మూడు పద్యాలు… విలియం హేమిల్టన్ హేయిన్, విలియం హేమిల్టన్ హేయిన్ అమెరికను కవి
వెన్నెట్లో పక్షి పాట
ప్రతి మధురమైన సుస్వరమూ
శ్రద్ధగా వింటున్న ఆకుల్ని పరవశింపజేస్తోంది
అంతర్థానమైన కీట్స్ ఆత్మ మళ్ళీ
ఆ పిట్ట రూపంలో పునర్జన్మ దాల్చినట్టు.
చీకటి తెరలు
ఒక్కోసారి, ప్రకృతి నిద్రలో మునిగినపుడు
దాని వనాలూ, సెలయేళ్ళచుట్టూ ప్రశాంతంగా
చీకటి పొరలు పొరలుగా అల్లుకుంటుంది…
ఎందుకంటే ప్రకృతి కలలు అవే గనుక.
శరద్వీచిక
సగం విషాదంలో మునిగి తేలికగా వీస్తున్న ఈ పిల్లగాలి
ఇది చెట్లమధ్య దిక్కుతోచక తిరుగాడే “హేమ్లెట్” లాంటిది
ప్రతి ఆకు కదలికలోనూ దానికో గొంతు దొరుకుతుంది
అడవిలో తనుపడే ప్రతి చిన్న బాధనూ చెప్పుకోడానికి.
.
విలియం హేమిల్టన్ హేయిన్
(1856–1929)
అమెరికను కవి
Quatrains
MOONLIGHT SONG OF THE MOCKING-BIRD
Each golden note of music greets
The listening leaves, divinely stirred,
As if the vanished soul of Keats
Had found its new birth in a bird.
NIGHT MISTS
Sometimes, when Nature falls asleep,
Around her woods and streams
The mists of night serenely creep—
For they are Nature’s dreams.
AN AUTUMN BREEZE
This gentle and half melancholy breeze
Is but a wandering Hamlet of the trees,
Who finds a tongue in every lingering leaf
To voice some subtlety of sylvan grief.
.
William Hamilton Hayne
(1856–1929)
American Poet
The World’s Best Poetry.
Eds. Bliss Carman, et al.
Volume VI. Fancy. 1904.
Poems of Fancy: III. Mythical: Mystical: Legendary
రేపటి కి… సామ్యూల్ జాన్సన్, ఇంగ్లీషు రచయిత
(ఐరీన్(Irene) నాటకం నుండి)
.
రేపు చేద్దామనుకుంటున్న పని! వయసుతోపాటు
సంపాదించుకున్న అపురూపమైన జ్ఞానం రేపటికి మిగులుతుందా?
యవ్వనానికి నెచ్చెలి… వాయిదా తత్త్వం…
పిరికితనం, తెలివితక్కువదనం, ఓటమి విధిలిఖితమై
రేపటికోసం ఎదురుచూస్తూ జీవితాన్ని వృధా చేస్తుంది.
ఆశగా, కోరికలునిండినకళ్ళతో రేపటికై గుడ్లప్పగించి చూస్తుంది
మధ్యలో మృత్యువు చొరబడి ఆ అవకాశాన్ని తన్నుకుపోయేదాకా!
చిత్రం ప్రతి రోజూ అనవరతంగా ఈ మోసం జరుగుతూనే ఉన్నా
అది గ్రహించలేని దౌర్భాగ్యులతో నిండి ఉంది ఈ ప్రపంచం
చలికాలంలో మంచులో కవాతు చేసుకుంటూ సైనికుడు, విజయం
రేపు అందంగా అలంకరించుకుని ఎదురువస్తుందనే భ్రమిస్తాడు;
ఆశగా ఎదురుచూసే ప్రేమికుడి చేతుల్లోకి
రేపు కానరాని పెళ్ళికూతుర్ని తీసుకువస్తుంది.
కానీ, నువ్వు మరో మోసాన్ని భరించగల వయసు దాటిపోయేవు,
తెలుసుకో! గడుసున్న ఈ ఒక్క క్షణం ఒక్కటే నీది!
.
సామ్యూల్ జాన్సన్
(18 September 1709 – 13 December 1784)
ఇంగ్లీషు కవి, రచయిత, నాటక కర్త, నిఘంటు నిర్మాత
.
.
To-morrow
From “Irene”
TO-MORROW’S action! can that hoary wisdom,
Borne down with years, still doat upon to-morrow!
The fatal mistress of the young, the lazy,
The coward and the fool, condemned to lose
An useless life in waiting for to-morrow,
To gaze with longing eyes upon to-morrow,
Till interposing death destroys the prospect.
Strange that this general fraud from day to day
Should fill the world with wretches, undetected!
The soldier, laboring through a winter’s march,
Still sees to-morrow drest in robes of triumph;
Still to the lover’s long-expecting arms
To-morrow brings the visionary bride.
But thou, too old to bear another cheat,
Learn that the present hour alone is man’s.
.
Samuel Johnson
(18 September 1709 – 13 December 1784)
The World’s Best Poetry.
Bliss Carman, et al., eds.
Volume VI. Fancy. 1904.
Poems of Sentiment: I. Time
http://www.bartleby.com/360/6/58.html
వసంత కాలం …హఫీజ్, పెర్షియన్ సూఫీ కవి
వసంతం వచ్చేసింది! గులాబులూ,
మల్లెలూ, కలువలూ మట్టిలోంచి తలెత్తుతున్నాయి–
నువ్వు ఇంకా ఎందుకు మట్టి క్రిందే పడి ఉంటావు?
బరువెక్కిన మేఘాల్లా నా ఈ కళ్ళు
నీ సమాధి చెర మీద వర్షిస్తుంటాయి కన్నీళ్ళు
నువ్వుకూడా మట్టిలోంచి తల పైకెత్తేదాకా!
–
హఫీజ్…
పెర్షియన్ సూఫీ కవి
1325 –1389
The days of Spring are here! The eglantine,
The rose, the tulip from the dust have risen–
And thou, why liest thou beneath the dust?
Like the full clouds of Spring, these eyes of mine
Shall scatter tears upon the grave thy prison,
Till thou too from the earth thine head shalt thrust.
– Hafiz
(Khwāja Shams-ud-Dīn Muḥammad Ḥāfeẓ-e Shīrāzī)
1325 –1389
Persian Poet
– Trans: G. Bell (1897)
Poem Courtesy:
http://www.poetseers.org/the-poetseers/hafiz/hafiz-poems/the-days-of-spring/index.html
ఉత్తరధృవప్రభలు… బెంజమిన్ ఫ్రాంక్లిన్ టేలర్, అమెరికను కవి
ఉత్తరధృవాన్ని ఆక్రమించడానికి సూరీడు
మంటల బావుటాల సేనలతో వేంచేసేడు
అక్కడి గాలి తెరచాపలపై వాటిని వదలగానే
నక్షత్రాల వెలుగుల్లో అవి గడ్డకట్టుకుపోయాయి.
ఇప్పుడక్కడ చల్లబడ్డ పతాకలు రెపరెపలాడుతున్నాయి
శాశ్వతంగా వేడిమికోల్పోయి, ఉత్తరధృవప్రభలుగా.
.
బెంజమిన్ ఫ్రాంక్లిన్ టేలర్
(1819- 1887)
అమెరికను కవి
.
Northern Lights
.
TO claim the Arctic came the sun
With banners of the burning zone.
Unrolled upon their airy spars,
They froze beneath the light of stars;
And there they float, those streamers old,
Those Northern Lights, forever cold!
.
Benjamin Franklin Taylor
(1819 – 1887)
American
పికెట్ కావలి … ఎథెలిండా ఏలియట్ బీయర్స్, అమెరికను కవయిత్రి
ఈ కవిత మొదటిసారిగా “పోటోమాక్ పొడవునా అంతా నిశ్శబ్దం” అన్న శీర్షికతో ప్రసిద్ధమైన ఈ కవిత మొదటిసారి “హార్పర్ వీక్లీ” 1861 నవంబరు 30 సంచికలో ప్రచురించబడింది.
***
పోటోమాక్ నది పొడవునా అంతా నిశ్శబ్దం,” అంటారందరూ
కాకపోతే, ఏప్పుడో ఒక సారి దారితప్పి జరిగే సంఘటనలో
ఏ పొదలోదాక్కున్న శత్రువు జరిపే కాల్పులకి రాత్రి గస్తీ తిరుగుతూ
పహారా కాసే కావలి సైనికుడెవరైనా మరణిస్తే మరణించవచ్చు.
అదేమంత చెప్పుకోదగ్గ విషయం కాదు, ఎప్పుడో ఓసారి, ఒకరో ఇద్దరో
అది యుద్ధ వార్తకింద జమకట్టడానికి పనికి రాదు.
ఆఫీసరేమీ చనిపో లేదు, సైనికుల్లో ఒకడు, అంతే,
ఒంటరిగా, మూలుగుతూ, మరణయాతన అనుభవిస్తుంటాడు.
ఈ రాత్రి పోటోమాక్ పొడవినా ప్రశాంతంగా ఉంది,
సైనికులందరూ హాయిగా నిద్రపోతున్నారు కలలు కంటూ;
వాళ్ళ గుడారాలు శరత్కాలపు వెన్నెల వెలుగుల్లోనో, లేకుంటే,
నిద్రపోకుండా వేసుకునే నెగళ్ళ కాంతిలోనో, తళుక్కు మంటుంటాయి.
అపరాత్రి మంద్రంగా వీచే గాలి తరగలా, కంపిస్తూ ఒక నిట్టూర్పు
అడవిలోని చెట్ల ఆకులమీదనుండి ఆగి ఆగి తేలుతూ వస్తోంది;
ఆకాశంలో నక్షత్రాలు, తమ మిణుకు మిణుకుమనే కళ్ళతో
క్రింద నిద్రిస్తున్న సైనికులకి పహరా కాస్తూనే ఉన్నాయి.
ఎక్కడో ఒక పహరా కాస్తున్న సైనికుడి అడుగులు వినిపిస్తున్నాయి
అతను గుట్టమీదనుండి నదివైపుకి వేళుతున్నాడు.
అతను ఎక్కడో దూరంగా కొండమీది అడవిలో
చిన్న మంచం మీద పడుక్కున్న ఇద్దర్ని తలుచుకుంటున్నాడు.
తుపాకిమీద అతని పిడికిలి బిగువు సడలింది,
ముఖం బాధతో వివర్ణమైంది;
సుకుమారమైన ఆలోచనలతో మనసు ఆర్ద్రమైంది.
అతను మనసులోనే తన ఇద్దరు పిల్లలగురించీ ప్రార్థించుకున్నాడు
వాళ్ళ తల్లిని… ఆ భగవంతుడు రక్షించుగాక!
ఆ రోజు కూడా చంద్రుడు ఎప్పటిలాగే ప్రకాశంగా ఉన్నాడు.
అంతవరకు తను ప్రకటించని ప్రేమ తన పెదాలను తాకింది…
ఎప్పటికీ విడిపోమని చేసుకున్న ప్రమాణాలు గొతులోనే సన్నగా కొట్టాడేయి;
ఉబికి వస్తున్న కన్నీళ్ళను మోచేతిని కళ్ళమీదకు
ఒక్క సారి విసురుగా లాక్కుని తుడుచుకున్నాడు.
యధాప్రకారం తుపాకిని బిగుతుగా సరీరానికి అదిమి పట్టుకున్నాడు
ఎగిసిపడుతున్న తన హృదయాన్ని అదుపుచేసుకుందికేమో అన్నట్టు.
అతను నదిని దాటేడు. పేలిపోయిన దేవదారునీ దాటేడు.
అడుగులు అప్పుడే అలసటతో తడబడుతున్నాయి.
అయినా అతను ముందుకే పోతున్నాడు, విశాలమైన వెలుగు బాటలో
బావురుమంటున్న అడవిలోని చెట్ల నీడవైపు.
అరే, ఏమిటి ఆ ఆకుల గలగల? చల్లగాలి అలికిడి కాదు గద!
ఏమిటది అంతలా మెరుస్తోంది? వెన్నెల కాదు గద!
అదేదో తుపాకిలా ఉందే. “హా! మేరీ! శలవు!”
ఒక్క సారి రక్తం తో పాటు ప్రాణం జివ్వున ఎగిసి మడుగైపోయింది.
పోటోమాక్ పొడవునా ఈ రాత్రి అంతా నిశ్శబ్దంగా ఉంది.
ఒక్క నదీప్రవాహపు గలగల తప్ప మరొక శబ్దం ఉంటే ఒట్టు.
మృతుడి ముఖం పై మంచు సన్నగా జాలువారుతుంటే
పాపం పికెట్, శాశ్వతంగా రక్షణ కోల్పోయింది.
.
ఎథెలిండా ఏలియట్ బీయర్స్
జనవరి 13, 1827 – అక్టోబరు 11, 1879
అమెరికను కవయిత్రి
Note on the Poem: Though this poem is famous as “All Quiet Along The Potomac Tonight”, it was first published under the present title in Harper’s Weekly issue dated Nov 30th 1861. For more information pl. visit the link:
https://en.wikipedia.org/wiki/All_Quiet_Along_the_Potomac_Tonight
.
“The Picket-Guard”
“All quiet along the Potomac,” they say,
“Except now and then a stray picket
Is shot, as he walks on his beat, to and fro,
By a rifleman hid in the thicket.
‘T is nothing—a private or two, now and then,
Will not count in the news of the battle;
Not an officer lost—only one of the men,
Moaning out, all alone, the death rattle.”
All quiet along the Potomac to-night,
Where the soldiers lie peacefully dreaming;
Their tents in the rays of the clear autumn moon,
Or the light of the watch-fires, are gleaming.
A tremulous sigh, as the gentle night wind
Through the forest leaves softly is creeping;
While stars up above, with their glittering eyes,
Keep guard—for the army is sleeping.
There’s only the sound of the lone sentry’s tread
As he tramps from the rock to the fountain,
And he thinks of the two in the low trundle-bed,
Far away in the cot on the mountain.
His musket falls slack; his face, dark and grim,
Grows gentle with memories tender,
As he mutters a prayer for the children asleep,
For their mother,—may Heaven defend her!
The moon seems to shine just as brightly as then,
That night when the love yet unspoken
Leaped up to his lips—when low, murmured vows
Were pledged to be ever unbroken;
Then drawing his sleeve roughly over his eyes,
He dashes off tears that are welling,
And gathers his gun closer up to its place,
As if to keep down the heart-swelling.
He passes the fountain, the blasted pine tree,—
The footstep is lagging and weary;
Yet onward he goes, through the broad belt of light,
Toward the shade of the forest so dreary.
Hark! was it the night wind that rustled the leaves?
Was it moonlight so wondrously flashing?
It looked like a rifle—”Ha! Mary, good-by!”
And the life-blood is ebbing and plashing.
All quiet along the Potomac to-night,—
No sound save the rush of the river;
While soft falls the dew on the face of the dead,—
The picket’s off duty forever.
.
Ethelinda Elliott Beers (Ethel Lynn)
(January 13, 1827 – October 11, 1879)
American Poetess
తెలియరాని తన్మయత్వం… ఫ్రాన్సిస్ క్వార్లెస్… ఇంగ్లీషు కవి
తమ తుంటరి ప్రవాహాలతో రాళ్ళని దొర్లిస్తూ
అన్ని దేశాలూ తిరిగి వేల నిర్జనప్రదేశాలు చూసి
చివరకి మిరిమిట్లుగొలిపే థేమ్స్ నదిలో కలిసి
అంతకంటే పెను కెరటాలలో విలినమయ్యే
గట్లూ రెంటినీ విడదీస్తూ పారే రెండు సెలయేళ్ళలా కలిసేము.
అందుకే నేను నా ప్రియాతి ప్రయతమ సొత్తును; తనూ నాకు అంతే.
చాలా ప్రయత్నం చేసిన తర్వాత మేము కలుసుకున్నా
మేమిద్దరం విడిగా అసంపూర్ణులమైనా, ఇపుడు పరిపూర్ణులమే.
మా ఇద్దరిలో ఎవరు వేరొకరికోసం తపించనక్కరలేదు.
నేను జనుమునైతే, అతను అచ్చంగా అగ్ని కీలే;
మా ఆత్మలు గాఢంగా పెనవేసుకోడానికి మించి విలీనమయాయి;
అందుకే నేను నా ప్రియాతి ప్రయతమ సొత్తును; తనూ నాకు అంతే.
ఈ భూగోళం మీద దాసోహమన్న ప్రతి నేలపై
అధికారం చెలాయించే తళుకులీనే కిరీటధారులు,
వాళ్ల సామ్రాజ్యాలని మారకానికి నాకు ఇవ్వజూపినా
నా అదృష్టాన్ని వాటితో ససేమిరా మార్పుచేసుకోను.
వాళ్ళ సంపదదేముంది, అది నా సొత్తుకు కేవలం నకిలీ;
ప్రపంచం వాళ్లదౌ గాక; నా ప్రియతమ మాత్రం… నాస్వంతం.
.
ఫ్రాన్సిస్ క్వార్లెస్
(8 May 1592 – 8 September 1644)
ఇంగ్లీషు కవి
.
A Mystical Ecstasy
.
E’en like two little bank-dividing brooks,
That wash the pebbles with their wanton streams,
And having ranged and searched a thousand nooks,
Meet both at length in silver-breasted Thames,
Where in a greater current they conjoin:
So I my Best-Belovèd’s am; so He is mine.
E’en so we met; and after long pursuit,
E’en so we joined; we both became entire;
No need for either to renew a suit,
For I was flax and he was flames of fire:
Our firm-united souls did more than twine:
So I my Best-Belovèd’s am; so He is mine.
If all those glittering Monarchs that command
The servile quarters of this earthly ball,
Should tender, in exchange, their shares of land,
I would not change my fortunes for them all:
Their wealth is but a counter to my coin:
The world’s but theirs; but my Belovèd’s mine.
.
Francis Quarles
(8 May 1592 – 8 September 1644)
English Poet
Poem Courtesy:
The World’s Best Poetry.
Eds: Bliss Carman, et al.
Volume IV. The Higher Life. 1904.
III. Faith: Hope: Love: Service
http://www.bartleby.com/360/4/91.html
రోదించండి, రోదించండి, అణిగిపోయే పెనుగాలులారా!… హెన్రీ నీలే, ఇంగ్లీషు
అత్యంత విచారకరమైన మీ గాధ లేవీ
జీవితమంత విషాదంగా ఉండవు లెండి;
మనిషిని పోలిన ఇతివృత్తాన్ని దేన్నీ
మీరెన్నడూ ఎత్తుకుని ఉండరు;
లేదా, అంత దుఃఖ బాహుళ్యమైనదీను.
రాలిపో! రాలిపో! వాడిపోయిన పత్రమా!
శరదృతువు దుఃఖమంతగా కాల్చివెయ్యదులే
అటువంటి అందమైన పూలను చిదిమెయ్యదులే;
దట్టమైన చీకట్లు జీవితాన్ని ముసిరినప్పుడు
అది తుఫానుకన్నా భీకరమైనదీ
ఆ క్రుంగుపాటు మహా విషాదకరమైనదీ.
ఓ నినదించే వీణియా! ష్, ష్! సడిచేయకు!
గాయకులారా! మీ గాత్రాన్ని ఆపండి!
ఓ మధురమైన మురళీ, నువ్వు కూడా!
త్వరలోనే మనిషి తుదిశ్వాస విడువబోతున్నాడు.
అతని ఆశలన్నీ అణగారిపోయాయి
ఆతని సంగీతమంతా మూగబోయింది.
పెనుగాలులు సద్దు మణుగుతున్నప్పుడు
ఆకులు జలజలా రాలుతున్నప్పుడు
పాట ముగింపుకి వచ్చినపుడు
ఒక్క సారి మనం గుర్తు తెచ్చుకుందాం
కష్టాల్లో జీవితాలు సమసిపోయిన వారిని
జీవనపాత్ర విషాదంతో పొంగిపొరలిన వారిని.
.
హెన్రీ నీలే
29 January 1798 – 7 February 1828
ఇంగ్లీషు
.
“Moan, moan, ye dying gales”
Moan, moan, ye dying gales!
The saddest of your tales
Is not so sad as life;
Nor have you e’er began
A theme so wild as man,
Or with such sorrow rife.
Fall, fall, thou withered leaf!
Autumn sears not like grief,
Nor kills such lovely flowers;
More terrible the storm,
More mournful the deform,
When dark misfortune lowers.
Hush! hush! thou trembling lyre,
Silence, ye vocal choir,
And thou, mellifluous lute,
For man soon breathes his last,
And all his hope is past,
And all his music mute.
Then, when the gale is sighing,
And when the leaves are dying,
And when the song is o’er,
O, let us think of those
Whose lives are lost in woes,
Whose cup of grief runs o’er.
.
Henry Neele
29 January 1798 – 7 February 1828
English Poet and Literary scholar.
Poem Courtesy:
The World’s Best Poetry.
Eds: Bliss Carman, et al.
Volume III. Sorrow and Consolation. 1904.
III. Adversity
http://www.bartleby.com/360/3/90.html
సానెట్ 12… షేక్స్పియర్, ఇంగ్లీషు కవి
ఇది షేక్స్ పియర్ 400 వ వర్థంతి సంవత్సరం
నేను గడియారాన్ని చూస్తూ కాలం లెక్కపెట్టుకుంటూ
దివ్యమైన రోజు ఘోరమైన రాత్రిలోకి మునిగిపోడం గమనించినపుడు;
గతించిన గులాబి వన్నె ప్రాయపు సౌందర్యరుచులు గుర్తుచేసుకుని
తెల్లని శరీరం నిండా తేరుతున్న నల్లని ముడుతలు చూసినపుడు;
మొన్నటి వరకూ ఆకాశమంత పందిళ్ళు వేసి ఎండనుండి పశులగాచిన
మహోన్నతమైన వృక్షాలిపుడు మోడులై నిలబడడం చూసినపుడు;
వసంతపు పచ్చదనమంతా కట్టలు కట్టలుగా గట్టి
బిరుసెక్కిన గడ్దాంతోపాటు పాడెమీద మోసుకుపోతున్నపుడు;
నీ అందం గురించి నిన్నొక ప్రశ్న అడగాలని ఉంది,
నువ్వు కూడా కాలం సృష్టించే ఒక వ్యర్థ పదార్థం కావలసిందే కదా?
అందాలూ, తియ్యందనాలూ తమంత తాము వీడిపోతాయి
అవి వాటి ప్రత్యర్థులు ఎదిగే అనులోమంలో ఇవి నశిస్తాయి.
కాలంకొడవలి కోతనుండి రక్షించగలిగేది ఏదీ లేదు
ఒక్క సంతానానికి తప్ప, మరణించినా నువ్వు కొనసాగడానికి.
.
షేక్స్ పియర్
(26th April 1564 – 23rd April 1616)
ఇంగ్లీషు కవి
.
Sonnet XII.
.
When I do count the clock that tells the time,
And see the brave day sunk in hideous night;
When I behold the violet past prime,
And sable curls all silvered o’er with white;
When lofty trees I see barren of leaves,
Which erst from heat did canopy the herd,
And summer’s green all girded up in sheaves,
Borne on the bier with white and bristly beard;
Then of thy beauty do I question make,
That thou among the wastes of time must go,
Since sweets and beauties do themselves forsake,
And die as fast as they see others grow;
And nothing ’gainst Time’s scythe can make defence,
Save breed, to brave him when he takes thee hence.
.
William Shakespeare
(1564–1616)
Poem Courtesy:
The World’s Best Poetry.
Eds: Bliss Carman, et al.
Volume VI. Fancy. 1904.
Poems of Sentiment: I. Time
The Approach of Age
http://www.bartleby.com/360/6/63.html
స్త్రీల ఔన్నత్యము… సీ ఫ్రై ససూన్, ఇంగ్లీషు కవి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీలందరికీ శుభాకాంక్షలతో
.
మేము గొప్పపనులు చేస్తే ప్రేమిస్తారు, శలవులకి ఇంటికి వచ్చినా,
లేక చెప్పలేని చోట గాయాలపాలై తిరిగొచ్చినా.
మీరు పతకాల్ని ఆరాధిస్తారు; మీకు గొప్ప నమ్మకం
యుద్ధంలోని కళంకాన్ని శౌర్యం కప్పిపుచ్చుతుందని.
మమ్మల్ని ఉక్కు కవచాల్లా తయారు చేస్తారు. మహాసంతోషంగా వింటారు,
మట్టికొట్టుకుపోతూ ప్రమాదాల్నెదిరించిన మా కథలకి పులకిస్తారు.
దూరంగా ఎక్కడో యుద్ధం చేస్తున్నపుడు మా లోపలి ఉద్రేకం మీరే
మేము మరణిస్తే, జ్ఞాపకాలను పచ్చగా ఉంచుకుంటూమరీ శోకిస్తారు.
నరకసదృశమైన ఉత్పాతం ఎదురైనపుడు, రక్తమోడుతూ
బ్రిటిషు సేనలు కూడా వెన్నిచ్చి వెనక్కి పరిగెడతాయనీ,ఆ పరుగులో
నేలమీది భీతావహమైన శవాల్ని తొక్కుకుంటూ పోతాయంటే మీరు నమ్మలేరు.
చలిమంట ప్రక్కన కలలుగంటున్న ఓ జర్మను మాతా!
నీ కొడుకుకి పంపిద్దామని మేజోళ్ళు అల్లుతున్నావు గానీ,
అతని ముఖం బురదలో లోతుగా చొచ్చుకుపోయింది తల్లీ!
.
సీ ఫ్రై ససూన్.
8 September 1886 – 1 September 1967
ఇంగ్లీషు కవి
యుద్ధోన్మాదం ఎంత ప్రమాదకరమో, ఎన్ని కలలు, కన్నీళ్ళు నేలపాలవుతాయో, కవులు కేవలం ఊహిస్తే, స్వయంగా యుద్ధరంగంలో పనిచేసిన సైనికుడిగా, కవితాహృదయంతో స్పందించి అనేక కవితలు వ్రాసేడు సీ ఫ్రై ససూన్.
ఒక చిన్న ఉపమానంతో ఎంత అందమైన బాధామయ చిత్రాన్ని ఆవిష్కరించాడో చూడండి. యుద్ధం ఎవరికి అన్యాయం చేసినా చెయ్యకపోయినా, స్త్రీలకు యుద్ధం ఎప్పుడూ అన్యాయమే చేస్తుంది… ఎటునుండి చూసినా.
.

Image Courtesy: http://www.spartacus.schoolnet.co.uk/Jsassoon.htm