రోజు: ఏప్రిల్ 13, 2016
-
సానెట్ 17… షేక్స్పియర్
రానున్న కాలాల్లో నా కవితలెవడు నమ్ముతాడు వాటి నిండా నీ అందంగురించిన విశేషాలే ఉంటే? ఒక్క దైవానికి తెలుసు; నీ శరీరాన్ని భద్రపరిచిన ఆ సమాధి నీ అందంలో సగాన్నికూడా ప్రకటించలేదు. నేను నీ కన్నుల అందాన్ని గురించి వ్రాయగలిగితే, ఒక్కొక్క కవితలో చెప్పలేనన్ని నీ సొగసులూ వర్ణిస్తే, రాబోయే రోజుల్లో ప్రజలు అంటారు,”ఈ కవి అబద్ధాలకోరు. అటువంటి అందాలు ఈ భూమి మీద ఇంతవరకు పుట్టలేదు.” అని. కాలంతో పాటు రంగు వెలిసిన నా కాగితాలని…