రోజు: ఏప్రిల్ 11, 2016
-
సానెట్ -15 షేక్స్పియర్
పుట్టి, పెరిగి, సంపూర్ణత సాధించే ప్రతిదానికీ దాని పరిపక్వత క్షణికమే అన్న ఆలోచన వచ్చినపుడు; ఈ ప్రపంచం కేవలమొక నాటకరంగమనీ, దానిపై నక్షత్రాలు తమ రహస్య ప్రభావాన్ని చూపిస్తాయనీ అనుకుని, అవే నక్షత్రాలను అద్దుకున్న ఆకాశపు మంచిచెడుల ప్రభావంతో మనుషులందరూ మొక్కలెదిగినట్టు ఎదగడం చూసినపుడు, వాళ్ళ యవ్వనపు పసరు వయసు వాటాడువరకు చాటుతూ అతికష్టంగా వాళ్ళ జ్ఞాపకాల్లోంచి తప్పించడం గమనించినపుడు; భూమిమీద మనుగడ క్షణికమన్న భావన తళుక్కుమనగానే నీ యవ్వన శోభ నా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది.…