అనువాదలహరి

సానెట్ 8… విలియం షేక్స్పియర్, ఇంగ్లీషు కవి

ఇది షేక్స్పియర్ 400వ వర్థంతి సంవత్సరం  

 

సంగీతం వినవలసి వచ్చినప్పుడు, విచారంతో వినడమెందుకు?

తీపి తీపితో భేదించదు, ఆనందం ఆనందంతో కలిసి అధికమౌతుంది.

నువ్వు సంతోషంగా స్వీకరించలేనిదాన్ని ఆదరించడమెందుకు,

నిన్ను కలవరపరిచేదాన్ని నవ్వుతూ ఆహ్వానించడమెందుకు?

చక్కని సుస్వరాల రసజ్ఞమైన మేళవింపు,

వాటి రాగయుక్తమైన మేళన చెవులకు ఇంపు కాకుంటే

అవి నిన్ను మెత్తగా మందలిస్తున్నాయన్న మాట,

నీ ఒంటరిజీవితంతో వాటిని విస్మయపరుస్తున్నందుకు.

జాగ్రత్తగా గమనించు. ఒక తీగ, రెండవదానికి జంటయై

గతి తప్పకుండా, ఒకదానినొకటి తాకుతున్నయి.

ఒక కుటుంబంలోని తండ్రీ, బిడ్డా, ఉప్పొంగే తల్లిలా

అందరూ ఏకకంఠంతో మనోహరంగా పాడినట్టు:

మంత్రముగ్ధుల్ని చేసే ఆ పాటలు ఎన్నైనా వాటి అంతరార్థం

ఒకటే: “నువ్వు ఒంటరిగా ఋజువుచేసేది ఏదీ లేదు.”

.

విలియం షేక్స్పియర్

26 ఏప్రిల్ 1564 – 23 ఏప్రిల్ 1616 

ఇంగ్లీషు కవి

.

William Shakespeare

.

SONNET 8

Music to hear, why hear’st thou music sadly?

Sweets with sweets war not, joy delights in joy.

Why lov’st thou that which thou receiv’st not gladly,

Or else receiv’st with pleasure thine annoy?

If the true concord of well-tuned sounds,

By unions married, do offend thine ear,

They do but sweetly chide thee, who confounds

In singleness the parts that thou shouldst bear.

Mark how one string, sweet husband to another,

Strikes each in each by mutual ordering,

Resembling sire and child and happy mother

Who all in one, one pleasing note do sing:

    Whose speechless song, being many, seeming one,

    Sings this to thee: ‘Thou single wilt prove none.’

.

William Shakespeare

26th April 1564 – 23rd April 1616

English Poet

Poem Courtesy: http://www.shakespeare-online.com/sonnets/8.html

 

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: