పికెట్ కావలి … ఎథెలిండా ఏలియట్ బీయర్స్, అమెరికను కవయిత్రి

ఈ కవిత మొదటిసారిగా “పోటోమాక్ పొడవునా అంతా నిశ్శబ్దం” అన్న శీర్షికతో ప్రసిద్ధమైన ఈ కవిత మొదటిసారి “హార్పర్ వీక్లీ” 1861 నవంబరు 30 సంచికలో ప్రచురించబడింది. 

***

పోటోమాక్ నది పొడవునా అంతా నిశ్శబ్దం,” అంటారందరూ

కాకపోతే, ఏప్పుడో ఒక సారి దారితప్పి జరిగే సంఘటనలో

ఏ పొదలోదాక్కున్న శత్రువు జరిపే కాల్పులకి రాత్రి గస్తీ తిరుగుతూ

పహారా కాసే కావలి సైనికుడెవరైనా మరణిస్తే మరణించవచ్చు.

అదేమంత చెప్పుకోదగ్గ విషయం కాదు, ఎప్పుడో ఓసారి, ఒకరో ఇద్దరో

అది యుద్ధ వార్తకింద జమకట్టడానికి పనికి రాదు.

ఆఫీసరేమీ చనిపో లేదు, సైనికుల్లో ఒకడు, అంతే,

ఒంటరిగా, మూలుగుతూ, మరణయాతన అనుభవిస్తుంటాడు.

ఈ రాత్రి పోటోమాక్ పొడవినా ప్రశాంతంగా ఉంది,

సైనికులందరూ హాయిగా నిద్రపోతున్నారు కలలు కంటూ;

వాళ్ళ గుడారాలు శరత్కాలపు వెన్నెల వెలుగుల్లోనో, లేకుంటే,

నిద్రపోకుండా వేసుకునే నెగళ్ళ కాంతిలోనో, తళుక్కు మంటుంటాయి.

అపరాత్రి మంద్రంగా వీచే గాలి తరగలా, కంపిస్తూ ఒక నిట్టూర్పు

అడవిలోని చెట్ల ఆకులమీదనుండి ఆగి ఆగి తేలుతూ వస్తోంది;

ఆకాశంలో నక్షత్రాలు, తమ మిణుకు మిణుకుమనే కళ్ళతో

క్రింద నిద్రిస్తున్న సైనికులకి పహరా కాస్తూనే ఉన్నాయి.

ఎక్కడో ఒక పహరా కాస్తున్న సైనికుడి అడుగులు వినిపిస్తున్నాయి

అతను గుట్టమీదనుండి నదివైపుకి వేళుతున్నాడు.

అతను ఎక్కడో దూరంగా కొండమీది అడవిలో

చిన్న మంచం మీద పడుక్కున్న ఇద్దర్ని తలుచుకుంటున్నాడు.

తుపాకిమీద అతని పిడికిలి బిగువు సడలింది,

ముఖం బాధతో వివర్ణమైంది;

సుకుమారమైన ఆలోచనలతో మనసు ఆర్ద్రమైంది.

అతను మనసులోనే తన ఇద్దరు పిల్లలగురించీ ప్రార్థించుకున్నాడు

వాళ్ళ తల్లిని… ఆ భగవంతుడు రక్షించుగాక!

ఆ రోజు కూడా చంద్రుడు ఎప్పటిలాగే ప్రకాశంగా ఉన్నాడు.

అంతవరకు తను ప్రకటించని ప్రేమ తన పెదాలను తాకింది…

ఎప్పటికీ విడిపోమని చేసుకున్న ప్రమాణాలు గొతులోనే సన్నగా కొట్టాడేయి;

ఉబికి వస్తున్న కన్నీళ్ళను మోచేతిని కళ్ళమీదకు

ఒక్క సారి విసురుగా లాక్కుని తుడుచుకున్నాడు.

యధాప్రకారం తుపాకిని బిగుతుగా సరీరానికి అదిమి పట్టుకున్నాడు

ఎగిసిపడుతున్న తన హృదయాన్ని అదుపుచేసుకుందికేమో అన్నట్టు.

అతను నదిని దాటేడు. పేలిపోయిన దేవదారునీ దాటేడు.

అడుగులు అప్పుడే అలసటతో తడబడుతున్నాయి.

అయినా అతను ముందుకే పోతున్నాడు, విశాలమైన వెలుగు బాటలో

బావురుమంటున్న అడవిలోని చెట్ల నీడవైపు.

అరే, ఏమిటి ఆ ఆకుల గలగల? చల్లగాలి అలికిడి కాదు గద!

ఏమిటది అంతలా మెరుస్తోంది? వెన్నెల కాదు గద!

అదేదో తుపాకిలా ఉందే. “హా! మేరీ! శలవు!”

ఒక్క సారి రక్తం తో పాటు ప్రాణం జివ్వున ఎగిసి మడుగైపోయింది.

పోటోమాక్ పొడవునా ఈ రాత్రి అంతా నిశ్శబ్దంగా ఉంది.

ఒక్క నదీప్రవాహపు గలగల తప్ప మరొక శబ్దం ఉంటే ఒట్టు.

మృతుడి ముఖం పై మంచు సన్నగా జాలువారుతుంటే

పాపం పికెట్, శాశ్వతంగా రక్షణ కోల్పోయింది.

.

ఎథెలిండా ఏలియట్ బీయర్స్

జనవరి 13, 1827 – అక్టోబరు 11, 1879

అమెరికను కవయిత్రి

Note on the Poem:  Though this poem is famous as “All Quiet Along The Potomac Tonight”, it was first published under the present title in Harper’s Weekly issue dated Nov 30th 1861. For more information pl. visit the link:
https://en.wikipedia.org/wiki/All_Quiet_Along_the_Potomac_Tonight

.

“The Picket-Guard”

 

 

“All quiet along the Potomac,” they say,

“Except now and then a stray picket

Is shot, as he walks on his beat, to and fro,

By a rifleman hid in the thicket.

‘T is nothing—a private or two, now and then,

Will not count in the news of the battle;

Not an officer lost—only one of the men,

Moaning out, all alone, the death rattle.”

All quiet along the Potomac to-night,

Where the soldiers lie peacefully dreaming;

Their tents in the rays of the clear autumn moon,

Or the light of the watch-fires, are gleaming.

A tremulous sigh, as the gentle night wind

Through the forest leaves softly is creeping;

While stars up above, with their glittering eyes,

Keep guard—for the army is sleeping.

 

 

There’s only the sound of the lone sentry’s tread

As he tramps from the rock to the fountain,

And he thinks of the two in the low trundle-bed,

Far away in the cot on the mountain.

His musket falls slack; his face, dark and grim,

Grows gentle with memories tender,

As he mutters a prayer for the children asleep,

For their mother,—may Heaven defend her!

The moon seems to shine just as brightly as then,

That night when the love yet unspoken

Leaped up to his lips—when low, murmured vows

Were pledged to be ever unbroken;

Then drawing his sleeve roughly over his eyes,

He dashes off tears that are welling,

And gathers his gun closer up to its place,

As if to keep down the heart-swelling.

He passes the fountain, the blasted pine tree,—

The footstep is lagging and weary;

Yet onward he goes, through the broad belt of light,

Toward the shade of the forest so dreary.

 

 

Hark! was it the night wind that rustled the leaves?

Was it moonlight so wondrously flashing?

It looked like a rifle—”Ha! Mary, good-by!”

And the life-blood is ebbing and plashing.

All quiet along the Potomac to-night,—

No sound save the rush of the river;

While soft falls the dew on the face of the dead,—

The picket’s off duty forever.

.

Ethelinda Elliott Beers (Ethel Lynn)

(January 13, 1827 – October 11, 1879)

 American Poetess

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: