సూర్యోదయం… చార్లెస్ టెన్నిసన్ టర్నర్, ఇంగ్లీషు కవి ఉదయాన్నే పక్కమీద ప్రార్థన చేసుకుంటూ ఆలోచిస్తూ ఒక్కసారి గోడమీద నా నీడలు చిందులు వెయ్యడం గమనించాను వెనుక అల్లాడుతున్న చెట్ల ఆకులూ, ఎగిరే పక్షులతో సహా… ఒక సూర్యకిరణపు వెలుగు నీడతో గొప్పగా కలగలిసిపోయింది; “దేవునికి వెయ్యి దండాలు” అని మనసులో అనుకున్నాను. “తూరుపు తెరతీసిన ఈ వెలుగులతో గడపడం కాకుండా నా ఉదయాలకి అంతకంటే మెరుగైన అవకాశం ఏముంటుంది? ఆ జగదీశ్వరుని చేతిలో ఎన్ని మాయలున్నాయో గదా మనం చూసి, అనుభవించడానికి! అయినా మనకి తీరిక ఉండదు అందుకే చూడలేదని అంటాం, కానీ సముద్రం మీది అలల్లా ఆ మహాత్యం పగలూ, రాత్రీ జాల్వారుతూనే ఉంటుంది. అతని తేజస్సు చిక్కని రాత్రి చీకటినీ చీల్చుకుని వస్తుంది ఇలాంటి తొలిసంధ్యవేళలోనూ. అదిగో చూడండి! నన్నతను తన బంగారు కిరణాలతో రహస్య మందిరాలకూ అనుసరిస్తున్నాడు. . చార్లెస్ టెన్నిసన్ టర్నర్. (4 July 1808 – 25 April 1879) ఇంగ్లీషు కవి . Sunrise As on my bed at dawn I mused and prayed, I saw my lattice prankt upon the wall, The flaunting leaves and flitting birds withal— A sunny phantom interlaced with shade; “Thanks be to Heaven,” in happy mood I said, “What sweeter aid my matins could befall Than this fair glory from the east hath made? What holy sleights hath God, the Lord of all, To bid us feel and see! We are not free To say we see not, for the glory comes Nightly and daily, like the flowing sea; His lustre pierces through the midnight glooms, And at prime hours, behold! he follows me With golden shadows to my secret rooms.” . Charles Tennyson Turner (4 July 1808 – 25 April 1879) English Poet The World’s Best Poetry. Eds: Bliss Carman, et al. Volume IV. The Higher Life. 1904. 1. The Divine Element—(God, Christ, the Holy Spirit) http://www.bartleby.com/360/4/12.html Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే మార్చి 2, 2016
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులు19th CenturyCharles Tennyson TurnerEnglish Poet సంశయమూ – విశ్వాసమూ… ఆల్ఫ్రెడ్ టెన్నీసన్, ఇంగ్లీషు కవిఇందుకేనా?… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.