నెల: మార్చి 2016
-
ఇహ మన సంబరాలు ముగిసినట్టే … షేక్స్పియర్, ఇంగ్లీషు కవి
ఇది షేక్స్పియర్ 400 వర్థంతి సంవత్సరం సాహిత్యం మానవజీవితపు అపురూపమైన సంపదను దాచుకునే అందాల భరిణె అనుకుంటే, దానిలో … రాగద్వేషాలూ, భావోద్వేగాలూ, చేతనాచేతనావస్థలూ….ఒకటేమిటి జీవితపు ఏ పార్శ్వాన్నీ విడిచిపెట్టకుండా, ఏ పాత్రతోనూ మమేకమవకుండా, అన్ని పాత్రలకీ సమన్యాయంచేస్తూ సృష్టించిన వస్తుసముదాయపు శిల్పి … షేక్స్పియర్. ఏ భాషకు ఆ భాషలోనే సాటిలేని మహాకవులూ, సాహిత్యకారులూ ఉన్నా, దేశకాల పరిమితులకి అతీతంగా అన్నిభాషలవారిచే తనకావ్యసృష్టికి మన్ననలను అందుకోగలిగిన కవి షేక్స్పియర్. కవిత్వం ఆ రోజుల్లో (మన…
-
ఇందుకేనా?… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
ఇందుకేనా నేను ఇన్ని ప్రార్థనలు చేసింది, వెక్కి వెక్కి ఏడ్చి, మెట్లు తన్నుకుంటూ వచ్చింది ఇప్పుడు, ఇంట్లో మరో వస్తువులా, రాత్రి పదిన్నర అయ్యేసరికి మంచమెక్కడానికేనా? . ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే February 22, 1892 – October 19, 1950 అమెరికను కవయిత్రి Grown-up . Was it for this I uttered prayers, And sobbed and cursed and kicked the stairs, That now, domestic as a…
-
సూర్యోదయం… చార్లెస్ టెన్నిసన్ టర్నర్, ఇంగ్లీషు కవి
ఉదయాన్నే పక్కమీద ప్రార్థన చేసుకుంటూ ఆలోచిస్తూ ఒక్కసారి గోడమీద నా నీడలు చిందులు వెయ్యడం గమనించాను వెనుక అల్లాడుతున్న చెట్ల ఆకులూ, ఎగిరే పక్షులతో సహా… ఒక సూర్యకిరణపు వెలుగు నీడతో గొప్పగా కలగలిసిపోయింది; “దేవునికి వెయ్యి దండాలు” అని మనసులో అనుకున్నాను. “తూరుపు తెరతీసిన ఈ వెలుగులతో గడపడం కాకుండా నా ఉదయాలకి అంతకంటే మెరుగైన అవకాశం ఏముంటుంది? ఆ జగదీశ్వరుని చేతిలో ఎన్ని మాయలున్నాయో గదా మనం చూసి, అనుభవించడానికి! అయినా మనకి తీరిక…
-
సంశయమూ – విశ్వాసమూ… ఆల్ఫ్రెడ్ టెన్నీసన్, ఇంగ్లీషు కవి
ఏ తిరస్కారపు చాయలేకుండా, సహృదయంతో చీకటిలో మునిగిపోతున్న ఆ కీటకాల్ని నీ నీలికళ్ళతో జాలిగా చూస్తూ నాతో అంటావు: అనుమానం దెయ్యంలా పడితే వదలదని. నాకు తెలీదు: అయితే ఒకటి మా తెలుసు ఎంతో మంది నిపుణులైన వైణికుల్ని చూశాను, మొదటిసారి మీటినపుడు ఎప్పుడూ అపశృతే పలికేది, తర్వాతే దానిలో ఎనలేవి నైపుణ్యం సంపాదించేరు. సందేహాలు కలవరపెట్టినా, చేతల్లో నిజాయితీ ఉంది; అందుకే చివరికి అంతరాంతర సంగీతాన్ని బయటపెట్టగలిగేరు. నిజాయితీతో కూడిన సందేహంలోనే ఎక్కువ విశ్వాసం ఉంటుంది,…