రోజు: మే 4, 2016
-
ఈ జీవితం… విలియం డ్రమ్మోండ్ ఆఫ్ హాదార్న్ డెన్, స్కాటిష్ కవి
ఎంతో సుందరంగా కనిపించే ఈ జీవితం ఆడుకునే పిల్లలు గట్టిగా ఊపిరి బిగబట్టి గాలిలోకి ఊదే సబ్బునురగలాంటిది. ఆ బుడగని పట్టుకుందికి అన్ని దిక్కులా పరిగెత్తి దాని చలనాన్ని వారసత్వంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. ఒకోసారి అది స్వేచ్చాజీవిలా కనిపిస్తుంది బంగారంతో చేసిన వస్తువులా గాలిలో అతికించినట్టు ఆ ఎత్తులో నిలకడగా వేలాడదీస్తున్నట్టు కానీ, ఆ వైభవం అట్టే కాలం ఉండదు. అది కేవలం ఊహల్లోనే అతిగా కొనియాడబడుతుంది. కారణం, అంతకు ముందు దాని ఉనికి లేదు, తర్వాత ఉండదు.…