రోజు: ఏప్రిల్ 15, 2016
-
సానెట్ 21… షేక్స్పియర్ ఇంగ్లీషు కవి
కవితా కన్యలాగే నేనూను అందమైన బొమ్మని చూడగానే కవిత్వం అల్లలేను; నిన్ను ప్రకృతే ఒక అలంకారంగా సింగారించుకుంటోంది. ప్రతి అందమూ నీ అందంతో సరిపోల్చుకుంటున్నాయి గర్వంగా చెప్పుకునే అందాల జంటలు ఏర్పడుతున్నై, సూర్యుడూ-చంద్రుడూ, ఈ భూమీ-రత్నగర్భయైన సముద్రం, వసంతంలో చిగిర్చే తొలిపూలవంటి అపురూపమైన వస్తువులతో మేదినీవలయ పరివేష్టితమైన ఈ రోదసి నిండి ఉంది. నా ప్రేమ ఎంత సత్యమో అంత సత్యంగా రాస్తాను నా మాట నమ్ము, ఏ తల్లి కన్న బిడ్డైనా అందంగా ఉన్నట్టు నా…