade and fall away         

Ere they have blossomed for a few short hours. 

                        Love not!                  

Love not! the thing ye love may change;   

The rosy lip may cease to smile on you,    

The kindly-beaming eye grow cold and strange, 

The heart still warmly beat, yet not be true.        

                        Love not!                  

Love not! the thing you love may die,—   

May perish from the gay and gladsome earth;    

The silent stars, the blue and smiling sky, 

Beam o’er its grave, as once upon its birth.        

                        Love not!                  

Love not! O warning vainly said      

In present hours as in years gone by!        

Love flings a halo round the dear one’s head,     

Faultless, immortal, till they change or die.         

                        Love not!                  

.

Caroline Elizabeth Sarah (Sheridan) Norton

22 March 1808 – 15 June 1877

Poem Courtesy:

The World’s Best Poetry.

Bliss Carman, et al., eds. 

Volume III. Sorrow and Consolation.  1904.

  1. Disappointment in Love

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: