రోజు: ఏప్రిల్ 24, 2016
-
సానెట్ 28… షేక్స్పియర్
విశ్రాంతి నుండి లభించే సుఖానికి దూరమైన నేను అలాంటపుడు, సుఖావస్థకి ఎలా చేరుకోగలను చెప్పు ? పగలుపడ్డ శ్రమ రాత్రికి తీరడం పోయి, రాత్రీ పగలూ, పగలూ రాత్రీ వేధిస్తుంటే ఎలా? ఆ రెండూ ఒక దానికొకటి శత్రువులైనా, స్నేహితుల్లా నను వేధించడానికి మాత్రం చేతులు కలుపుతున్నాయి. ఒకటి శ్రమకి గురి చేసీ, రెండవది నేను ఎంత కష్టపడినా, నీనుండి ఇంకా దూరమేనని గుర్తుచేస్తూను. నేను పగటితో అంటాను సంతోషపరచడానికి:నువు కాంతిమంతుడవు; ఆకాశాన్ని కారుమబ్బులు కమ్మినా, అతనిని…