అనువాదలహరి

సేవ… రాబర్ట్ బ్రౌనింగ్, ఇంగ్లీషు కవి

(ఈ రోజు రాబర్ట్ బ్రౌనింగ్ 205 వ జన్మదినం.)

 

అన్ని సేవలూ భగవంతుని దృష్టిలో సమానమే
ఇప్పుడు నడిచినా, ఒకప్పుడు నడిచినా
అతను మన నేలమీద నడిస్తే స్వర్గమే.
మనందరం అతనెలా అనుకుంటే అలాగే పనిచెయ్యగలం
మనలో గొప్పవాళ్ళైనా, నీచులైనా తోలుబొమ్మలమే
ఇందులో ఒకరు ఉత్తములూ, ఒకరు అధములూ లేరు.

“చిన్న సంఘటన” అనొద్దు. “చిన్న” దేమి?
ఇంతకంటే ఎక్కువ బాధ కలగాలా?
ఇంతకంటే ఏదో పెద్ద సంఘటన జరగాలన్నట్టు?
ప్రభూ! జీవితంగా చుట్టుకునే
కర్మల దారపు కండెనుండి వేరు చెయ్యి.
ప్రతిపనిలో, పురి ఎక్కువో తక్కువో అవుతుంది.”
.
Pippa Passes నుండి

రాబర్ట్ బ్రౌనింగ్

(7 May 1812 – 12 December 1889)

ఇంగ్లీషు కవి.

రాబర్ట్ బ్రఊనింగ్ కవితల్లో చెప్పిన దాని కంటే చెప్పనిది ఎక్కువ ఉంటుంది. అతను చెప్పినదాంట్లోంచే చెప్పని దానికి సూచనకూడా ఉంటుంది.
రెండవ పద్యం చూడ్డానికి భావం వెంటనే స్ఫురించదు. జీవితమనే దారపు కండె మనం చేస్తున్న పనుల హెచ్చుతగ్గుల బట్టి (పురి) పేనుకుంటుంది. ఎక్కువ పురి ఉన్న దారం శ్రేషఠమైతే, తక్కువ పురి ఉన్న దారం త్వరగా పోతుంది. ఈ జీవిత చక్రం మనం చేసే కర్మలబట్టి ఏదో ఫలితం ఇస్తూనే ఉంటుంది. ఎప్పుడూ సున్న కాదు. మనకి ఈ చక్రంలోంచి విముక్తి ఉండదు. దానినే కవి అర్థిస్తున్నాడు.)

.

.

Service

All  service ranks the same with God:

If now, as formerly he trod

Paradise, his presence fills

Our earth, each only as God wills

Can work—God’s puppets, best and worst,

Are we; there is no last nor first.

Say not “a small event”! Why “small”?

Costs it more pain than this, ye call

A “great event,” should come to pass,

Than that? Untwine me from the mass

Of deeds which make up life, one deed

Power shall fall short in or exceed!

.

Robert Browning

(7 May 1812 – 12 December 1889)

English Poet

Poem Courtesy:

The World’s Best Poetry.

Eds.  Bliss Carman, et al

Volume IV. The Higher Life.  1904.

 III. Faith: Hope: Love: Service

 

ప్రకటనలు
%d bloggers like this: