రోజు: ఏప్రిల్ 7, 2016
-
సానెట్ 10…. షేక్స్పియర్
ఇది షేక్స్పియర్ 400వ వర్థంతి సంవత్సరం (ఈ సానెట్ లు వివాహానికి విముఖత చూపించే అందమైన యువకుణ్ణి ఉద్దేశించి రాసినవి) సిగ్గు సిగ్గు! ఎవరిమీదా నీకు ప్రేమలేదని ఒప్పుకో నువ్వంటే ఇష్టపడని తెలివితక్కువవాళ్ళెవరుంటారు? నిన్ను ఇష్టపడే వాళ్లు అసంఖ్యాకం, నికిష్టమయితే ఒప్పుకో. కానీ, నీకు ఎవరిమీదా ప్రేమ లేదన్నది మాత్రం స్పష్టం. నీకు అందరిపట్లా ఎంత ఏవగింపు అంటే, నిన్నుకూడా నువ్వు ద్వేషించుకుందికి వెనుకాడవు. మీ వంశాన్ని నిలబెట్టడం ఎలాగా అని కోరుకోవడం పోయి దానిని అంతం…