ఇహ మన సంబరాలు ముగిసినట్టే … షేక్స్పియర్, ఇంగ్లీషు కవి
ఇది షేక్స్పియర్ 400 వర్థంతి సంవత్సరం
సాహిత్యం మానవజీవితపు అపురూపమైన సంపదను దాచుకునే అందాల భరిణె అనుకుంటే, దానిలో … రాగద్వేషాలూ, భావోద్వేగాలూ, చేతనాచేతనావస్థలూ….ఒకటేమిటి జీవితపు ఏ పార్శ్వాన్నీ విడిచిపెట్టకుండా, ఏ పాత్రతోనూ మమేకమవకుండా, అన్ని పాత్రలకీ సమన్యాయంచేస్తూ సృష్టించిన వస్తుసముదాయపు శిల్పి … షేక్స్పియర్. ఏ భాషకు ఆ భాషలోనే సాటిలేని మహాకవులూ, సాహిత్యకారులూ ఉన్నా, దేశకాల పరిమితులకి అతీతంగా అన్నిభాషలవారిచే తనకావ్యసృష్టికి మన్ననలను అందుకోగలిగిన కవి షేక్స్పియర్. కవిత్వం ఆ రోజుల్లో (మన కాళిదాసు శకంలో లాగే) నాటకంద్వారా మాత్రమే ప్రకటించబడేది. అందుకే సానెట్స్ వంటివి తప్ప, ప్రత్యేకంగా “ఖండకావ్యాల” వంటి కవిత్వ సృష్టి అతనిది కనిపించదు.
కవి ఎప్పుడూ నశ్వరమైన ఈ జీవితం గురించిన ఎరుకలేకుండా ఉండకూడదు. అది అతన్ని నేలమీద ఉంచుతుంది. అత్యాశకీ, దురహంకారానికి తావులేకుండా చేస్తుంది. షేక్స్పియర్ నాటకాలలో ఏ చిన్న అవకాశం వచ్చినా ఈ సత్యాన్ని చెప్పడానికి అతను వెనుకాడలేదు. ఎన్నిసార్లు చెప్పినా, ఎప్పుడూ కొత్తదనంతో, కొత్త ప్రతీకలతో, పదబంధాలతోనే చెప్పాడు.
***
ఇహ మన సంబరాలు ముగిసినట్టే… మన ఈ పాత్రధారులు
మీకు ఇంతకు ముందే చెప్పినట్టు, అవన్నీ కేవలం ప్రేతాత్మలు,