రోజు: ఏప్రిల్ 17, 2016
-
సానెట్ 23… షేక్స్పియర్
రంగస్థలి మీద నిపుణతలేని నటుడు భయంతో తన సంభాషణలు మరిచిపోయినట్టు; ఒక ముక్కోపికి పట్టరాని కోపం వచ్చి అతని బలమే, బలహీనతై కూలబడినట్టు; నేను, నా మాటలు నమ్మరేమోనన్న భయంతో ప్రేమ సంసర్గాన్ని తగురీతిలో స్తుతించలేకున్నాను అతిశయించిన ప్రేమ బరువుతో నలిగిన నా మనసు తనకున్న సహజమైన బలాన్ని కోల్పోతోంది. ప్రేమని సమర్థిస్తూ, ప్రతిఫలాన్ని అన్వేషిస్తూ ఈ నాలుక ఇంతవరకు పలికిన పలుకులన్నిటికంటే ఇకపై, నా కవితలే తమ పద విస్తృతితో ఈ మనసు చెప్పదలుచుకున్నదంతా మౌనంగా…