నెల: ఫిబ్రవరి 2016
-
గంధర్వ గానం…థామస్ రాండోల్ఫ్, ఇంగ్లీషు కవి
కొంటె కోణంగులమై, ఎప్పుడూ ఉల్లాసంగా ఉండే అతికాయులం కాని గంధర్వులమైన మమ్మల్ని వెన్నెల ఎప్పుడూ తోటల్లో కట్టిపడేస్తుంది తొంగిచూసి, తడవమడానికీ పురికొల్పుతూ. దొంగతనం చేసిన మిఠాయి తియ్యగా ఉంటుంది దొంగతనంగా పెట్టుకున్న ముద్దు తనివి తీరుస్తుంది దేవాలయాల్లో దొంగచూపులు బాగుంటాయి ఆపిలుపళ్ళ దొంగతనంతోనే కదా కథ మొదలైంది నిద్రలోకి ప్రపంచం జోగుతున్నప్పుడు తోటలు కొల్లగొట్టడానికి అదే మంచి అదను దొంగతనం చెయ్యడం తెచ్చే ఆనందం వల్లగాని, పళ్ళు తొక్కతీసుకు తినడంలో అంత మజా ఏముంది? . థామస్…
-
పల్లీయుల నమ్మకం… నార్మన్ గాలె, ఇంగ్లీషు కవి
పచ్చిక పచ్చగా ఉండే ఇక్కడ, ఈ పల్లె గర్భంలో జీవితం ఎప్పటిలాగే అంత హాయిగానూ ఉంటుంది. దైవంపై నమ్మకం పచ్చిగానే ఉంది ప్రాభాత ఘంటారావాలు పాలుపోసుకుంటున్న కంకులపై అతని తలపుతో తేలియాడుతున్నాయి. భగవంతుడు వర్షమై వస్తాడు పంటలు పుష్కలంగా పండుతాయి. ఇదే పల్లియుల నమ్మకం అన్ని విశ్వాసాలనూ మించినది. . నార్మన్ గాలె (4 March 1862 – 7 October 1942 ) ఇంగ్లీషు కవి . The Country Faith Here in…
-
ప్రార్థన అంటే… జేమ్స్ మన్ గమ్ రీ, ఇంగ్లీషు కవి
పైకి పలికినా, లోపలే అనుకున్నా ప్రార్థన అంటే ఒక ఆత్మ నిర్వ్యాజమైన కోరిక, గుండె లోతుల్లో దాగి కొట్టుమిట్టాడే తేజస్సు నలుదిక్కులా ప్రసరించు సరళి ప్రార్థన ఒక నిట్టూర్పు వెనక నున్న భారం సన్నగా జాలువారే కన్నీటి బిందువు, దైవం తప్ప మరెవ్వరూ ప్రక్కన లేనిచోట కన్నులు మెల్లగా పైకి ఎత్తి చూసే తీరు. ఒక్క శిశువుల పెదాలు మాత్రమే చేయగల అతి సరళమైన సంభాషణ ప్రార్థన; మహోత్కృష్టమైన సంకీర్తనలు చేరగల అత్యున్నత పీఠం ప్రార్థన; తన…
-
నామకరణం… మేరీ లాంబ్, ఇంగ్లీషు రచయిత్రి
నాకో చెల్లెలు పుట్టింది; ఆమెను మొదటముద్దాడినవారి పక్కన నేనున్నాను. నర్సు పొత్తిళ్ళలోపెట్టి తెచ్చి నాన్నకిచ్చినపుడు, ఆ చిన్నిపాపని చూసి నాన్నకళ్ళలో ఎంతవెలుగు కనిపించిందో! దానికి త్వరలోనే పేరుపెట్టాలి. నాన్న నాకు అవకాశం ఇచ్చారు మా చెల్లికి నన్నే పేరుపెట్టమని. ఏ పేరు పెడితే తనకు నచ్చుతుంది చెప్మా! చార్లెట్, జూలియా, లేక లూయిజా? ఏన్, లెదా మేరీ? అవి అందరూ పెట్టుకునేవే. జోన్ అంటే, ఆడవాళ్ళకి మరీ సాంప్రదాయకంగా ఉంటుంది, పైగా జేన్ అంతకంటే బాగుంటుంది. కానీ…
-
మౌనప్రేమ… సర్ ఫిలిప్ సిడ్నీ, ఇంగ్లీషు కవి
నేను ఎవరుపడితే వాళ్ళదగ్గర ప్రేమ ప్రకటించను గనుక, లేదా కొన్ని ప్రత్యేకమైన దుస్తులు ధరించను గనుక, జుత్తుని కొన్ని విధాలుగా అలంకరించుకోను గనుక, ప్రతి మాటలోనూ నిట్టూర్పులు విడిచిపెట్టను గనుక … ఈ సొగసుకత్తెలు, అలవాటుగా ప్రేమనిప్రకటించేవారి పెదాలపై నిట్టూర్పులకు అలవాటు పడి “ఏమిటి? వాడా?” అంటుంటారు నా గురించి:” నేను ఒట్టేసి చెప్పగలను అతనికి ప్రేమంటే తెలీదు. లాభంలేదు. అతన్ని ఒక్కణ్ణీ ఉండనీండి.” ఇప్పటికీ అలాగే అనుకుంటారు… స్టెల్లా కి నా మనసు తెలిస్తే… నిజమే,…
-
పోర్షియా చిత్రపటం… విలియం షేక్స్పియర్, ఇంగ్లీషు కవి
ఇది షేక్స్పియర్ 400 వ వర్థంతి సంవత్సరం ఇది పోర్షియా సుందరి ప్రతిమా? ఏ దివ్యాంశ సంభూతుడు సృష్టికి అతిదగ్గరగా రాగలిగేడు? ఆ కళ్ళు కదుల్తున్నాయా? లేక, నా కనుగుడ్లమీద కదులుతూ అవి కదులుతున్నట్టు అనిపిస్తోందా? అవిగో విప్పారిన పెదాలు, మధురమైన శ్వాసతో దూరమయ్యాయి; ఎంత అందమైన పలువరుస అంత ప్రియమైన స్నేహితులని ఎడబాయ వలసివచ్చిందో గదా! ఇవిగో ఆమె కురులు, చిత్రకారుడు సాలీడులా ఆడుకున్నాడు; పురుషుల హృదయాలను కొల్లగొట్టడానికి పసిడివన్నె వల అల్లేడు, సాలెగూడులో…
-
స్త్రీల బృందగానం… ఏరిస్టొఫేన్స్, గ్రీకు కవి
వాళ్ళకి మనం పీడలమని మగవాళ్ళెప్పుడూ మనని నిందిస్తుంటారు: వాళ్ళ దుఃఖాలన్నిటికీ మూలకారణం మనమేనని పదే పదే చెబుతుంటారు; యుద్ధానికీ, కలహాలకీ, రక్తపాతానికీ, అన్ని తుంటరి పనులకీ, ఒకటేమిటి, కారణం మనమే! వాళ్ళకి మనం అంత పీడలమైనపుడు, మనని పెళ్ళెందుకు చేసుకుంటారు చెప్పు? మనల్ని ఇళ్ళలో భద్రంగా దాచుకుని మనగురించి అంత శ్రద్ధ ఎందుకు తీసుకుంటారు? మనం పొరపాటున బయటకి వెళ్ళవలసి వస్తే ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఎందుకుండలేరు? హమ్మయ్య పీడ విరగడయ్యిందని దేముడికి ధన్యవాదాలు చెప్పకుండా,…