మునిగిపోయిన నగరం… విల్ హెల్మ్ మ్యుల్లర్, జర్మను కవి

ష్.ష్.ష్! మునిగిపోయిననగరపు ఘంటల చప్పుడు మరోసారి
అలవాటుగా సాయంత్రం నెమ్మదిగా వినవస్తోంది, వినండి!
సముద్రగర్భపు లోతుల్లోంచి స్వేఛ్ఛగా ఒక అద్భుతమైన
పాట తేలివస్తోంది, ఎప్పటిదో ఏ కాలమునాటిదో.

గుడులు, గోపురాలు, ఎన్నో అంతస్థుల రమ్య హర్మ్యాల గుమ్మటాలు
అన్నీ సాగరగర్భంలో సమాధియై పడి ఉన్నాయి
ఎవరికంటికీ కనపడక, ఒక్క సాయం వేళ కడలి కెరటాలపై
పసిడికాంతులు విరిసినపుడు కనవచ్చే వాటి దివ్యకాంతులు తప్ప.

ఆ తళత్తళలు చూసిన ఏ నావికునికయినా,
అతని చెవిలో ఈ శబ్దాలు రహస్యంగా వినిపిస్తాయి
ప్రతి రాత్రీ వేడుకుంటుంటాయి వచ్చి చూసి, వినమని
అచటి నల్లనిరాళ్ళలో మృత్యువు మాటుగా దాక్కున్నా.

ఆ అద్భుత నగరపు జ్ఞాపకాల ఘంటికలు
నా కోసం మరొకసారి శ్రవణానందకరంగా మోగుతున్నాయి!
నా మనసుకూడా ఆనందమూ విషాదమూ మేళవించిన గొంతుతో
ఒక నాటి ఆ పాటని సరి కొత్తగా ఆలపిస్తోంది

అపూర్వకల్పనతో నిర్మించిన హర్మ్యలు, గోపురాలు, గుడులు
మిలమిలమెరిసే పగటి కాంటులకి దూరంగా దాగి ఉన్నాయి.
వాటి విభవం కనుగొని పునరుద్ధరించేదాకా మరుగుపడే ఉంటాయి
ప్రతి రాత్రీ నాకలలోనూ, పదిమందీ గొప్పగా చెప్పుకునే కథల్లోనూ.

కాలగర్భంలో కలిసిపోయిన పేరుపడ్డ అనేక వాద్యబృందాల
చరమగీతికలు నాకు మళ్ళీ మరొక్కసారి వినిపిస్తాయి.
కన్నీరుగప్పిన నా కన్నులలోంచి నా శాశ్వత నివాసాన్ని
దూరంగా… ఆ నగరాత్మ సంచరించే కాంతిసీమలో కనుగొంటాను.
.
విల్ హెల్మ్ మ్యుల్లర్
అక్టోబరు 7, 1794 – సెప్టెంబరు 30, 1827
జర్మను కవి

.

The Sunken City

HARK! the faint bells of the sunken city   

  Peal once more their wonted evening chime!     

From the deep abysses floats a ditty,        

  Wild and wondrous, of the olden time.    

Temples, towers, and domes of many stories        

  There lie buried in an ocean grave,—      

Undescried, save when their golden glories

  Gleam, at sunset, through the lighted wave.      

And the mariner who had seen them glisten,       

  In whose ears those magic bells do sound,            

Night by night bides there to watch and listen,   

  Though death lurks behind each dark rock round.     

So the bells of memory’s wonder-city       

  Peal for me their old melodious chime!    

So my heart pours forth a changeful ditty,    

  Sad and pleasant, from the bygone time. 

Domes and towers and castles, fancy-builded,    

  There lie lost to daylight’s garish beams,—      

There lie hidden till unveiled and gilded,   

  Glory-gilded, by my nightly dreams!       

And then hear I music sweet upknelling    

  From many a well-known phantom band,        

And, through tears, can see my natural dwelling

  Far off in the spirit’s luminous land!

.

Wilhelm Müller

 (October 7, 1794 – September 30, 1827)

 (Wilhelm Max Muller is his grandson)

(Tr. from the German by James Clarence Mangan)

Poem Courtesy:

The World’s Best Poetry.

Bliss Carman, et al., eds. 

Volume VI. Fancy.  1904.

Poems of Fancy: III. Mythical: Mystical: Legendary

http://www.bartleby.com/360/6/49.html

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: