ఎంతో సుందరంగా కనిపించే ఈ జీవితం
ఆడుకునే పిల్లలు గట్టిగా ఊపిరి బిగబట్టి
గాలిలోకి ఊదే సబ్బునురగలాంటిది.
ఆ బుడగని పట్టుకుందికి అన్ని దిక్కులా పరిగెత్తి
దాని చలనాన్ని వారసత్వంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు.
ఒకోసారి అది స్వేచ్చాజీవిలా కనిపిస్తుంది
బంగారంతో చేసిన వస్తువులా గాలిలో అతికించినట్టు
ఆ ఎత్తులో నిలకడగా వేలాడదీస్తున్నట్టు
కానీ, ఆ వైభవం అట్టే కాలం ఉండదు.
అది కేవలం ఊహల్లోనే అతిగా కొనియాడబడుతుంది. కారణం,
అంతకు ముందు దాని ఉనికి లేదు, తర్వాత ఉండదు.
.
హాదార్న్ డెన్
13 డిశంబరు 1585- 4 డిశంబరు 1649
స్కాటిష్ కవి
.
This Life
This Life, which seems so fair,
Is like a bubble blown up in the air
By sporting children’s breath,
Who chase it everywhere
And strive who can most motion it bequeath.
And though it sometimes seem of its own might
Like to an eye of gold to be fixed there,
And firm to hover in that empty height,
That only is because it is so light.
—But in that pomp it doth not long appear;
For when ’t is most admired, in a thought,
Because it erst was nought, it turns to nought.
.
William Drummond of Hawthornden
(13 December 1585 – 4 December 1649)
Scottish Poet
Poem Courtesy:
The World’s Best Poetry.
Eds: Bliss Carman, et al.,
Volume VI. Fancy. 1904.
Poems of Sentiment: II. Life
http://www.bartleby.com/360/6/73.html
స్పందించండి