సానెట్ 9…. షేక్స్పియర్, ఇంగ్లీషు కవి

ఇది షేక్స్పియర్ 400వ వర్థంతి సంవత్సరం 

*

ఒక భర్తృవిహీనచే కంట తడిపెట్టించవలసి వస్తుందేమోనని

నిన్ను నువ్వు ఒంటరి జీవితంతో దహించుకుంటున్నావా?

అలాగైతే, నువ్వు పిల్లలు లేక కనుమూయవలసి వస్తే,

ఈ ప్రపంచం నీకోసం శోకిస్తుంది, సంతు లేని భార్యలా;

తన కన్న బిడ్డల కన్నుల్లో భర్త రూపాన్ని చూసుకుని

లోకంలో ప్రతి వితంతువూ భర్తకై శోకిస్తే,

నీ ప్రతిరూపాన్ని మిగల్చకుండా పోయావని

ప్రపంచమే అనాథయై నీకోసం విలపిస్తుంది.

ఈ లోకంలో దూబరామనిషి ఖర్చు చేసేదంతా

చేతులు మారుతుంది గానీ, వస్తువు ప్రపంచం అనుభవిస్తుంది.

కానీ అందం ఖర్చుచెయ్యడానికి ఈ సృష్టిలో ఒక లక్ష్యం ఉంది.

దాన్ని నిరుపయోగంగా ఉంచితే, ఆ వ్యక్తి దాన్ని నాశనం చేస్తున్నట్టే.

తనమీద తనకే అంత కనికరం లేక ప్రవర్తించే మనిషి

మనసులో ఇతరుల మీద ప్రేమ ఏ మాత్రమూ ఉండదు.

.

షేక్స్పియర్

26 ఏప్రిల్ 1564 – 23 ఏప్రిల్ 1616

ఇంగ్లీషు కవి

.

William Shakespeare

.

SONNET 9

Is it for fear to wet a widow’s eye

That thou consumest thyself in single life?

Ah! if thou issueless shalt hap to die,

The world will wail thee, like a makeless wife;

The world will be thy widow and still weep

That thou no form of thee hast left behind,

When every private widow well may keep

By children’s eyes her husband’s shape in mind.

Look what an unthrift in the world doth spend

Shifts but his place, for still the world enjoys it;

But beauty’s waste hath in the world an end,

And kept unused, the user so destroys it.

    No love toward others in that bosom sits

    That on himself such murderous shame commits.

.

William Shakespeare

26th April 1564 – 23rd April 1616

English Poet

Poem Courtesy: http://www.shakespeare-online.com/sonnets/9.html

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: