రోజు: ఏప్రిల్ 3, 2016
-
నటజీవితానికి వేదనతో మిత్రుడికి లేక… షేక్స్పియర్, ఇంగ్లీషు కవి
ఇది షేక్స్పియర్ 400 వ వర్ధంతి సంవత్సరం . నా కృషికి తగిన ఫలాన్నందించలేని దోషి అదృష్టాన్ని నా కోసం తట్టిలేపుతున్నావా మిత్రమా! నా జీవితానికి పదిమందినీ అర్థించడం తప్ప ఏదీ దొరకలేదు; నా ప్రవర్తన కూడా అందుకే అలా. అందువల్లనే, నా పేరుకీ ఒక ముద్ర పడిపోయింది, అప్పటి నుండే నా నడవడికూడా మెతకబడింది, రంగుల్లో నానీ నానీ కలంకారుడి చెయ్యి రంగుదేరినట్టు. నన్ను కనికరించు! నాకీ జీవితం మీద విసుగేస్తోంది; ఈ మహత్తరమైన రోగానికి…