రేపు చేద్దామనుకుంటున్న పని! వయసుతోపాటు సంపాదించుకున్న అపురూపమైన జ్ఞానం రేపటికి మిగులుతుందా? యవ్వనానికి నెచ్చెలి… వాయిదా తత్త్వం… పిరికితనం, తెలివితక్కువదనం, ఓటమి విధిలిఖితమై రేపటికోసం ఎదురుచూస్తూ జీవితాన్ని వృధా చేస్తుంది. ఆశగా, కోరికలునిండినకళ్ళతో రేపటికై గుడ్లప్పగించి చూస్తుంది మధ్యలో మృత్యువు చొరబడి ఆ అవకాశాన్ని తన్నుకుపోయేదాకా! చిత్రం ప్రతి రోజూ అనవరతంగా ఈ మోసం జరుగుతూనే ఉన్నా అది గ్రహించలేని దౌర్భాగ్యులతో నిండి ఉంది ఈ ప్రపంచం చలికాలంలో మంచులో కవాతు చేసుకుంటూ సైనికుడు, విజయం రేపు అందంగా అలంకరించుకుని ఎదురువస్తుందనే భ్రమిస్తాడు; ఆశగా ఎదురుచూసే ప్రేమికుడి చేతుల్లోకి రేపు కానరాని పెళ్ళికూతుర్ని తీసుకువస్తుంది. కానీ, నువ్వు మరో మోసాన్ని భరించగల వయసు దాటిపోయేవు, తెలుసుకో! గడుసున్న ఈ ఒక్క క్షణం ఒక్కటే నీది! . సామ్యూల్ జాన్సన్