రోజు: ఏప్రిల్ 20, 2016
-
సానెట్ 26 … షేక్స్పియర్
నా ప్రేమకు నెలవైన ఓ స్వామీ! నీకు దాస్యం చేయడంలోనే నా సేవా ధర్మాన్నిమీ ప్రభుపాత్రత కట్టిపడేసింది, అందుకే నీకీ లిఖిత సందేశాన్ని పంపుకుంటున్నాను,నాలో విధినిర్వహణమాత్రమే చూడండి, ప్రదర్శించే తెలివిని కాదు. సేవానిరతి ఘనమైనా, మందబుద్ధియైన నాలాంటి వాడు మాటల్లో చెప్పలేకపోవడంలోనే దానిని తేటతెల్లం చేస్తాడు; నా జీవితాన్ని ఏ గ్రహాలు శాసిస్తునాయో గాని, వాటి అనుగ్రహ వీక్షణాలు నా మీద ప్రసరించి, నిరాడంబరమైన నా ప్రేమని సవస్త్రను చేసి మీ అభిమానానికి యోగ్యుడనని ఋజువుచేసేదాకా మీ…