నటజీవితానికి వేదనతో మిత్రుడికి లేక… షేక్స్పియర్, ఇంగ్లీషు కవి
ఇది షేక్స్పియర్ 400 వ వర్ధంతి సంవత్సరం
.
నా కృషికి తగిన ఫలాన్నందించలేని దోషి అదృష్టాన్ని నా కోసం తట్టిలేపుతున్నావా మిత్రమా! నా జీవితానికి పదిమందినీ అర్థించడం తప్ప ఏదీ దొరకలేదు; నా ప్రవర్తన కూడా అందుకే అలా. అందువల్లనే, నా పేరుకీ ఒక ముద్ర పడిపోయింది, అప్పటి నుండే నా నడవడికూడా మెతకబడింది, రంగుల్లో నానీ నానీ కలంకారుడి చెయ్యి రంగుదేరినట్టు. నన్ను కనికరించు! నాకీ జీవితం మీద విసుగేస్తోంది; ఈ మహత్తరమైన రోగానికి నువ్వు ఏ కషాయమిచ్చినా, ఇష్టపడి సేవించే రోగిలా, దాన్ని తీసుకుందికి సిద్ధం, అది ఎంతచేదు సలహా ఐనా నిన్ను తప్పుగా తీసుకోను ఒక తప్పుకి మరో తప్పు చేస్తున్నానే అని విచారించను కూడా.
మిత్రమా! నాపై జాలిచూపించు! నీకు మాట ఇస్తున్నా, నీ కనికరం చాలు! అదే నాకు నయం చేస్తుంది. . షేక్స్పియర్
29 ఏప్రిల్ 1564 – 23 ఏప్రిల్ 1616
ఇంగ్లీషు కవి
.
The Poet Laments to a Friend His Profession as an Actor
This sonnet, though it has one admirable passage,—about the dyer’s hand,—is not selected on account of its superiority to the general run of the author’s compositions of this kind, but because Shakespeare is here “unlocking his heart,” and because all his sonnets appear to have been written after he had entered upon a line of life for which he and others had not yet procured its just social consideration.
“Public means, which public manners breeds”
is very harsh versifying,—to say nothing of the bad grammar, which was a license of the time. And the concluding rhyme “assure ye” and “cure me,” is no rhyme. The nature
“subdued
To what it works in, like the dyer’s hand”
is true Shakespearian writing.
I have noticed the faulty passages, because cultivators of the Sonnet must not be misled, even by Shakespeare. He can afford to err, where it would be presumption to follow him.
“Eysell” is vinegar. Etymologists—in whose way so small a thing as a consonant is never allowed to stand—derive the word from the German Essig,—vinegar.