సంశయమూ – విశ్వాసమూ… ఆల్ఫ్రెడ్ టెన్నీసన్, ఇంగ్లీషు కవి
ఏ తిరస్కారపు చాయలేకుండా, సహృదయంతో చీకటిలో మునిగిపోతున్న ఆ కీటకాల్ని నీ నీలికళ్ళతో జాలిగా చూస్తూ నాతో అంటావు: అనుమానం దెయ్యంలా పడితే వదలదని.
నాకు తెలీదు: అయితే ఒకటి మా తెలుసు ఎంతో మంది నిపుణులైన వైణికుల్ని చూశాను, మొదటిసారి మీటినపుడు ఎప్పుడూ అపశృతే పలికేది, తర్వాతే దానిలో ఎనలేవి నైపుణ్యం సంపాదించేరు.
సందేహాలు కలవరపెట్టినా, చేతల్లో నిజాయితీ ఉంది; అందుకే చివరికి అంతరాంతర సంగీతాన్ని బయటపెట్టగలిగేరు. నిజాయితీతో కూడిన సందేహంలోనే ఎక్కువ విశ్వాసం ఉంటుంది, నా మాట నమ్ము, పైకి అందరూ తాము ప్రకటించే విశ్వాసాల్లో కంటే.
తన అపనమ్మకాలతో పోరాడి ధైర్యం సంపాదించిన వాడు తన నిర్ణయాలను ఎప్పుడూ గుడ్డిగా తీసుకోడు, అతడు మనసులోనే ఆ దయ్యాలను చూశాడు, వాటిని గెలిచి, చివరికి ఇలా బయటపడగలిగేడు
తన శక్తిపై బలమైన నమ్మకాన్ని కూడగట్టుకుని; ఇపుడు చీకటిలో కూడా అతనికి అతని ధైర్యమే తోడు; చీకటి వెలుగులు దేని వల్ల కలుగుతాయో అది కేవలం వెలుగులోనే దాగి లేదనీ,
పురాతన సినాయ్ పర్వత శిఖరంలా చీకటిలోనూ, మేఘాల్లోనూ అవరించి ఉందనీ తెలుసు; అందుకే చుట్టుపక్కల రణభేరీలు ఎంత గట్టిగా వినవస్తున్నా ఇజ్రాయేల్ తన విశ్వాసాన్ని సడలనీ లేదు. . ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నీసన్