సానెట్ 17… షేక్స్పియర్

రానున్న కాలాల్లో నా కవితలెవడు నమ్ముతాడు

వాటి నిండా నీ అందంగురించిన విశేషాలే ఉంటే?

ఒక్క దైవానికి తెలుసు; నీ శరీరాన్ని భద్రపరిచిన

ఆ సమాధి నీ అందంలో సగాన్నికూడా ప్రకటించలేదు.

నేను నీ కన్నుల అందాన్ని గురించి వ్రాయగలిగితే,

ఒక్కొక్క కవితలో చెప్పలేనన్ని నీ సొగసులూ వర్ణిస్తే,

రాబోయే రోజుల్లో ప్రజలు అంటారు,”ఈ కవి అబద్ధాలకోరు.

అటువంటి అందాలు ఈ భూమి మీద ఇంతవరకు పుట్టలేదు.” అని.

కాలంతో పాటు రంగు వెలిసిన నా కాగితాలని చీదరించుకుంటారు

మాటలకంటే చేతల్లో తక్కువ నిజాయితీగల వృద్ధుణ్ణి అసహ్యించుకున్నట్టు

అచ్చమైన నీ సౌందర్యాన్నంతటినీ కవి పైత్యంగా

ఒక ఆదిమ గీతానికి సాగదీసిన పదకల్పనగా భావిస్తారు.

అదే నీ సంతతి ఎవరైనా అప్పటికి జీవించి ఉంటే

నువ్వు ద్వివిధా చిరంజీవివి… ఆ సంతులో, నా కవితలో.

.

షేక్స్పియర్

.

William Shakespeare

SONNET 17

Who will believe my verse in time to come,
If it were fill’d with your most high deserts?
Though yet Heaven knows it is but as a tomb 
Which hides your life and shows not half your parts.
If I could write the beauty of your eyes, 
And in fresh numbers number all your graces, 
The age to come would say, ‘This poet lies, 
Such heavenly touches ne’er touch’d earthly faces.’
So should my papers yellow’d with their age, 
Be scorn’d like old men of less truth than tongue,
And your true rights be term’d a poet’s rage 
And stretched metre of an antique song: 
   But were some child of yours alive that time,
   You should live twice,– in it and in my rhyme. 

.

Shakespeare

 

NOTES

XVII. The poet’s record is, moreover, open to two objections; it is very imperfect, and, besides, posterity would not believe a full and accurate description of Mr. W. H.’s beauty, even if such a description were made. But the living record is open to no such objections; and, besides, it would confer an immortality additional to that given by the poet’s verses. 
2. Fill’d.-Q. has “fild.” 
6. In fresh numbers. Meaning probably “in successive new poems,” rather than “in new metres.” 
11. A poet’s rage. The product of poetical enthusiasm. 
12. Stretched metre. Mere inflated words. Q. has the spelling “miter.”

Sonnet and Notes Courtesy:

http://www.shakespeare-online.com/sonnets/17.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: