తల్లులెలాంటి వారో పిల్లలలాంటి వారు. వెర్రి అభిమానపడే తండ్రి అంత వెర్రిగా చూచినా, ఉయ్యాలలో నిద్రపోతున్న కొడుకుమీద రాశిపోసిన తన అన్ని ఆశలూ, భయాలతో తల్లి తన పేగుబంధంతో చూసినట్టుగా ఆ చిన్నారి హృదయాన్ని ప్రేమగా చూడలేడు.
తన ప్రక్కన మోకాళ్ళమీద కూచుని తన రూపుదిద్దుకుంటున్న తన ముఖంలో ఎప్పుడూ తల్లి పోలికలు వెదుకుతున్న నాన్నను చూసి ఆ చిన్నారి ఆశ్చర్యంగా,గుడ్లప్పగించి చూస్తాడు; కానీ, ఆమె ఒక్కతెకే చేతులు చాచి నిలబడతాడు; ఆమె ఒక్కతెకే ఆ కళ్ళు ఆనందంతో విప్పారుతాయి, ఆశ్చర్యంతో కాకుండా. . వాల్టర్ సావేజ్ లాండర్
“పిల్లలు… వాల్టర్ సావేజ్ లాండర్, ఇంగ్లీషు కవి”కి ఒక స్పందన
మరువం ఉష
కొన్ని కొన్ని అనువాదాలు చదివి అలా వెళ్ళిపోలేను, ఇంతో అంతో లోపలి నుంచి గొంతు తెచ్చుకుని అక్షరాలై దూకాల్సిందే! ఈ కవిత ఎంత చక్కని చిత్రాన్ని కళ్ళకి కట్టిందో, చాలా చాల నెనర్లు! ఎంత బుజ్జి భావాలతో బుజ్జాయిని అమ్మ వంక చూసేలా చిత్రించిందో
స్పందించండి