అనువాదలహరి

ఇద్దరు దేవదూతలు… జాన్ గ్రీన్ లీఫ్ విటియర్, అమెరికను కవి

దేముడు స్వర్గంలో తనకి దగ్గరగా వసిస్తున్న ఇద్దరు దేవతల్ని పిలిచేడు

అతిసుకుమారమైనది కరుణ, అతి ప్రీయమైనది ప్రేమ

“లేవండి,” దేముడు ఆజ్ఞాపించేడు,”నా దేవతలారా! పాపపు, దుఃఖపు తెరలు

స్వర్లోకపు ద్వారాలనుండి లోనకి ప్రవేశించి అంతటా విచారం అలముకుంటోంది.

నా వీణియ అధోలోకాలనుండి వెల్లువెత్తుతున్న శోకస్వరాన్ని అందుకుంటోంది.

వేదనా ధూమము దట్టంగా వెలుగునుకమ్ముకుంటోంది, పూలు చీడపడుతున్నాయి,

మీరు అధోలోకాలకు వెళ్ళి అక్కడి బాధాతప్తమైన ఆత్మలపై

బంగరు కేశాలుగల దేవతలైద్దరూ సింహాసనానికి ప్రణమిల్లేరు

నాలుగు తెల్లని రెక్కలు అగాధ తమోమయ అధోలోకాలకు దిగసాగాయి వెంటనే.

త్రోవ అగమ్యం, ప్రయాణం అనంతం, చివరకి  దేవతలు చేరుకున్నారు

వెలుతురు చొరని రక్త వర్ణపు అధోలోకాన్ని…దైవానికి దూరమైన లోకాన్ని

భయకంపితయైన కరుణ రోదించింది; విశ్వాసం సడలని ప్రేమ భయపడక,

దేవుని సర్వశక్తిమంతత్వాన్ని తలుచుకుని ఒక చిరునవ్వు నవ్వింది.

అంతే! కరుణ కన్నీరు పడినచోట మంటలు ఒక్కసారి ఉపశమించాయి

ఆ ప్రేమ చిరునవ్వు వెలుగులకు ఆశ నరకంలోకి ప్రవేశించింది!

రెండు స్వచ్చమైన ముఖాలు ఆనందంతో సింహాసనం వంక మీదకి చూశాయి,

నాలుగు రెక్కలు సంతోషంతో దేవుని పదసమీపాన కూచున్నాయి!

సముద్రానికంటే గంభీరంగా, హిమపాతం కంటే తొందరగా

రెక్కల టపటపలూ, కువకువల మధ్య అనశ్వర స్వరఒకటి పలికింది:

“స్వాగతం నా దేవతలరా! ఈ స్వర్గానికి మహదానందాన్ని తీసుకొచ్చారు;

ఇకనుంచి పాపాన్ని క్షమించే గీతమే ఇక్కడి ఆప్త గీతం.”

.

జాన్ గ్రీన్ లీగ్ విటియర్

అమెరికను కవి

(December 17, 1807 – September 7, 1892 )

The Two Angels

.

God called the nearest angels who dwell with Him above:

The tenderest one was Pity, the dearest one was Love.

“Arise,” He said, “my angels! a wail of woe and sin

Steals through the gates of heaven, and saddens all within.

“My harps take up the mournful strain that from a lost world swells,

The smoke of torment clouds the light and blights the asphodels.

“Fly downward to that under world, and on its souls of pain,

Let Love drop smiles like sunshine, and Pity tears like rain!”

Two faces bowed before the Throne, veiled in their golden hair;

Four white wings lessened swiftly down the dark abyss of air.

The way was strange, the flight was long; at last the angels came

Where swung the lost and nether world, red-wrapped in rayless flame.

There Pity, shuddering, wept; but Love, with faith too strong for fear,

Took heart from God’s almightiness and smiled a smile of cheer.

And lo! that tear of Pity quenched the flame whereon it fell,

And, with the sunshine of that smile, hope entered into hell!

Two unveiled faces full of joy looked upward to the Throne,

Four white wings folded at the feet of Him who sat thereon!

And deeper than the sound of seas, more soft than falling flake,

Amidst the hush of wing and song the Voice Eternal spake:

“Welcome, my angels! ye have brought a holier joy to heaven;

Henceforth its sweetest song shall be the song of sin forgiven!”

.

John Greenleaf Whittier

(December 17, 1807 – September 7, 1892 )

American

The World’s Best Poetry.

Eds: Bliss Carman, et al.

Volume IV. The Higher Life.  1904.

III. Faith: Hope: Love: Service

http://www.bartleby.com/360/4/99.html

ప్రేమికుల వియోగం… అజ్ఞాత చీనీ కవి

ఆమె: “కోడి కూస్తోంది, విను!

అతడు: “లేదు! ఇంకా చీకటిగానే ఉంది,”

ఆమె: “వెలుగు రేకలు విచ్చుకుంటున్నై.”

అతడు: “లేదు, నా వెలుగు కిరణమా!”

ఆమె: “ఏదీ లేచి చూసి చెప్పు

ఆకాశం తెల్లబడటం లేదు?”

ఆమె: “వేగు చుక్క ఇప్పుడే

తిర్యగ్రేఖదాటి ఎగబ్రాకుతోంది.”

ఆమె: “అయితే నువ్వు త్వరగా వెళ్ళిపో:

అయ్యో! నువ్వు వెళ్ళవలసిన వేళ సమీపించిందే!;

కానీ ముందు ఆ కోడికి గుణపాఠం చెప్పు

అదే మన కష్టాలకి నాంది పలికింది.”

.

అజ్ఞాత చీనీ కవి

The Parting Lovers

.

She says, “The cock crows,—hark!”

He says, “No! still ’t is dark.”

She says, “The dawn grows bright,”

He says, “O no, my Light.”

She says, “Stand up and say,

Gets not the heaven gray?”

He says, “The morning star

Climbs the horizon’s bar.”

She says, “Then quick depart:

Alas! you now must start;

But give the cock a blow

Who did begin our woe!”

.

(From the Chinese by William. R. Alger)

Anonymous

Poem Courtesy:

The World’s Best Poetry.

Eds. Bliss Carman, et al.

Volume III. Sorrow and Consolation.  1904.

  1. Parting and Absence

http://www.bartleby.com/360/3/52.html

 

వనదేవత… జాన్ మిల్టన్, ఇంగ్లీషు కవి

అడుగుల జాడలు అగుపడక,

మిలమిల మెరిసే మెత్తని ఆకుపచ్చని పచ్చికమీద,

నేను తీగలు సారిస్తూ

పాటపాడుతుంటే నన్ననుసరించు.

చుక్కలు చొరరాని చిక్కని

ఎల్మ్ చెట్టు కొమ్మల నీడలో

నా వెంట రా

ఆమె దివ్యత్వానికి తగ్గట్టుగా

శోభాయమానంగా అలంకరించుకుని కూచున్న

ఆమెదగ్గరకి నిను చేరుస్తాను.

అటువంటి వనదేవతని

ఈ నేల ఎన్నడూ చూసి ఎరుగదు.

.

జాన్ మిల్టన్

9 December 1608 – 8 November 1674

ఇంగ్లీషు కవి

(From ‘Arcades’)

.

O’RE the smooth enameld green      

    Where no print of step hath been,

    Follow me as I sing,  

    And touch the warbled string.      

Under the shady roof    

Of branching Elm Star-proof,

    Follow me,      

I will bring you where she sits

Clad in splendor as befits       

    Her deity.        

Such a rural Queen       

All Arcadia hath not seen.

.

John Milton.

9 December 1608 – 8 November 1674

Poem Courtesy:

The Oxford Book of English Verse: 1250–1900.

Ed: Arthur Quiller-Couch, 1919.

http://www.bartleby.com/101/312.html

 

 

గంతులేసే పిల్లలు… జార్జి డార్లీ, ఐరిష్ కవి

సొట్టలుపడే బుగ్గల్లా తూగుతున్న పచ్చిక బీళ్ళలోకి
తెల్లకుచ్చుల జుత్తుగల తలలగుంపొకటి దూసుకొచ్చింది
మొగ్గల్లాంటి పెదాలున్న బాలురూ బాలికలూ
ప్రేమపాశాల చిట్టిపొట్టి ప్రతిరూపాలు వాళ్ళు.

నవ్వులతో సుడులు తిరుగుతున్న కనుల వరుసలవి
ఎంతచక్కగా మెరుస్తున్నాయి! ఎలా కదలాడుతున్నాయి!
నదిమీద తళతళలాడే కెరటాల్లా
జంటవెంట మరొక జంట మెరుస్తున్నాయి.

ఆనందపు మత్తులో తూలుతున్న కెంపువన్నె ముఖాలు
సంతోషం తాండవించే దివ్యస్వరూపాలు అవి,
ప్రేమగా మీరుచేసే ఎకసెక్కాలూ, కోణంగిచేష్టలూ
వాళ్ళూ మీతో చేస్తారు, చెయ్యడానికి వాళ్ళు భయపడరు.
.
జార్జి డార్లీ
1795- నవంబరు 23, 1846

ఐరిష్ కవి

.

The Gambols of Children

DOWN the dimpled greensward dancing, 

  Bursts a flaxen-headed bevy,—     

Bud-lipt boys and girls advancing,  

  Love’s irregular little levy.   

Rows of liquid eyes in laughter,       

  How they glimmer, how they quiver!      

Sparkling one another after,   

  Like bright ripples on a river.        

Tipsy band of rubious faces,  

  Flushed with Joy’s ethereal spirit, 

Make your mocks and sly grimaces 

  At Love’s self, and do not fear it.

.

George Darley

(1795– Nov 23, 1846)

The World’s Best Poetry.

Eds.  Bliss Carman, et al.

Volume I. Of Home: of Friendship.  1904.

Poems of Home: I. About Children

http://www.bartleby.com/360/1/41.html

హామ్లెట్ స్వగతం… షేక్స్పియర్

జీవించడమా, మరణించడమా,- అదీ అసలు ప్రశ్న:-

అదృష్టము ఇష్టమొచ్చిన రీతిలో సంధించే బాధలూ కష్టాలను

మనసులోనే భరించి సహించి ఊరుకోవడం ఉదాత్తమా,

లేక సముద్రకెరటాల్లా వచ్చే ఆపదలపై కత్తి దూయడమా,

అలా ఎదిరించడం వల్ల వాటికి ముగింపు పలకడమా? లేక మృత్యువు… దీర్ఘనిద్ర

నశించడం; అలా మరణించడం వల్ల, మనం గుండె దొలిచే బాధలనుండి

ఈ శరీరానికి ప్రకృతిసిద్ధంగావచ్చే, వారసత్త్వంగా సంక్రమించే

వేల కొద్దీ కష్టాలనుండి గట్టెక్కగలమా?

అటువంటి పరిపూర్ణమైన విముక్తి మనసారా కోరుకోవలసిందే

నశ్వరమైన శరీరం… అనశ్వరమైన నిద్ర.

ఆ దీర్ఘనిద్రలో… ఒకవేళ కలలొస్తే… అక్కడే ఉంది కిటుకు;

ఆ మృత్యునిద్రలో ఎటువంటి కలలు వస్తాయో?

మనమీ మృత్తిక శరీరాన్ని విడిచిపెట్టేక

మనకి కొంత ఊరట లభించాలి: అప్పుడే దానికి విలువ

అంతసుదీర్ఘమైన బాధామయ జీవితం గడిపినందుకు

లేకపోతే, ఎవడు భరించగలడు కాలం చేసే అత్యాచారాలని,

నిరంకుసులు పెట్టే హింసలని, గర్విష్టి చేసే అవమానాల్ని

తిరస్కృత ప్రేమ కలిగించే గుండెకోతని, జాప్యమైన న్యాయాన్ని,

అధికార పీఠపు గర్వాన్ని, ఎంత యోగ్యత ఉన్నా

సహనంతో భరించగల అయోగ్యుల తిరస్కృతుల్ని…

తన జీవితానికి తానే ఒక చుర కత్తితో

విముక్తి ప్రసాదించుకుంటే? ఒక నిస్సారమైన జీవితపు

శ్రమనీ, నిట్టూర్పుల్నీ ఎవడు భరించగలడు

మరణానంతరం ఏమవుతుందో నన్న భయానికి తప్ప.

అదెవరూ ఎరుగని ప్రదేశము… దాని తీరాలనుండి

వెళ్ళినవాడెవరూ తిరిగి రాలేదు, అదే మనసుని కలవరపెడుతుంది,

మనం పడే కష్టాలని సహించడమే మేలనిపిస్తుంది

మనకి తెలియని చోటుకి పరిగెత్తి పారిపోయేకంటే.

మనసు ఆ విధంగా మనల్ని పిరికివాళ్ళను చేస్తుంది.

భయానకమైన ఆ ఊహ నేపథ్యంలో

వర్ణమాలవంటి ఏ నిర్ణయమైనా వెలవెల బోతుంది.

ఎంత చేవగల సమయోచితమైన గొప్ప ప్రయత్నమైనా

ఈ విషయంలో దాని మార్గాన్ని కోల్పోయి

అది ప్రయత్నమని పిలిచే యోగ్యత కోల్పోతుంది.

.

షేక్స్పియర్

 William Shakespeare

.

To be, or not to be,—that is the question:—

Whether’t is nobler in the mind to suffer

The slings and arrows of outrageous fortune,

Or to take arms against a sea of troubles,

And, by opposing, end them?—To die, to sleep;—

No more; and, by a sleep, to say we end

The heart-ache, and the thousand natural shocks

That flesh is heir to,— ‘t is a consummation

Devoutly to be wished. To die,—to sleep;—

To sleep! Perchance to dream:—ay, there’s the rub;

For in that sleep of death what dreams may come,

When we have shuffled off this mortal coil,

Must give us pause: there’s the respect

That makes calamity of so long life;

For who would bear the whips and scorns of time,

The oppressor’s wrong, the proud man’s contumely,

The pains of despised love, the law’s delay,

The insolence of office, and the spurns

That patient merit of the unworthy takes,

When he himself might his quietus make

With a bare bodkin? Who would fardels bear,

To grunt and sweat under a weary life,

But that the dread of something after death,—

The undiscovered country, from whose bourn

No traveller returns,—puzzles the will,

And makes us rather bear those ills we have,

Than fly to others that we know not of?

Thus conscience does make cowards of us all;

And thus the native hue of resolution

Is sicklied o’er with the pale cast of thought;

And enterprises of great pith and moment,

With this regard, their currents turn awry,

And lose the name of action.

.

Shakespeare

 (From HAMLET. Act III. Sc. 1)

 

విశ్వజనీన ప్రార్థన… అలెగ్జాండర్ పోప్, ఇంగ్లీషు కవి

సమస్త సృష్టికీ ఆద్యుడవైన ఓ తండ్రీ!
ప్రతి యుగంలో, ప్రతి దేశంళో
యోగులూ, పశుప్రాయులూ,వివేకులు
కొలిచే యెహోవా, ప్రభూ, పరమాత్మా!

నువ్వే ప్రథమ కారణానివి, అనవగతమవు,
నా ఇంద్రియాలన్నిటినీ స్వాధీనపరుచుకుని
ఇదొక్కటి తెలియజేస్తావు, నువ్వు సత్యమని
నామట్టుకు నేను నిను చూడలేని అంధుణ్ణి.

కానీ, ఈ విశాల నిశా సామ్రాజ్యంలో
చెడులో మంచి చూడగల శక్తి నిచ్చేవు.
ప్రకృతిని విధికి బానిసను చేసి
కాస్తంత వెసులు ఇచ్చావు తోచింది చెయ్యడానికి.

నా మనసు ఏది చెయ్యమని చెబుతుందో
లేక వద్దని వారిస్తుందో,
దీన్ని నరకంకంటే భయంగా త్రోసిపుచ్చేలా
దాన్ని స్వర్గంకంటే ప్రియంగా అనుసరించేలా అనుగ్రహించు.

నీవు దయతో ప్రసాదించిన వరాలను
నేను పోగొట్టుకోకుండా చూడు;
మనిషి తీసుకుంటేనే దేమునికి సంతృప్తి
వాటిని అనుభవించడమే, విధేయత.

అయినప్పటికీ, నీ కరుణ
ఈ భూతలానికే పరిమితమని నను పొరబడనీకు,
ఇన్ని విశ్వాలు వ్యాపించి ఉండగా
నిన్ను ఒక మానవుడికే దేవునిగా భ్రమించనీకు.

ఈ బలహీనమైన, తెలివితక్కువ చేయి
నీకు మారుగా అస్త్రాలను ప్రయోగించి
నీకు శత్రువని నేను నిర్ణయించిన ప్రతివారికీ
నేల నలుచెరగులా శిక్షలు విధించేలా చెయ్యనీకు.

నా మార్గము సరియైన దయితే, నీ కరుణ
నేను ఆ మార్గంలో కొనసాగేలా చూడనీ;
నేను తప్పు చేస్తే, ప్రభూ, నా మనసుకి
మంచి మార్గం వెతుక్కునేలా ఉపదేశించు!

మూర్ఖపు అహంకారమూ, పాపిష్టి అసంతృప్తీ
నన్ను ఈ రెంటినుండీ ఒకే రీతిగా కాపాడు:
నీ విజ్ఞత నాకు ఏది తిరస్కరించినా,
నీ కరుణ నాకు ఏది అనుగ్రహించినా

ఇతరుల కష్టాన్ని తెలుసుకునేలా బోధించు
నే కనుగొన్న లోపాలు దాచగలిగేలా చెయ్యి;
నేను ఇతరులపై ఏ మేరకు కరుణ ప్రదర్శిస్తానో
ఆ మేరకు నాకు నువ్వు నీ కరుణ ప్రసాదించు.

నేను నీచుణ్ణే గాని మరీ అంత కాదు;
నీ పేరు జపించిన కారణం చేత;
ప్రభూ, నేను ఎక్కడకి వెళ్ళినా త్రోవ చూపించు
అది ఈ రోజు జీవితమైనా, మృత్యువైనప్పటికీ.

ఈ రోజుకింత రొట్టె దొరికి, ప్రశాంతత చిక్కనీ,
సృష్టిలో ఈ విశాల గగనం క్రింద సమస్తానికీ
ఏది దొరికిందో ఏది దొరకలేదో అన్నీ నేకెరుకే,
నీ చిత్తం ఎలా ఉంటే అలా జరగనీ.

ఈ రోదసే దేవాలయమైన నీకి,
ఈ నేలా, సముద్రాలూ, ఆకాశమూ పూజాస్థలమైన నీకు
అన్ని ఆత్మలూ ముక్త కంఠంతో కీర్తించుగాక!
ప్రకృతి అంతా నీకు సుగంధాలు అర్చించుగాక!
.

అలెగ్జాండర్ పోప్

 21 May 1688 – 30 May 1744

ఇంగ్లీషు కవి

 

.

The Universal Prayer

Father of all! in every age,

  In every clime adored,

By saint, by savage, and by sage,

  Jehovah, Jove, or Lord!

Thou great First Cause, least understood,

  Who all my sense confined

To know but this, that thou art good,

  And that myself am blind;

Yet gave me, in this dark estate,

  To see the good from ill;

And, binding nature fast in fate,

  Left free the human will:

What conscience dictates to be done,

  Or warns me not to do,

This, teach me more than hell to shun,

  That, more than heaven pursue.

What blessings thy free bounty gives

  Let me not cast away;

For God is paid when man receives,

  To enjoy is to obey.

Yet not to earth’s contracted span

  Thy goodness let me bound,

Or think thee Lord alone of man,

  When thousand worlds are round:

Let not this weak, unknowing hand

  Presume thy bolts to throw,

And deal damnation round the land

  On each I judge thy foe.

If I am right thy grace impart

  Still in the right to stay;

If I am wrong, O, teach my heart

  To find that better way!

Save me alike from foolish pride

  And impious discontent

At aught thy wisdom has denied,

  Or aught thy goodness lent.

Teach me to feel another’s woe,

  To hide the fault I see;

That mercy I to others show,

  That mercy show to me.

Mean though I am, not wholly so,

  Since quickened by thy breath;

O, lead me wheresoe’er I go,

  Through this day’s life or death!

This day be bread and peace my lot;

  All else beneath the sun,

Thou knowest if best bestowed or not,

  And let thy will be done.

To thee, whose temple is all space,

  Whose altar, earth, sea, skies,

One chorus let all Being raise,

  All Nature incense rise!

.

Alexander Pope

(1688–1744)

English Poet

The World’s Best Poetry.

Eds. Bliss Carman, et al.

Volume IV. The Higher Life.  1904.

  1. The Divine Element—(God, Christ, the Holy Spirit)

http://www.bartleby.com/360/4/7.html

 

రాకుమారి… బ్యోర్న్ స్టెయిన్ బ్యోర్న్ సన్, నార్వే కవి

రాకుమార్తె తన స్వంత పొదరింటిలో ఒంటరిగా కూర్చుంది
ఆ యువకుడు కోటబురుజు పీఠం దగ్గర కూచుని బూరా ఊదుతున్నాడు.
“ఎందుకు ఎప్పుడూ పాడుతుంటావు? బ్రతిమాలుకుంటాను. ఊదకు.
సూర్యాస్తమయ మయితే,
అది నా ఆలోచనలు స్వేచ్చగా దూరంగా విహరించనీయదు.

తన స్వంత పొదరింటిలో రాకుమార్తె దీనంగా కూచుంది.
ఆ యువకుడు కొమ్ము ఊదడం ఆపేసేడు.
“ఓహ్! నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? బ్రతిమాలుతాను పాట వాయించు.
సూర్యాస్తమయితే, అది
నా ఊహలకి రెక్కలు తొడిగి ఎక్కడికో విహరింపజేస్తుంది.

తన స్వంత పొదరింటిలో రాకుమార్తే నిస్సహాయంగా కూచుంది
ఆ యువకుడు మరొకసారి ఉత్సాహంతో బూరా ఊదనారంభించేడు.
నీడలు పాకురుతున్నకొద్దీ ఆమె రోదించసాగింది; నిట్టూర్చింది;
“ఓ భగవంతుడా! సూర్యుడు అస్తమించాడు.
ఇప్పుడు చెప్పు, నా మనసుకి ఏమయిపోతోంది?
.
బ్యోర్న్ స్టెయిన్ బ్యోర్న్ సన్,
(8 December 1832 – 26 April 1910)

నార్వే కవి

.

The Princess

 .

The Princess sat lone in her maiden bower,        

The lad blew his horn at the foot of the tower.   

“Why playest thou alway? Be silent, I pray,       

It fetters my thoughts that would flee far away,  

          As the sun goes down.”

In her maiden bower sat the Princess forlorn,     

The lad had ceased to play on his horn.    

“Oh, why art thou silent? I beg thee to play!      

It gives wings to my thought that would flee far away,

          As the sun goes down.”

In her maiden bower sat the Princess forlorn,     

Once more with delight played the lad on his horn.      

She wept as the shadows grew long, and she sighed:   

“Oh, tell me, my God, what my heart doth betide,       

          Now the sun has gone down.”

.

(Translated from the Norwegian by Nathan Haskell Dole)

.

Björnstjerne Björnson

(8 December 1832 – 26 April 1910)

Norwegian Poet

1903 Nobel Prize for Literature

Poem Courtesy:

The World’s Best Poetry.

Eds: Bliss Carman, et al. 

Volume III. Sorrow and Consolation.  1904.

  1. Disappointment in Love

ఇంటి మారాజు… హెన్రీ వాడ్స్ వర్త్ లాంగ్ ఫెలో, అమెరికను కవి

కూచుని ఆ ఇద్దర్నీ చూస్తుంటాను
కానీ ఒంటరిగా కాదు, వాళ్ళో దేవదూతని కూడా
అలరిస్తుంటారు తెలియకుండానే.
ముఖం అచ్చం చంద్ర బింబంలా
ఒక రాజ అతిథి వేంచేసేరు ఎగురుతున్న జుత్తుతో
తన సింహాసనం మీద ఆసీనుడై
చెంచాతో టేబిలుమీద వాయిద్యం వాయిస్తూ
నిర్లక్ష్యంగా దాన్ని క్రిందకు విసిరేసేడు,
మునుపెన్నడూ చూడనిదాన్ని అందుకునే ప్రయత్నంలో.
ఇవి స్వర్లోకపు మర్యాదలా? మనసు హరించే
మార్గాలూ, కళాకలాపాలా?
అహా! సందేహం లేదు. అతిథి ఏంచేసినా
ఆలోచించే చేస్తాడు, ఏం చేసినా బాగుంటుంది;
తను భగవద్దత్తమైన అశక్తత అనే
అధికారంతో ఏలుతుంటాడు; కొత్తగా ఈ మధ్యనే
ప్రభాతవేళలో పుట్టిన ఈ బాలుడు,
నీ మీదా నా మీదా ఆధిపత్యం చెలాయిస్తాడు;
అతను మాటాడడు; కానీ అతని కనులవెంట
సంభాషణ జరుగుతూనే ఉంటుంది;
నోరు మెదపని గ్రీకుల మౌనమూ
మహా మేధావుల లోతైన ఆలోచనా
అచ్చుపుస్తకాల్లో ఉన్న దానికంటే స్పష్టంగా
మాటల్లో లేకపోయినా చూపుల్లో తెలుస్తుంది,
ఏదో మాటాడగలిగినా మాటాడడం ఇష్టం లేనట్టు.
ఓ మహప్రభూ! తమ సర్వంసహాధికార శక్తి
ఇప్పుడు ఋజువు చెయ్యబడింది. అదిగో చూడండి!
దేన్నీ లక్ష్యం చెయ్యకుండా గంభీరంగా,
నెమ్మదిగా అడుగులేసుకుంటూ సముద్రంలా దాది వస్తోంది.
తమ కుర్చీనీ, తమనీ కొద్దిగా వెనక్కి తోస్తోంది.
మహా ప్రభూ! ఇక శలవా మరి. శుభరాత్రి.
.
హెన్రీ వాడ్స్ వర్త్ లాంగ్ ఫెలో
February 27, 1807 – mArci 24, 1882)
అమెరికను కవి

 

.

The Household Sovereign

.

Seated I see the two again,

But not alone; they entertain

A little angel unaware,

With face as round as is the moon;

A royal guest with flaxen hair,

Who, throned upon his lofty chair,

Drums on the table with his spoon,

Then drops it careless on the floor,

To grasp at things unseen before.

Are these celestial manners? these

The ways that win, the arts that please?

Ah, yes; consider well the guest,

And whatsoe’er he does seems best;

He ruleth by the right divine

Of helplessness, so lately born

In purple chambers of the morn,

As sovereign over thee and thine.

He speaketh not, and yet there lies

A conversation in his eyes;

The golden silence of the Greek,

The gravest wisdom of the wise,

Not spoken in language, but in looks

More legible than printed books,

As if he could but would not speak.

And now, O monarch absolute,

Thy power is put to proof; for lo!

Resistless, fathomless, and slow,

The nurse comes rustling like the sea,

And pushes back thy chair and thee,

And so good night to King Canute.

.

From “The Hanging of the Crane”

.

 

Henry Wadsworth Longfellow

(February 27, 1807 – March 24, 1882)

American

 

Poem Courtesy:

The World’s Best Poetry.

Eds. Bliss Carman, et al.

Volume I. Of Home: of Friendship.  1904.

Poems of Home: I. About Children

http://www.bartleby.com/360/1/19.html

ఇంట్లో పిల్లలు లేరు… క్లారా డోలివర్, అమెరికను కవయిత్రి

నా కర్థమయింది, ఇంట్లో పిల్లల్లేరని

ఇల్లు మరీ శుభ్రంగా, పొందికగా ఉంది.

నేల మీద చేతుల్తో ఇష్టమొచ్చినట్టు

విసిరేసిన ఆట బొమ్మలు కనిపించడం లేదు.

కిటికీల మీద వేలిముద్రలు లేవు,

కుర్చీల మీద గీతలు లేవు;

కర్ర బొమ్మలు వరుసలో నిలబెట్టి లేవు,

లేదా జంటలుగా తరలించిందీ లేదు;

కాలివేళ్ళదగ్గర బాగా మురికిపట్టి

చిరుగులు పడ్డ మేజోళ్ళు లేవు పోగువెయ్యడానికి;

చిన్న చిన్న మరమ్మత్తు చెయ్యడానికి

అన్నీ పిల్లలబట్టలతో కూడిన మేటలు లేవు

ఆర్చడానికి ఏ చిన్న చిన్న బాధలూ లేవు

ముడవడానికి చిన్ని చేతులు లేవు;

కడగడానికి జిడ్దు పట్టిన వేళ్ళు లేవు

చెప్పడానికి కథలు లేవు;

ఇవ్వడానికి లేత ముద్దులు లేవు

చిట్టీ, చంటీ అన్న ముద్దుపేర్లు లేవు;

సాయంత్రం టీ తాగేక సరదా గంతులు లేవు…

అంటే, ఇంట్లో చిన్న పిల్లలు లేరు.

.

క్లారా డోలివర్

1874-1891

అమెరికను కవయిత్రి

 

 

.

No Baby in the House

.

No baby in the house, I know,

  ’T is far too nice and clean.

No toys, by careless fingers strewn,

  Upon the floors are seen.

No finger-marks are on the panes,

  No scratches on the chairs;

No wooden men set up in rows,

  Or marshalled off in pairs;

No little stockings to be darned,

  All ragged at the toes;

No pile of mending to be done,

  Made up of baby-clothes;

No little troubles to be soothed;

  No little hands to fold;

No grimy fingers to be washed;

  No stories to be told;

No tender kisses to be given;

  No nicknames, “Dove” and “Mouse;”

No merry frolics after tea,—

  No baby in the house!

.

Clara G. Dolliver

1874-1891

American

Poem Courtesy:

The World’s Best Poetry.

Eds.  Bliss Carman, et al.

Volume I. Of Home: of Friendship.  1904.

Poems of Home: II. For Children

http://www.bartleby.com/360/1/70.html

 

చిత్రపటంతో … ఆర్థర్ సైమన్స్, ఇంగ్లీషు కవి

బీరువాలోంచి విచార వదనం
ఒకటి నన్ను పరికిస్తోంది…
గతించిన ప్రేమకు అవశేషం
నా ప్రేతాత్మకి సగ భాగం.

నాకు ఇష్టమైన ఆ నిరీక్షించే కళ్ళు
నన్ను పరిశీలిస్తూ ఎంతగా అభిమానించేవని…
ఏమిటో ఇప్పుడు బరువైన జ్ఞాపకాల దొంతరలు
ఆమె నిరీక్షించే చూపులు.

ఓ నా ప్రేమ చిహ్నమా, నీకు అన్యాయం జరిగింది, 
తిరిగి రా: అలనాటి ప్రేమలోని బాధలన్నీ, 
అప్పుడు భరించి, ఇపుడు మరుగుపడినా,
మళ్ళీ తిరిగిరా!

వాటిని మరిచిపోకు, కానీ మన్నించు!
ప్చ్! సమయం మించిపోయింది! ఏడ్చిప్రయోజనం లేదు.
మనిద్దరం రెండు ప్రేతాత్మలం. జీవించడానికి
అవకాశం వచ్చినా చేజార్చుకున్నాం, నువ్వూ— నేనూ.

.

ఆర్థర్ సైమన్స్

28 February 1865 – 22 January 1945

ఇంగ్లీషు కవి

.

.

To a Portrait

A pensive photograph

  Watches me from the shelf—

Ghost of old love, and half

  Ghost of myself!

How the dear waiting eyes

  Watch me and love me yet—

Sad home of memories,

  Her waiting eyes!

Ghost of old love, wronged ghost,

  Return: though all the pain

Of all once loved, long lost,

  Come back again.

Forget not, but forgive!

  Alas, too late I cry.

We are two ghosts that had their chance to live,

  And lost it, she and I.

.

Arthur Symons

 28 February 1865 – 22 January 1945

British Poet and Critic

Poem Courtesy:

The World’s Best Poetry.

Eds.  Bliss Carman, et al.

Volume III. Sorrow and Consolation.  1904.

  1. Disappointment in Love

http://www.bartleby.com/360/3/15.html

 

%d bloggers like this: