సానెట్- 14 … షేక్స్పియర్

అక్కడికి నేనేదో నక్షత్రాలను చూసి చెబుతానని కాదు

అయినప్పటికీ, నాకు కొంత ఖగోళజ్ఞానం ఉంది,

కానీ అది మంచి జరుగుతుందా, చెడుజరుగుతుందా,

ఏ అంటురోగాలతో ఎంతమంది చస్తారు, ఈ ఏడు ఎలా ఉంటుంది

చెప్పలేను; నిముషాలతో సహా భవిష్యత్తు చెప్పలేను;

ఎవరి మట్టుకు వాళ్ళకి రాబోయే విపత్తులూ, మంచీ చెడూ

లేదా రాచబిడ్డలకి అంతా సజావుగా వెళ్తుందా లేదా చెప్పలేను

ఆకాశంలో గ్రహాల గమనాన్ని పడికట్టు వేసి.

కానీ, నాకు తెలిసినదంతా నీ నుండే గ్రహిస్తాను

అక్కడి రెండు ధృవతారలు చూసి నే నీ లెక్కలు గణిస్తాను,

సత్యమూ, సౌందర్యమూ జమిలిగా అభివృద్ధిచెందుతాయి

నువ్వు నీ నుండి వాటిని పదిలపరచడానికి యత్నిస్తే;

లేకపోతే, నీ గురించి ఇదే నా భవిష్యవాణి:

నీ మరణంతో సత్యమూ, సుందరమూ అంతరిస్తాయి.

.

షేక్స్పియర్

.

William Shakespeare

.

SONNET 14

Not from the stars do I my judgment pluck;

And yet methinks I have astronomy,

But not to tell of good or evil luck,

Of plagues, of dearths, or seasons’ quality;

Nor can I fortune to brief minutes tell,

Pointing to each his thunder, rain and wind,

Or say with princes if it shall go well,

By oft predict that I in heaven find:

But from thine eyes my knowledge I derive,

And, constant stars, in them I read such art

As truth and beauty shall together thrive,

If from thyself to store thou wouldst convert;

Or else of thee this I prognosticate:

Thy end is truth’s and beauty’s doom and date.

.

Shakespeare

Courtesy:

http://www.shakespeare-online.com/sonnets/14.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: