నమస్సులు… శలవు… రోజామండ్ మేరియట్ వాట్సన్, ఇంగ్లీషు కవయిత్రి

ఓ నా యవ్వనమా! శలవు! ఇక మనిద్దరం విడిపోక తప్పదు,
ఇదిగో, దారులు ఇక్కడ చీలుతున్నై;
ఇక్కడ చేతులోంచి చెయ్యీ, మనసులోంచి మనసూ దూరం చెయ్యవలసిందే-
ఇక ఈ ఎడాబాటు నిత్యమూ… అనంతమూ.

నా కోసం నువ్వు వాడిన పూలు ధరించకు,
నేను నీకై ఇక రోజుల తరబడి శోకిస్తుంటాను.
ఇక పొదలలో, పొదరిళ్ళలో పాటలలో
ఇన్నాళ్ళూ కనిపించిన ఇంద్రజాలమహిమ కనిపించదు.

మన ఎడబాటు ఖరారుచేసి శీఘ్రతరంచేసి ముద్ర వేసే
ముదిమి తోడుగా ఇక నేను ముందుకి నడవ వలసిందే…
మనసులేని సహవాసము, నిజానికి, అదంతే.
తనూ నేనూ కలిసి ఇక జంటగా బతకవలసిందే,
ఇక ఈ కాలిబాటని నేను నడవలేక చతికిలబడేదాకా.

ఎప్పుడైనా వసంతవేళ ప్రాభాతపు మసకచీకట్లలో
వెలుగు విప్పారే వేళ పొదల్లో ఏ కోయిల అయినా కూస్తుంటే
నేను కలగంటాను… మన ఒకప్పటి
ప్రమాణాలు నువ్వింకా మరిచిపోలేదని.

లేదా ఎప్పుడైనా నల్లకలువల నీలి కన్నుల్లో
ఒక నాటి ఆనందమో, తప్పిన మాటో ప్రతిఫలించి గుర్తుకువస్తే
నేను మళ్ళీ ఆ నిషేధించిన సరిహద్దుల్ని దాటి,
క్షణకాలం పాటు
మనిద్దరం ఏనాడో విడిపోయామన్నది మరిచిపోతాను.
అద్భుతమైన నీ చిరునవ్వుల తళుకులూ,
ఇప్పటికీ నువ్వు మరిచిపోని కలనీ కలగంటాను.
.
రోజామండ్ మేరియట్ వాట్సన్

October 6, 1860 – Dec. 29, 1911

ఇంగ్లీషు కవయిత్రి

.

.

Ave atque Vale (Hail And Farewell)

.

Farewell, my Youth! For now we needs must part,

For here the paths divide;

Here hand from hand must sever, heart from heart,—

Divergence deep and wide.

You ’ll wear no withered roses for my sake,

Though I go mourning for you all day long,

Finding no magic more in bower or brake,

    No melody in song.

Gray Eld must travel in my company

To seal this severance more fast and sure.

A joyless fellowship, i’ faith, ’t will be,

Yet must we fare together, I and he,

Till I shall tread the footpath way no more.

But when a blackbird pipes among the boughs,

On some dim, iridescent day in spring,

Then I may dream you are remembering

    Our ancient vows.

Or when some joy foregone, some fate forsworn,

Looks through the dark eyes of the violet,

I may re-cross the set, forbidden bourne,

    I may forget

Our long, long parting for a little while,

Dream of the golden splendors of your smile,

Dream you remember yet.

.

Rosamund Marriott Watson

 (October 6, 1860 – Dec. 29, 1911)

English Poetess

The World’s Best Poetry.

Eds.  Bliss Carman, et al.

Volume VI. Fancy.  1904.

Poems of Sentiment: I. Time

ave atque vale

Note:

Catullus 101 is an elegiac poem written by the Roman poet Gaius Valerius Catullus. It is addressed to Catullus’ dead brother or, strictly speaking, to the “mute ashes” which are the only remaining evidence of his brother’s body.

The tone is grief-stricken and tender, with Catullus trying to give the best gift he had to bestow (a poem) on his brother, who was taken prematurely. The last words, “Hail and Farewell” (in Latin, ave atque vale), are among Catullus’ most famous; an alternative modern translation might be “I salute you…and goodbye”.

(Courtesy: Wikipedia)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: