రోజు: ఏప్రిల్ 29, 2016
-
సానెట్ 34… షేక్స్పియర్
ఇంత అందమైన రోజుని ఎందుకు వాగ్దానం చేసి నన్ను ఏ మెయికప్పులూ లేకుండా బయలుదేరేలా పురికొల్పావు? బడుగు మేఘాలు దారిలో నన్ను దాటి ముందుకుపోయి వాటి దట్టమైన నల్లటి పొగల్లో నీ ప్రతాపాన్ని కనుమరుగుచెయ్యడానికా? నువ్వు అప్పుడప్పుడు మేఘాల్ని చీల్చుకువచ్చి వర్షం దెబ్బతిన్న నా ముఖం మీది చినుకుల తడి ఆరబెడితే సరిపోదు గాయాన్ని మాన్చగలిగినా అవమానం తొలగించలేని గాయం గురించి ఏ మనిషీ గొప్పగా చెప్పుకోలేడు నీకు జరిగిన అవమానం నా దుఃఖానికి ఉపశమనం ఇవ్వదు…