వైద్యులు… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

ప్రతి రాత్రీ నేను మేలుకునే ఉంటాను

ప్రతి పగలూ పక్కమీద పడుకునే ఉంటాను

వైద్యులూ, వేదనా, మృత్యువూ

నా తల దగ్గర చర్చించుకోవడం వింటూ.

వాళ్ళు లోగొంతులో చికిత్సావిధానం గురించి

శాస్త్ర పరిభాషలో మాటాడుకుంటుంటారు,

ఒకరు త్వరగా కోలుకోవాలని వాదిస్తే

రెండవవారు, నిర్వాణము నెమ్మదిగా రావాలని.

నా లాంటి ఒక అతి సామాన్య జీవికి

అది నిజంగా చాలా గర్వకారణం

అటువంటి గొప్ప పేరుపడ్డ వ్యక్తులు

నా పక్కన నిలబడి చర్చించుకోవడం

.

సారా టీజ్డేల్

August 8, 1884 – January 29, 1933

అమెరికను కవయిత్రి

sara-teasdale

.

Doctors

.

Every night I lie awake

And every day I lie abed

And hear the doctors, Pain and Death,

Confering at my head.

They speak in scientific tones,

Professional and low—

One argues for a speedy cure,

The other, sure and slow.

To one so humble as myself

It should be matter for some pride

To have such noted fellows here,

Conferring at my side.

.

Sara Teasdale

August 8, 1884 – January 29, 1933

American Poet

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: